కోతుల బెడద

Fri,March 15, 2019 11:28 PM

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రైతుబంధు, రైతు బీమా, 24 గంటల నిరంతర విద్యుత్ లాంటి సంక్షే మ పథకాలన్నీ రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతి ష్ఠాత్మకంగా తీసుకొని అమలుచేస్తున్నది. ప్రభుత్వం నుం చి రెండు పసళ్లకు కలిపి ఏటా రూ.8 వేలు అందుకుంటు న్న రైతులు వ్యవసాయంలో ఆత్మవిశ్వాసంతో ముందు కుపోతూ, వినూత్న పద్ధతులకు శ్రీకారం చుడుతున్నారు. వివిధరకాల ఆహార, కూరగాయల పంటలను సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కానీ, కొన్నిచోట్ల రైతులు విం తైన కష్టాలు ఎదుర్కొంటున్నారు. వేసిన పంటలను కోతు ల బెడద నుంచి రక్షించుకోలేక యాతనలు పడుతున్నా రు. కొన్నిచోట్ల అయితే కోతుల బాధ పడలేక పంటలు వేయటమే మానేసిన పరిస్థితులున్నాయి. కాబట్టి కోతుల బెడదను తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసు కోవాలి. కోతులను అడవులకు తరలించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
- అన్నాజి రాజేందర్, వివేకానందపురి, కరీంనగర్

పటిష్ఠమైన జట్టు తయారుచేయాలె

ఇంగ్లండ్‌లో జరిగే ప్రపంచకప్ సమరానికి ముచ్చట గా మూడునెలలు కూడా లేదు. విదేశాల్లో అన్ని విధా లా ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తడబ డటం విస్మయం కలిగించింది. మొదటి రెండు మ్యాచ్ ల్లో గెలిచిన టీమిండియా ఆఖరి మూడు మ్యాచ్‌ల్లో వరుసగా ఓటమిపాలవటం జట్టు కూర్పు, ఆటగాళ్ల ఫామ్‌పై అనుమానాలు రేకెత్తాయి. ఇటు టీ-20, అటు వన్డే సిరీస్‌లు ఆస్ట్రేలియాకు సమర్పించుకొని ప్రపంచకప్‌నకు ముందు సగటు భారత అభిమానిలో నిరాశ మిగిల్చటం బాధాకరం. జట్టు కూర్పుపై ఇంకా తర్జనభర్జన పడుతున్నట్లుగా కనిపిస్తున్నది. రెండవ వికెట్‌కీపర్, నాలుగో నెంబర్ బ్యాట్స్‌మెన్‌పై చర్చోపచ ర్చలు జరుగుతున్నాయి. ప్రపంచకప్‌నకు సమయం తక్కువగా ఉన్నది కాబట్టి బీసీసీఐ పటిష్ఠమైన జట్టును ఇంగ్లండ్ పంపేందుకు కృషిచేయాలి. ప్రధానంగా ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్‌ను పరిగణనలోకి తీసుకోవాలి.
- బుర్ర రాఘవేంద్ర గౌడ్, అంబర్‌పేట్, హైదరాబాద్

141
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles