అప్పుడే యాభై ఏండ్లా!

Sat,March 16, 2019 08:18 AM

1969 జ్ఞాపకాలు బాధిస్తున్నాయి. అప్పుడప్పుడే అది చలికాలమైనా వాతావరణం తెలంగాణ నినాదాలతో వేడెక్కుతున్నది.ఆ జనవరిలో ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రం వారు ఒక ఇంటర్‌వ్యూకు రమ్మన్నారు. ఆ ఇంటర్‌వ్యూ ఒక తతంగం అని తెలుసు. ఆస్క్రిప్ట్ రైటర్ ఉద్యోగాన్ని ఎవరికివ్వాలో ముందే నిర్ణయించుకున్నారనీ తెలుసు. అయి నా ఇంటర్‌వ్యూకు వెళ్లాను. ఎవరికి వడ్డించాలనుకున్నారో అతనికే వడ్డించారు. ఉద్యోగం రానందుకు బాధపడలేదు.

ఇందిరాగాంధీ పలు పథకాలు, పనికిరాని సూత్రాలతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నిర్వీర్యపరుచాలనుకున్నరోజులవి. ఔరంగజేబు ఒక ద్రోహి సహాయంతో గోలకొండ కోటను ఆక్రమించినట్లు ఇందిరాగాంధీ కొందరు ద్రోహుల అధికార లాలసతను ఆయుధంగా ఉపయోగించి 1969-71 తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని తాత్కాలికంగా నిర్వీర్యపరుచగలిగారు. అనతికాలంలోనే, 2001లో కేసీఆర్ నాయకత్వాన మహోద్యమం పెల్లుబుకి తెలంగాణ రాష్ట్ర అవతరణ తథ్యమని ఎవరూ ఊహించలేకపోయారు.

ఈమధ్య ఓ రోజు పొద్దున్నే మిత్రుడు వి.ప్రకాశ్ ఫోన్‌చేసి 1969 తెలంగాణ ఉద్యమ స్వర్ణోత్సవం గురించి ప్రస్తావించినప్పుడు ఆశ్చర్యం కలిగింది, అప్పుడే యాభై ఏండ్లా అని. గడియారం ముల్లు తిరుగుతుంటే కాలం ప్రవహిస్తున్నదన్నమాట. దేశమంతటా త్వరలో 17వ లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇవి మొదటిసారి. అన్ని స్థానాలకు (17) జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు. ఇంతవరకు తెలంగాణలో జరిగిన ఎన్నికలన్నీ చరిత్రాత్మకమైనవే. 50 ఏండ్ల కిందట 1969-71లలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నభూతో అన్నట్లుగా విజృంభించినప్పుడు దేశమంతటా లోక్‌సభ ఎన్నికలు జరిగాయి, తెలంగాణలో కూడా జరిగాయి. 1971 మార్చిలో జరిగిన 5వ లోక్‌సభ ఎన్నికలవి. అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో బలవత్ విలీనానికి గురై అన్నివిధాలా అణిచివేతకు గురవుతున్నది. తనదైన అస్తిత్వం, సముచిత గౌరవం, గుర్తింపు, ప్రాధా న్యం లేని ప్రాంతం. 1971 మార్చి ఎన్నికలప్పుడు తెలంగాణ ప్రాంతం లో లోక్‌సభ స్థానాలు 14. నాడు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న తెలంగాణ ప్రజా సమితి 14 స్థానాల్లో పోటీచేసి, 10 స్థానాల్లో ఘన విజయం సాధించింది.

Prabhakar-Rao
దేశమంతటా కనిపించిన ఇందిర ప్రభంజనాన్ని తట్టుకొని స్వరాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు సాహసవంతంగా ఇచ్చిన చరిత్రాత్మకమైన తీర్పు అది. గెలిచిన 10మంది టీపీ ఎస్ సభ్యులు హైదరాబాద్‌లో రాష్ట్ర శాసనసభ భవన ప్రాంగణం ఎదు ట, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహం దగ్గర ఆయన సాక్షిగా ప్రతిజ్ఞ చేసే కార్యక్రమం ఏర్పాటైంది. ప్రతిజ్ఞా పత్రం ఒకటి నన్ను రాయమంటే రాసిచ్చాను. వేలాది ప్రజల ఎదుట, తెలంగాణ నినాదాల హోరులో 5వ లోక్‌సభకు ఎన్నికైన టీపీఎస్ సభ్యులు ప్రతిజ్ఞా పత్రం అక్షర అక్షరం చదువుతూ ప్రమాణం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన పవిత్ర ఆశయానికి పునరంకితమవుతున్నామని, తెలంగాణ రాష్ట్రం సాధించేవరకు విశ్రమించబోమని పదిమంది సభ్యులు తమ ప్రమాణంలో హర్షధ్వానాల మధ్య ఉద్ఘోషించారు. ఒకవంక ఈ ప్రతిజ్ఞా స్వీకారం జరుగుతుండగానే మరోవంక ఢిల్లీలో, హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీలో టీపీఎస్ విలీనం చేసే కుట్రకు బీజావాపన జరిగింది.

ఏదో కుట్ర జరుగుతున్నదని వదంతులు పుట్టా యి. నిజం బయటపడింది. మూడు, నాలుగు నెలలకే తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసి టీపీఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 1969 మార్చి 9న హైదరాబాద్ రెడ్డి హాస్టల్ ఆవరణలో, తెలంగాణ విద్యార్థుల చరిత్రాత్మక సదస్సులో తెలంగాణ పతాకాన్ని ఆవిష్కరించిన తెలంగాణ శాసనసభ్యుడే ప్రజాసమితి విలీనం తీర్మానాన్ని వ్యతిరేకించడం, విలీనవాదుల తోక పట్టుకొని వాళ్లవెంట వెళ్లకపోవడం చరిత్రలో చెరిగిపోని యదార్థం. విలీనం ఫలితంగా పి.వి. రాష్ట్ర మంత్రివర్గంలో ముగ్గురు నలుగురు విలీనవాదులకు మంత్రి పదవులు లభించాయి. అధినేతకు గవర్నర్ పదవి లభించింది! ఉద్యమంలో సాహసవంతంగా పోరాడిన తెలంగాణ ప్రజలకు, విద్యార్థులకు మిగిలింది నిరాశా నిస్పృహలు. టీపీఎస్ విలీనం తర్వాత 1972 మార్చిలో పి.వి. నాయకత్వాన జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ అధిక స్థానాలు గెలువగలిగింది. ఈ రోజు తమ అయిదారుగురు శాసనసభ్యులు బయటికి వెళ్లడంతో భోరున ఏడుస్తున్న, ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని గగ్గోలు చేస్తున్న కాంగ్రె స్ నేతలు తమ గత చరిత్ర ఏమిటో గమనించాలె.

నీవు నేర్పిన విద్యయె నీరజాక్ష అంటారు పెద్దలు!

1969 జ్ఞాపకాలు బాధిస్తున్నాయి. అప్పుడప్పుడే అది చలికాలమైనా వాతావరణం తెలంగాణ నినాదాలతో వేడెక్కుతున్నది. ఆ జనవరిలో ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రం వారు ఒక ఇంటర్‌వ్యూకు రమ్మన్నారు. ఆ ఇంటర్‌వ్యూ ఒక తతంగం అని తెలుసు. ఆస్క్రిప్ట్ రైటర్ ఉద్యోగాన్ని ఎవరికివ్వాలో ముందే నిర్ణయించుకున్నారనీ తెలుసు. అయి నా ఇంటర్‌వ్యూకు వెళ్లాను. ఎవరికి వడ్డించాలనుకున్నారో అతనికే వడ్డించారు. ఉద్యోగం రానందుకు బాధపడలేదు. తర్వాత ఢిల్లీలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో మరో ఉద్యోగం వచ్చింది, పోయింది. అదీ అప్పటి తెలంగాణ దీనస్థితి. అంతా మన మంచికే అనిపించింది. 1969 తెలంగాణ ఉద్యమంతో కలిసి నడువడానికి మహదవకాశం లభించింది. రాష్ట్రంలో, కేంద్రంలో అమానుష ప్రభుత్వాలతో, పాలకవర్గంతో కొట్లాడిన ప్రజా ఉద్యమం అది. ఆ ఉద్యమ సందర్భాన పలు పత్రికలకు సం పాదకత్వం వహించిన, ప్రచార కార్యక్రమంలో భాగస్వామిని అయిన నాకు నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను!.. అన్న సంతృప్తి మిగిలింది.

1969 మార్చి 9 విద్యార్థుల సదస్సును (రెడ్డి హాస్టల్) సాయంత్రం 5 గంటలకు అప్పటి ఓయూ వైస్ ఛాన్స్‌లర్ రావాడ సత్యనారాయణ ప్రారంభించబోతుండగా గంటముందు నాకో పరీక్ష ఎదురైంది. విద్యార్థి నాయకులు ఒక స్వాగత గీతంతో సదస్సు ప్రారంభం కావాలన్నారు. సదస్సు వేదిక పక్కనే కూర్చుని నేను రాసిన స్వాగత గీతం ఈ వేళ తెలగాణ ఇనుప గొలుసులు తెంచ కదలివచ్చిన మీకు ఇది యే స్వాగతము.. అందులోనిదే మరో వాక్యం మేలుకో తెలగాణ మేలుకో, మేలుకొని నిన్ను నువు ఏలుకో... ఈ గీతం వందలాది విద్యార్థులు ఆలాపించగా నడిరాత్రి వరకు నడిచిన సదస్సులో వేలాది విద్యార్థులను ఉత్తేజపరి చింది. మహానాయకుడు కేసీఆర్ నాయకత్వాన మలిదశ నిర్ణయాత్మక ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం అవతరిస్తుందని, తెలంగాణ తననుతాను ఏలుకుంటుందని ఊహించని రోజులవి. తెలంగాణ పత్రికలు, ప్రచార కరపత్రాలు, ప్రత్యేక సంచికల ప్రచురణ కోసం రాత్రంతా, తెల్లారేవరకు గ్యాలీల వద్ద కంపోజిటర్ల పక్కనే నిల్చోవలసి వచ్చేది. గ్యాలీ ప్రూఫులు చదువడంతో చేతులు మసి అయ్యేవి. పోలీసుల భయం వల్ల రాత్రిళ్లు పనిచేసేవాళ్లం. అయినా, ఒక నడిరాత్రి నారాయణగూడ పోలీసులు దాడిచేసి కంపోజ్ అయి, పేజ్ మేకప్ అయిన పేజీలను ధ్వంసం చేశారు. అప్పుడు ప్రచురితమైంది1969 ఉద్యమంపై నేను రాసిన మూడు గంట ల ఒక బుర్రకధ తెలంగాణ విజయం. అది అప్పటి తెలంగాణ ప్రజాసమితి ప్రచురణగా వచ్చింది.

తెలంగాణ ప్రజాసమితి నామకరణం కూడా ఒక విచిత్ర ఉదంతం. తెలంగాణ కన్‌వెన్షన్ పేరిట అప్పటికి ఉద్యమం నడుస్తున్నది. ఒక కొత్త పేరుతో, విశాల వేదికపై ఉద్యమం తెలంగాణ నలుమూలల విస్తరించాలన్న ఆలోచనతో ఓరోజు సాయంత్రం గౌలిగూడ రామాలయం దగ్గర (హైదరాబాద్) తెలంగాణ వతన్‌దార్ల సంఘం కార్యాలయంలో సమావేశమైనాం. తెలంగాణ ప్రజాసమితి అన్న పేరు బాగుంటుందని నిర్ణయించాం. ఈ సమావేశంలో పాల్గొన్నవాళ్ల ఇండ్లమీద అదేరోజు నడిరాత్రి సెంట్రల్ ఇంటెలిజెన్స్, స్టేట్-సిటీ బ్రాంచీల వాళ్లు పోలీస్ యాక్షన్ జరిపినట్లు వచ్చిపడ్డారు. ఎవరెవరు సమావేశంలో పాల్గొన్నారు, డబ్బులెక్కడి నుంచి వస్తాయి, ఏం చేయాలనుకుంటున్నారు, వెనుక ఎవరి హస్తం ఉంది మొదలైన సవాలక్ష ప్రశ్నలను కుప్పించారు. రహస్యం ఏదో ఉంది, అది బయటపడటం లేదన్నది వాళ్ల అసంతృప్తి!
1969 ఉద్యమం జ్ఞాపకాలు అనేకం. నిజానికి ఆ ఉద్యమం 1971 వరకు సాగింది.

ఆ కాలంలోనే వి.వి.గిరి (ఇందిరా గాంధీ అభ్యర్థిగా) రాష్ట్రపతి పదవికి ఎన్నికై నీలం సంజీవరెడ్డిని ఓడించారు. రాజమండ్రి జైలులో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇందిరాగాంధీ జండా కింద పోగయి గిరిని గెలిపించడానికి దోహదపడ్డారు. తెలంగాణ ఉద్యమం విజృంభించడంతో హైదరాబాద్ జంట నగరాల్లో కర్ఫ్యూ విధించారు. ఇందిరాగాంధీ నడిరాత్రి హైదరాబాద్ వచ్చివెళ్లారు. తెలంగాణ ప్రజాసమితి బ్రహ్మానందరెడ్డి బలగాలను, ఎత్తులు జిత్తులను ఛేదించి ఇద్దరు అభ్యర్థులను రాష్ట్ర శాసనసభకు, ఒక అభ్యర్థిని రాష్ట్ర శాసనమండలికి గెలిపించుకోగలిగింది. ఆ రోజుల్లోనే వి.కె.కృష్ణమీనన్ ఓయూ సమావేశంలో ప్రసంగించారు. ఇందిరాగాంధీ పలు పథకాలు, పనికిరాని సూత్రాలతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నిర్వీర్యపరుచాలనుకున్న రోజులవి. ఔరంగజేబు ఒక ద్రోహి సహాయంతో గోలకొండ కోటను ఆక్రమించినట్లు ఇందిరాగాంధీ కొందరు ద్రోహుల అధికార లాలసతను ఆయుధంగా ఉపయోగించి 1969-71 తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని తాత్కాలికంగా నిర్వీర్యపరుచగలిగారు. అనతికాలంలోనే, 2001లో కేసీఆర్ నాయకత్వాన మహోద్యమం పెల్లుబుకి తెలంగాణ రాష్ట్ర అవతరణ తథ్యమని ఎవరూ ఊహించలేకపోయారు.

1969 ఉద్యమ ప్రారంభంలో ఓ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని ఫీల్కానాలోని కొండా వెంకటరంగారెడ్డి నివాసానికి వెళ్లవల సి వచ్చింది. వృద్ధాప్యంతో పాటు ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నది. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ తెలంగాణ రాష్ట్రం అవతరించాలన్న ఆయన సంకల్పం మాత్రం చెక్కుచెదరలేదు. ఆయన ఆ రోజు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి ఒక వివరమైన లేఖ రాయాలనుకున్నారు. మంచం మీద పడుకొని ఆయన డిక్టేట్ చేసిన దీర్ఘ లేఖను రాసే అవకాశం నాకు లభించింది. నాటి ఉద్యమంలో ప్రచారం కోసం ఆరాటపడకుండా తమవంతు పాత్రను శక్తివంతంగా నిర్వహించిన వారు అనేకులు. వారు చిరస్మరణీయులు.

601
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles