మరణంలోనూ అవమానం

Sun,March 17, 2019 12:32 AM

తెల్లని ధోవతీ, బంగారు రంగు పట్టు కుర్తాలో ఉం దా భౌతికకాయం. మధ్యాహ్నం 2:30కి అఖిల భారత వైద్య విజ్ఞానసంస్థ (ఎయిమ్స్) నుంచి 9, మోతీలాల్ మార్గ్‌కు తీసుకువచ్చారు. భారత ప్రధానిగా 1991-1996 వరకూ ఉన్న పీవీ నరసింహారావు 2004 డిసెంబర్ 23న ఉదయం దాదాపు 11 గంటలకు మర ణించారు. భౌతికకాయానికి డ్రెస్సింగ్ చేసి ఇంటికి పంపడానికి రెండు గంటల సమయం పట్టింది. తొలుత అక్కడికి చేరుకున్నవారిలో చంద్రస్వామి ఉన్నారు. పీవీ కొంచెం దూరంగా పెట్టిన ఆయన 8 మంది సంతానం, ఆయనతో సన్నిహితంగా ఉండే మనుమలూ, మనుమరాండ్లు కూడా చేరుకున్నారు. బతికున్నప్పుడు తండ్రితో తీవ్రంగా విభే దించే జ్యేష్ట పుత్రుడు రంగారావు దుఃఖం పట్టనలవిగానట్టుగా ఉంది. అప్పుడు మొదలైనయి రాజకీయాలు: కేంద్ర హోంమంత్రి శివ రాజ్‌పాటిల్ పీవీ చిన్న కొడుకు ప్రభాకర్‌రావుతో భౌతికకాయా న్ని అంత్యక్రియలకు హైదరాబాద్‌కు తీసుకువెళ్లాలని సూచించా డు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఢిల్లీనే సరైన వేదిక అని భావించారు. ఎందుకంటే, పీవీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసింది ఎప్పుడో ముప్ఫై ఏండ్ల కిందట. ఆ తర్వాత కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా, కేంద్రమంత్రిగా, ప్రధానిగా ఆయన కార్య స్థలం అంతా ఢిల్లీనే. కానీ, కుటుంబసభ్యులు అంత్యక్రియలు ఢిల్లీలోనే చేస్తామన్న మరుక్షణం, కొంచెం మర్యాదస్తుడిగా ఉండే శివరాజ్‌జ్ పాటిల్ కూడా కొంచెం దురుసుగా ఇక్కడ చేస్తే ఎవ రూ రారు అనేశాడు. కొద్దిసేపటికి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆంతరంగికుడు, కశ్మీరీ కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ అక్కడికి చేరుకున్నాడు. ఆయన కూడా భౌతికకాయం హైదరా బాద్‌కు చేర్చాలనే అభ్యర్థించాడు. మరో గంట గడిచాక ప్రభాకర్ రావు మొబైల్ ఫోన్ మోగింది.

కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలోకి పీవీ భౌతికకాయాన్ని ఎం దుకు రానీయలేదని మన్మోహన్‌సింగ్‌ను ప్రశ్నిస్తే ఆయన తనకు తెలియదని బదులిచ్చాడు. ఆ రోజు అక్కడే ఉన్న మరో కాంగ్రెస్ నాయకుడు మాత్రం కుండబద్దలు కొట్టేశాడు. మేమందరం ఆ రోజు కార్యాలయం గేట్లు తెరుచుకుంటాయని ఆశించాం. కానీ పైనుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. అవి తెరువమని ఆదేశిం చగలిగేది ఒక్కరే. కానీ, ఆమె ఆ ఆదేశాలు ఇవ్వలేదు.


అటువైపు ఉన్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్‌రెడ్డి. ఇప్పుడే తెలిసింది నాకు. నేను అనంతపురం దగ్గరలో ఉన్నాను. సాయంత్రానికి ఢిల్లీ చేరు కుంటాను. నా మాటగా చెప్తున్నాను. హైదరాబాద్‌లో ఘనంగా అంత్యక్రియలు చేద్దాం. సాయంత్రం 6:30కు సోనియాగాంధీ ఆ ఇంట్లోకి అడుగుపెట్టారు. ప్రధాని మన్మోహన్, ప్రణబ్ ముఖర్జీ కూడా ఆమె వెంట వచ్చారు. అంత్యక్రియలు ఎక్కడ చేద్దామనుకుంటున్నారని ప్రభాకర రావును ప్రధాని మన్మోహన్ ప్రశ్నించాడు. వీళ్లందరూ హైద రాబాద్‌లో చేయమంటున్నారు. కానీ ఢిల్లీనే ఆయన కర్మభూమి అని ప్రభాకరరావు జవాబిచ్చాడు. మీరు కొంచెం మీ క్యాబినెట్ సహచరులతో మాట్లాడి వారిని ఒప్పించండని అభ్యర్థించాడు. మన్మోహన్ తల పంకించాడు. పక్కనే నిలబడ్డ సోనియా గాంధీ మౌనందాల్చింది. జర్నలిస్ట్ సంజయ్ బారు కూడా వచ్చాడు. ఆయన తండ్రి బి. పి.ఆర్.విఠల్‌కు పీవీ 1960ల నాటినుంచే పరిచయం. బారు ఇం టిముందు కారిడార్‌లోకి ప్రవేశించగానే సోనియా రాజకీయ సల హాదారు అహ్మద్‌పటేల్ అతని భుజం మీద మెల్లగా తట్టి మీకు ఈ కుటుంబం బాగా తెలుసు కదా. భౌతికకాయం హైదరాబా ద్‌కు తీసుకుపొమ్మని వారికి నచ్చచెప్పగలవా? అని అడిగాడు. బారు కారిడార్ చివరికి నడుస్తూ వెళ్తుంటే పక్కన ఒక గది నుంచి బిగ్గరగా రోదన వినపడింది. తిరిగిచూస్తే, అక్కడున్నది కళ్యాణి శంకర్. ఆమె పీవీకి రెండు దశాబ్దాలపాటు సన్నిహిత మిత్రురాలు. ఇదంతా జరుగుతుండగానే వైయస్ ఢిల్లీ చేరుకున్నాడు. అక్క డున్నది మన ప్రభుత్వమే. నన్ను నమ్మండి. భౌతికకాయం హైద రాబాద్‌కు తీసుకుపోనివ్వండి. అక్కడే గొప్ప స్మారక చిహ్నం కట్టి ద్దాం అని వైఎస్ ఆ కుటుంబాన్ని ఒప్పించాడు. అంత్యక్రియలు హైదరాబాద్‌లో చేసినా, కనీసం స్మారకచిహ్నం అయినా ఢిల్లీలో కట్టించాలని పీవీ కుటుంబసభ్యులు పట్టుబట్టారు. అక్కడున్న కాంగ్రెస్ నాయకులు సరేనన్నారు.

పీవీ మరణించాక పన్నెండేండ్లనా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయనను పట్టించుకున్నపాపాన పోలేదు. 2004 నుంచి 2014 వరకూ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ పీవీకి స్మారక చిహ్నం కట్టలేదు. ఆయన జయంతిని అధికారి కంగా జరుపలేదు. పీవీ కుటుంబమే ఆయన జయంతిని ఢిల్లీలో ప్రైవేట్‌గా జరిపేవారు. దీనికి ఆయన వ్యక్తిగత సిబ్బంది, మిత్రులు సాయం చేసేవారు.


కానీ పీవీ పట్ల అప్పటికే పార్టీ వ్యవహరిస్తున్న తీరు చూసిన పీవీ కుటుంబం ఎందుకైనా మంచి దని ఆ రాత్రే ప్రధాని మన్మోహన్‌సింగ్ నివాసానికి వెళ్లారు. ప్రధా ని నివాసంలో శివరాజ్ పాటిల్ సమక్షంలో తనని కలిసిన పీవీ కుటుంబసభ్యులతో మన్మోహన్ తప్పకుండా స్మారకచిహ్నం కట్టి ద్దామని వాగ్దానం చేశాడు. జరిగిన సంగతులు గుర్తుచేసుకుంటూ ప్రభాకరరావు తర్వాత ఇలా అన్నాడు. సోనియా గారికి నాన్న అంత్యక్రియలు ఢిల్లీలో జరుగడం గానీ, ఆయన స్మారకస్థూపం నిర్మించడం కానీ, అస లు ఆయనను ఒక జాతీయస్థాయి నాయకుడిగా చూడటం కానీ ఇష్టం లేకుండె. కానీ ఆ రోజు మా కుటుంబం మీద బాగా ఒత్తిడి పెట్టారు. అందుకే మేం ఒప్పుకోక తప్పలేదు. మరుసటిరోజు (24 డిసెంబర్ 2004), కమ్యూనిస్టుల నుం చి కాషాయవాదుల వరకూ రాజకీయ నాయకులంతా పీవీకి నివాళి అర్పించడానికి వచ్చారు. ఉదయం పదింటికి భౌతికకా యం మీద జాతీయజెండా కప్పి, పూలతో అలంకరించిన ఒక క్యారేజీ మీద పెట్టి, దాన్ని ఒక సైనిక వాహనంతో విమానాశ్ర యం వైపు ఒక ఊరేగింపుగా నడిపించారు. వెనుక సైనికులు నడి చారు. దారిలో 24, అక్బర్ రోడ్లో గల కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యా లయం వద్ద ఆగాలని ప్లాన్ చేశారు. ఆ కార్యాలయం పక్కనే సోని యాగాంధీ నివాసం ఉన్నది. ఊరేగింపు 24 అక్బర్ రోడ్ వద్దకు రాగానే వేగం తగ్గింది. కానీ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం గేటు మాత్రం మూసే ఉన్నది. అక్కడ చాలామంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు జమయ్యిండ్రు. కానీ పెద్దగా కార్యకర్తలను తరలిం చినట్టు లేదు. నినాదాల హోరు లేదు. మొత్తం స్మశాన నిశ్శబ్దం. వాహనం బయట పేవ్మెంట్ దగ్గర ఆగింది. సోనియా, ఇంకొంత మంది కాంగ్రెస్ నేతలు బయటికు వచ్చి నివాళులు అర్పించారు.

పార్టీ అధ్యక్షులుగా సేవలందించినవారు మరణిస్తే వారి పార్థీవ శరీరం పార్టీ కేంద్ర కార్యాలయంలోకి తీసుకుపోయి ప్రజల సం దర్శనార్థం ఉంచడం కాంగ్రెస్ పార్టీలో ఆనవాయితీ. పీవీ విష యంలో అలా జరుగకపోవడంతో అతని కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు. పీవీ మిత్రులొకరు అక్కడున్న ఒక మహిళా కాంగ్రెస్ నేతను గేట్లు తెరువమని అడిగినప్పుడు, ఆమె ఈ గేటు తెరుచుకోదని జవాబిచ్చిందట. అది నిజం కాదంటాడు ఆ మిత్రుడు. ఎందుకంటే కొన్నేండ్ల ముందు మాధవ్‌రావ్ సింథి యా మరణిస్తే, ఇదే గేటు తెరుచుకున్నది. కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలోకి పీవీ భౌతికకాయాన్ని ఎం దుకు రానీయలేదని మన్మోహన్‌సింగ్‌ను ప్రశ్నిస్తే ఆయన తనకు తెలియదని బదులిచ్చాడు. ఆ రోజు అక్కడే ఉన్న మరో కాంగ్రెస్ నాయకుడు మాత్రం కుండబద్దలు కొట్టేశాడు. మేమందరం ఆ రోజు కార్యాలయం గేట్లు తెరుచుకుంటాయని ఆశించాం. కానీ పైనుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. అవి తెరువమని ఆదేశిం చగలిగేది ఒక్కరే. కానీ, ఆమె ఆ ఆదేశాలు ఇవ్వలేదు. ఒక ఇబ్బందికరమైన అర్ధగంట గడిచాక శవపేటిక ఉన్న వాహ నం విమానాశ్రయం వైపు కదిలింది. వైమానిక దళ విమానంలో ఆ శవపేటిక ఉంచారు. సాయంత్రం 4:55కు హైదరాబాద్ చేరు కుందా విమానం. రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రివర్గం భౌతికకాయాన్ని రిసీవ్ చేసుకున్నారు. గోర్ఖా రెజిమెంట్ సైనికు లు గౌరవ వందనం చేశారు. ఒక గన్ క్యారేజీ మీద పెట్టి హైదరా బాద్ వీధుల గుండా ఊరేగింపుగా నడిపారు. హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న జూబ్లీ హాల్‌లో ఒక రోజంతా పీవీ భౌతికకాయం ప్రజల సందర్శనార్థం ఉంచారు. వేలాదిమంది అభిమానులు ఆయనను కడసారిగా దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ ఇచ్చిన మాట మేరకు హుస్సేన్‌సాగర్ ఒడ్డున నాలుగెకరాల స్థలం లో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయించాడు.

మరునాడు మధ్యా హ్నం ఒంటిగంటకు అంత్యక్రియలు జరిగాయి. ప్రధాని మన్మో హన్ ఢిల్లీ నుంచి వచ్చి అంత్యక్రియలకు హాజరయ్యాడు. సీని యర్ కాంగ్రెస్ నాయకుడు నట్వర్‌సింగ్ ఓ సందర్భంలో మాట్లా డుతూ ఢిల్లీలో పీవీ పార్థివదేహానికి జరిగిన అవమానానికి మన్మో హన్ చాలా బాధపడ్డాడని అన్నాడు. ప్రధానితో పాటు ఆయన క్యాబినెట్ సహచరులు, మాజీ ప్రధాని దేవెగౌడ, బీజేపీ నుంచి అద్వానీ హాజరయ్యారు. దాదా పు 12 వేల మంది సాధారణ పౌరులు - ఇందులో అనేకమంది ఆయన స్వగ్రామం వంగర నుంచి వచ్చినవాళ్ళు ఈ అంత్యక్రి యలకు హాజరయ్యారు. కానీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మాత్రం ఈ కార్యక్ర మానికి గైర్హాజరయ్యారు. సుమారు రెండు గంటల తర్వాత, వచ్చినవాళ్లంతా వెనుతిరిగే సమయానికి చితి ఇంకా మండుతూనే ఉన్నది. ఆ రోజు రాత్రి చితిమీద సగం కాలిన పీవీ శరీరాన్ని టీవీ చానెళ్లు చూపించాయి. పీవీకి చాలాకాలంగా సన్నిహితుడుగా ఉన్న పి.వి.ఆర్.కె.ప్రసాద్ ఒక టీవీ చానెల్ కోసం ఈ అంత్యక్రియలను కవర్ చేశాడు. పీవీ భౌతికకాయం సగం కాలిందనే వార్తలు నిజం కాదంటాడు ఆయన. చితిలో బూడిద ఒక శరీరాకృతిలో కనిపించిందనేది ఆయన అభిప్రాయం. పీవీకి మరణంలోనూ అవమానం జరిగిం దనే అభిప్రాయం ప్రజల మనసుల్లో నాటుకుపోయింది. ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించకుండా దేహాన్ని హైదరాబాద్‌కు బలవంతంగా తీసుకొచ్చారని, కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలోకి అనుమతించలేదని, పీవీకి జరిగిన అవమానం వల్లనే ప్రజల్లో ఆయన పార్థివదేహం పూర్తిగా చితిలో కాలలేదనే అభిప్రాయం ఏర్పడింది అన్నారాయన. పీవీ మరణించాక పన్నెండేండ్లనా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయనను పట్టించుకున్నపాపాన పోలేదు.

2004 నుంచి 2014 వరకూ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ పీవీకి స్మారక చిహ్నం కట్టలేదు. ఆయన జయంతిని అధికారి కంగా జరుపలేదు. పీవీ కుటుంబమే ఆయన జయంతిని ఢిల్లీలో ప్రైవేట్‌గా జరిపేవారు. దీనికి ఆయన వ్యక్తిగత సిబ్బంది, మిత్రు లు సాయం చేసేవారు. పీవీకి సన్నిహితంగా ఉంటున్నందుకు కాంగ్రెస్ అధిష్టానం దూరంపెట్టిన పంజాబ్ కాంగ్రెస్ నేత ఎం. ఎస్.బిట్టా ఈ జయంతి వేడుకలకు తనవంతు సాయం చేసేవా డు. ఢిల్లీలో జరిగే జయంతి వేడుకలకు జనాన్ని పంజాబ్ నుంచి బస్సులో తరలించేవాడు. వచ్చినవారెవరికీ పీవీ గురించి తెలి యకపోయినా ఏదో ఇంత తిండి దొరుకుతుందని ఆ పేదలు ఢిల్లీ దాకా వచ్చేవారని అంటారు సంజయ బారు. ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాత్రం క్రమం తప్పకుండా ఈ జయంతి కార్యక్రమానికి వచ్చేవాడు. ఆయనే అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్. పార్టీ అధినాయకత్వం మనోగతం తెలిసి ఈ ధిక్కరణ ఎందుకు చూపారని అడిగితే, పీవీ తనకు ఆర్థిక సంస్క రణల అమల్లో పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని, ఇది ఆయనకు నేను ఇచ్చే చిన్న నివాళి అని మన్మోహన్ చెప్పారు. పీవీకి దగ్గరి బంధువు కెప్టెన్ లక్ష్మీకాంతారావు ప్రస్తుతం టీఆర్ ఎస్‌లో ఉన్నారు. 2012లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూటమి భాగస్వామిగా ఉన్నప్పుడు వరంగల్లో పీవీ విగ్రహం పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి మెమెరాండం సమర్పించారు. కానీ స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆ పని జరుగనివ్వలేదు. ఇక్కడ విగ్రహం పెడితే, దానికి ఎప్పుడో ఒకప్పుడు దండ వేయాలి. ఎవరైనా ఆ దండ వేస్తున్న సమయంలో ఒక ఫొటో తీసి అధినేత్రి సోనియా కు పంపితే లేనిపోని తంటా అనేది వారి అభిప్రాయం కావచ్చని లక్ష్మీకాంతారావు అభిప్రాయం.

సోనియాగాంధీకి పీవీ నచ్చకపోవడానికి ప్రధాన కారణం నట్వర్‌సింగ్ మాటల్లో చెప్పాలంటే తాను ప్రధానిగా ఉన్నప్పుడు సోనియాగాంధీ చెప్పినట్టు వినాలని పీవీ అనుకోకపోవడమే. పీవీని విస్మరించడమే కాదు ఆయన వారసత్వానికి కూడా మకిలి అంటించే ప్రయత్నాలు జరిగాయి. ఆర్థిక సరళీకరణ అలోచన రాజీవ్‌ది, ఆచరణ మన్మోహన్‌సింగ్‌ది అన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటన పీవీ మెడకే చుట్టారు. కాంగ్రెస్ హయాం లో జరిగిన ప్రతి తప్పుకూ పీవీనే బాధ్యుడిని చేశారు. మంచి జరి గితే మాత్రం వేరెవరికో ఆ క్రెడిట్ ఇచ్చారు. పీవీ పేరు చెడగొట్టే పని కాంగ్రెస్ చేస్తుంటే, దానికి లెఫ్ట్ మేధావులు, పార్టీలు వంత పాడారు. తన వెనుక బలంగా నిలబడే వర్గం ఏదీ లేకపోవడం వల్ల ఈ దుష్ప్రచారం పీవీ ఇమేజ్‌ను దెబ్బతీసింది. కానీ ఇప్పుడా పరిస్థితి మారుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్‌ఎస్ పార్టీ పీవీకి సముచిత గౌరవం ఇచ్చింది. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ ప్రభు త్వమే పీవీ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది. పీవీ చరి త్రను పాఠ్యపుస్తకాల్లో చేరుస్తామని చెప్పింది. ఒక విశ్వవిద్యా లయానికి ఆయన పేరు పెట్టింది. ఆయన మరణించిన 11 ఏండ్ల కు 2015లో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పీవీ నరసింహారావు కు ఢిల్లీలో ఒక స్మారక చిహ్నం కట్టించింది.
మూలం: ది హాఫ్ లయన్, వినయ్ సీతాపతి
స్వేచ్ఛానువాదం: విక్రమ్ రెడ్డి

527
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles