శాంతిభూమిలో అసహనం


Fri,March 15, 2019 01:15 AM

బాభారతీయ మీడియా, ముఖ్యంగా టీవీ రక్తపు చారికలనే ఘన విజయాలుగా ప్రదర్శిస్తున్న కాలం ఇది. మీడియా తీరుపై వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనంలో ఈ విధం గా చెప్పుకొచ్చింది.. పుల్వామా దాడి తర్వాత రెండు వారాలుగా ప్రజలను తప్పుదారి పట్టించే అనేక కథనాలు యథేచ్ఛగా ప్రసారమవుతున్నాయి. వాస్తవాలను కప్పిపెడుతున్న తీరు ఎక్కువగా ఉంటున్నది. భారతీయ మీడియా అయితే పాత్రికేయ విలువలకు కట్టుబడి ఉండటం మరి చిపోయింది. ప్రభుత్వం తరఫున వకల్తా పుచ్చుకొని కథనాలను మీదేసుకొని ప్రసారం చేస్తున్నది. ఈ క్రమంలో చాలా టీవీల్లో న్యూస్ రూములన్నీ వార్ రూములుగా మారిపోయాయి. యాంకర్లు మిలిటరీ డ్రెస్సు లు వేసుకొని యుద్ధ తంత్రాలు రచిస్తున్నారు. దాడుల తీరును ఘనవిజయాలుగా కీర్తిస్తున్నారు. ఊహలకు, వాస్తవాలకు మధ్యనున్న సన్నని రేఖను తుడిపేశారు. కొందరు జర్నలిస్టులైతే ట్విట్టర్ వేదికగా విజృంభిస్తు న్నారు. ప్రధాని నరేంద్రమోదీనే ఈ పరిస్థితికి కారణం. ఒక రాజకీయ నాయ కుడిగా ఆయన తనదంటూ ఒక వ్యూహం ప్రకారం వ్యవహరిస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఈ పరిస్థితిని వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు ప్రధాని మోదీ వ్యవహారసరళి చూస్తే తెలిసిపోతున్నది. మోదీ సంగతి సరే, కానీ ప్రజాస్వామ్యంలో నాలుగో మూల స్తంభంగా చెప్పుకునే మీడియా అత్యుత్సాహానికి ఎందుకు పోతున్నది? అంటే అందుకు ఒకేఒక సమాధానం కనిపిస్తున్నది. దేశంలోని నగరాల్లో ఈ విధమైన భావోద్వేగాన్ని సృష్టించి దాని పునాదులపై ఓట్ల రాజకీయం చేయటానికి బీజేపీ ప్రయత్నిస్తున్న తరుణం ఇది. ఇవ్వాళ నగరాల్లోని సంఘపరివార్ శక్తులే భారతీయతకు ప్రతీకగా చెప్పుకుంటూ దేశాన్ని వెనుకకు తీసుకెళ్తున్నాయి.


ఇది గౌతమ బుద్ధుడు పుట్టిన దేశం. ఛాందసవాద బల్లూకపు పట్టు నుంచి విముక్తి కోసం సూఫీ, భక్తి ఉద్యమాలు పురుడు పోసుకున్న దేశం. శాంతి సహజీవనాన్ని ప్రబోధిస్తూ తరతరాలుగా ప్రేమను పంచిన వారసత్వం కలిగిన దేశం. ఒక్క రక్తపు చుక్క చిందకుండానే, తుపాకీ బుల్లెట్ అవసరం లేకుండానే బ్రిటిష్ వలస పాలకులను పారదోలిన మహాత్మా గాంధీని కన్న దేశం. కానీ ఇప్పుడు ఈ దేశం ప్రతీకార జ్వాలల్లో రగిలిపోయే స్థితి వచ్చింది.


ఈ నేపథ్యంలోనే ఇవ్వాళ దేశంలో మున్నెన్నడూ లేనిస్థాయిలో మత సంప్రదాయ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పెద్దపెద్ద విగ్రహాలను ఊరేగిస్తున్నారు. యాత్రా స్థలాలైన అమర్‌నాథ్, వైష్ణవీ దేవీ ఉత్సవాలను, యాత్రలను మతంతో లంకె వేసి చెబుతున్నారు. గంగా, యమునా కుంభమేళాల పేరుతో నదుల్లో మునకలను ప్రోత్సహిస్తూ.., నదుల పరిశుద్ధి కార్యక్రమాన్ని పవిత్ర కార్యంగా చేపడుతున్నారు. ఈ కొత్త భారత్‌కు ప్రతీకగా చెప్పబడుతున్న వారు ఇప్పటికీ కొద్ది మం దే. 2014 ఎన్నికలను ప్రాతిపదికగా తీసుకొని చూస్తే నరేంద్ర మోదీకి ఓటేసిన వారు 31 శాతం మాత్రమే. ఈ పరిస్థితి ఇలా ఉంటే ప్రాచీన భారత్‌గా పిలువబడుతున్న మెజార్టీ గ్రామీణ భారతం ఏం చేస్తున్నది? దేనికి మద్దతుగా నిలుస్తున్నది, దేన్ని రక్షిస్తున్నది? దీనికి అనేక కారణాలున్నాయి. దేశ రాజకీయరంగంలో ఏర్పడిన శూన్యమే దీనికి కారణంగా చెప్పవచ్చు. ఈ రాజకీయ శూన్యతకు కాంగ్రెసే ప్రధాన కారణం. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కానీ, ఆయన ముఖ్య సలహాదారు లు కానీ భారతీయ హిందూ సమాజ మౌలిక భావనలను సరిగా అర్థం చేసుకోలేకపోయారు. ఇది బహుళత్వంతో పటిష్టంగా అల్లుకున్న సమా జం. ఈ సమాజపు నీతి ఏమంటే నీవు జీవించు, ఇతరులనూ జీవించనీ యి. అందుకని వారు హిందూ సమాజాన్ని తక్కు వచేసి చూపే ఏ ప్రయత్నాన్నీ జీర్ణించుకోలేరు, ఒప్పుకోలేరు. ఈ నేపథ్యంలోంచే.. కాంగ్రెస్ మెతక హిందుత్వాన్ని అనుసరిస్తున్నది. మోదీ ప్రభుత్వం చెబుతున్నదానికి ఎలాంటి మార్పుచేర్పులు లేకుండా మద్దతు పలికింది. ఉత్తర భారతంలో వివిధ ప్రాంతాల్లో వందలాది మం ది కశ్మీరీ యువతను తమ ప్రాంతం విడిచి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరికలు చేస్తున్నా, భౌతికదాడులకు దిగుతున్నా వాటి పట్ల మౌనం దాల్చటమే తప్ప, కాంగ్రెస్ అడ్డుకోలేకపోయింది.

బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకును ఎలా పొందవచ్చో, దాన్ని ఎలా సమీకృతం చేయాలో కాంగ్రెస్ నాయకత్వానికి అర్థం కాకపోవటం విషాదం. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేయటంలో రాహుల్ అనుభవరాహిత్యం బయటపడుతున్నది. వివిధ రాష్ర్టాల్లో కాంగ్రెస్‌కు ఉన్న శక్తి, ఓట్ల శాతాన్ని చూసుకోకుండానే ఇతర పార్టీలతో సర్దుబాట్లలో అతిగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రతిపక్ష ఐక్యతకు భంగం వాటిల్లుతున్నది. బీజేపీ వ్యతిరేక శక్తులలో చీలిక వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ వ్యతిరే కశక్తిని, ఓటు బ్యాంకును విచ్ఛిన్నం చేసి పరోక్షంగా బీజేపికి సాయపడుతున్నాడు. ఢిల్లీలో బీజేపీని ఎదుర్కొనేందుకు కలిసి పోటీ చేద్దామని ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకువచ్చింది. కానీ కాంగ్రెస్ మరీ ఎక్కువ సీట్లు కోరింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తున్నాయి.


ఈ క్రమంలోంచే అల్ప సం ఖ్యాకవర్గాల్లో, గ్రామీణ భారతంలోని మెజార్టీ వర్గంలో కాంగ్రెస్ విశ్వాసాన్ని పాదుకొల్పలేకపోతున్నది. అంతేగాక వారికి రక్షణ ఉంటుందన్న భరోసా కల్పించలేకపోయింది. ఈ నేపథ్యంలో వారి ఓట్లు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఎలా ఉంటాయి? ఇక ఈ వర్గాల వారు కాంగ్రెస్‌కు ఎం దుకని ఓటేస్తారు? ప్రధాని మోదీ తనదైన విధానాలు, ఎత్తుగడలతో ప్రతిపక్షాలను ఇరుకునపెట్టే వ్యూహంలో విజయం సాధించారు. బాలాకోట్ దాడిలో ఉన్న సహేతుకతను, వివరణలను కూడా అడుగకూడని బలహీనతలోకి కాం గ్రెస్‌ను, ఇతర ప్రతిపక్ష పార్టీలను నెట్టారు. ఇదంతా మోదీ వ్యూహాత్మ కంగా ఆడిన రాజకీయ క్రీడ. ఎన్నికల్లో లబ్ధి పొందటం కోసం పన్నిన వ్యూహం. ఇందులో మీడియాను పకడ్బందీగా భాగం చేశారు మోదీ. ఏ ఒక్కరు భిన్నాభిప్రాయం కలిగి ఉన్నా దేశ భద్రతను విస్మరించినవారు గా, దేశద్రోహులుగా, ఉగ్రవాదుల మద్దతుదారులుగా ప్రచారం చేశాడు. ఏదేమైనా ఈసారి జరిగే సాధారణ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా చేసుకొని చేసిన రాజకీయ లక్షిత దాడి ఇది. మోదీ తన వ్యవహార సరళితో మెజార్టీ ప్రజలను ఆకట్టుకునే ప్రయ త్నం చేస్తున్నారు. కానీ ఈ క్రమంలో దేశంలో మెజార్టీ ప్రజల ప్రయోజనాలను మాత్రం గాలికి వదిలేశారు. పెద్ద నోట్ల రద్దు ఇందుకు ఒక ప్రబల ఉదాహరణ. పెద్దనోట్ల రద్దుతో ఆర్థికవ్యవస్థ కుదేలైంది. వ్యవసాయ రం గం సంక్షోభంలో కూరుకుపోయింది. నిరుద్యోగం పెరిగిపోయింది. పారిశ్రామిక రంగం సంక్షోభంలో చిక్కుకున్నది. చిన్నతరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయి. గ్రామీణ రంగం నష్టపోయింది. మద్యతరగతి ప్రజలు కూడా కష్టాల పాలయ్యారు. ఈ ఐదేండ్లలోనే కోటి పదిలక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు.

మోదీ గత ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను వేటినీ అమలు చేయలేదు. కానీ మళ్లీ ఎన్నికలు రావడంతో వాటి ప్రస్తావన రాకుండా చేస్తున్నారు. ఈ దేశభక్తి, పాక్‌పై లక్షితదాడు లను ఎన్నికలలో ఓట్లు పొందటం కోసం ఉపయోగించుకుంటున్నారు. మోదీకి ప్రత్యామ్నాయంగా రాహుల్‌గాంధీ మాత్రమే దిక్కుగా మిగిలిపోవటం ఒక పెద్ద విషాదం. ఇదే దేశ ప్రజలు చేసుకున్న పాపం. బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకును ఎలా పొందవచ్చో, దాన్ని ఎలా సమీకృతం చేయాలో కాంగ్రెస్ నాయకత్వానికి అర్థం కాకపోవటం విషాదం. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేయటంలో రాహుల్ అనుభవ రాహిత్యం బయ టపడుతున్నది. వివిధ రాష్ర్టాల్లో కాంగ్రెస్‌కు ఉన్న శక్తి, ఓట్ల శాతాన్ని చూసుకోకుండానే ఇతర పార్టీలతో సర్దుబాట్లలో అతిగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రతిపక్ష ఐక్యతకు భంగం వాటిల్లుతున్నది. బీజేపీ వ్యతిరేకశక్తులలో చీలిక వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ వ్యతిరేకశక్తిని, ఓటు బ్యాంకును విచ్ఛిన్నం చేసి పరోక్షంగా బీజేపికి సాయపడుతున్నాడు. ఢిల్లీలో బీజేపీని ఎదుర్కొనేందుకు కలిసి పోటీచేద్దామని ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకు వచ్చింది. కానీ కాంగ్రెస్ మరీ ఎక్కువ సీట్లు కోరింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అనాలోచితంగా అన్ని సీట్లకు పోటీ చేస్తున్నది. కేవలం 5.5 ఓటు శాతం కలిగిన కాంగ్రెస్ 52 శాతం ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీతో ఎన్నికల అవగాహనకు రాకపోవడం రాహు ల్ గాంధీ అనుభవరాహిత్యమే. ఇదే రీతిలో ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర రాష్ర్టా ల్లో కూడా కాంగ్రెస్ తన శక్తికి మించి పోటీకి దిగి ప్రతిపక్ష ఐక్యతను విచ్ఛి న్నం చేస్తున్నది.
prem-shankar-jha
దేశంలో అన్నిరకాల ప్రజాస్వామ్యశక్తులపై దాడులు, నిర్బంధాలు పెరిగిపోయాయి. అల్పసంఖ్యాక వర్గాలు, దళితులపై దాడులు జరుగుతున్నాయి. న్యాయవ్యవస్థతో పాటు, అన్ని ప్రభుత్వరంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసి బీజేపీ యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నది. ఒక్కమాట లో చెప్పాలంటే దేశంలో రాజ్యాంగబద్ధమైన పాలన సాగటం లేదు. మోదీ ప్రభుత్వం దేశంలో సమాఖ్య విలువలకు తిలోదకాలిచ్చింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులపాలు చేస్తున్నది. మరోసారి బీజేపీ అధికారంలో కి వస్తే ప్రజాస్వామ్యానికి, ఐక్యతకు బలం చేకూరుతుందని మోదీ చెబుతున్నారు. కానీ అంతకన్నా ఎక్కువగా భారతీయ సమతా సాంస్కృతిక జీవ నం ప్రమాదంలో పడుతుంది.
(వ్యాసకర్త: ఢిల్లీ కి చెందిన జర్నలిస్టు, రచయిత)
ది వైర్ సౌజన్యంతో...

663
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles