బాబు మతిమరుపులు!


Fri,March 15, 2019 01:15 AM

మనిషికి వృద్ధాప్యంలో అల్జీమర్స్ వ్యాధి సోకుతుందంటారు. ఈ అల్జీమర్స్ వ్యాధి సోకినవాళ్లు జ్ఞాపకశక్తి కోల్పోవడం, తాను మాట్లాడిన మాటలను గుర్తుపెట్టుకోకపోవడం, అప్పుడప్పుడు దగ్గరివారిని కూడా గుర్తించకపోవడం చేస్తూంటారు. గతంలో తాను వెలిబుచ్చిన అభిప్రాయాలను అంగీకరించకపోవడంతో పాటు తన మాటలు కూడా నత్తిపోతూ ఉంటాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహారశైలి చూస్తుంటే అతనికి అల్జీమర్స్ వ్యాధి సోకిందా అనే అనుమానం కలుగుతున్నది. ఈ మధ్య అతను గతంలో మాట్లాడిన మాటలకు విరుద్ధంగా అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నాడు. దీనికి అనేక ఉదాహరణలున్నాయి. చంద్రబాబు భారతీయ జనతా పార్టీతో సఖ్యతగా ఉన్నప్పుడు నేను దేశంలో ఒక సీనియర్ రాజకీయనాయకుడిగా ఎన్నో ఏండ్ల నుంచి ఎంతమంది ప్రధానులను చూశాను, కానీ మోదీ లాంటి సమర్థుడైన నాయకున్ని చూడలేదు అంటూ ప్రధాని మోదీని ఆకాశానికెత్తుకున్నాడు. చంద్రబాబుకు మోదీ ప్రభుత్వంతో విబేధాలు వచ్చినప్పటినుంచి మోదీకి నాయకత్వ లక్షణాలు లేవు, అతనొక ముఠా నాయకుడు, అసలు చెప్పాలంటే అతని కి ప్రధానిగా ఉండే అర్హత లేదు అంటున్నాడు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే అతనికి గతం జ్ఞాపకం లేనట్టుగా అనిపిస్తున్నది. కేంద్రం ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దుచేసినప్పుడు చంద్రబాబు ఇది మంచి నిర్ణయం, నిజానికి ఈ నిర్ణయం తీసుకోవాలంటూ మోదీకి నేనెప్పుడో చెప్పాను అన్నాడు. ఇప్పుడేమో పెద్దనోట్ల రద్దు నిర్ణయం పిచ్చి తుగ్లక్ చర్య, దానివల్ల ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. దేశ ఆర్థిక ప్రగ తి దారుణంగా దెబ్బతిన్నది అంటున్నాడు.


దేశంలో గుణాత్మకమార్పు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను పక్కనబెట్టి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కృషిచేస్తున్నారు. ఈ ప్రయత్నాలను హేళన చేస్తూ చంద్రబాబు వెకిలిగా నవ్వుతున్నాడు. ఇది చంద్రబాబు సంస్కారాన్ని తెలియజేస్తున్నది. మాట్లాడితే నేనే సీనియర్‌ను అని చెప్పుకునే చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ఎందుకు కాపీ కొడుతున్నాడో చెప్పాలి.


పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రధా ని మోదీ డిజిటల్ సిస్టంను పెంచాలని, దానికోసం సిఫారసులు చేయాల ని ఏపీ సీఎం చంద్రబాబును చైర్మన్ చేస్తూ ఒక కమిటీని కూడా వేశారు. ఆ కమిటీ పరిశ్రమించి ప్రభుత్వానికి తమ సిఫారసులు చేయడం తెలిసిం దే. ఇవన్నీ పక్కనపెడితే తాజా ఉదాహరణ చంద్రబాబు కేంద్రంపై ముఖ్యంగా మోదీపై చేస్తున్న విమర్శలకు మూలకారణం ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ప్రత్యేక హోదా. ఈ విషయంలో చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ప్రతి ఒక్కరికి విస్మయం కలిగిస్తున్నది. మొదటి నాలుగేండ్లు మోదీ చంకలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాకు చంద్రబాబు వ్యతిరేకంగా మాట్లాడాడు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న వైసీపీ మేధావి ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్‌ను, నటుడు శివాజీని విమర్శించారు. ప్రత్యేక హోదా ఎందుకు? దానికి సమానంగా కాకుంటే, ఇంకా ఎక్కువ ప్రయోజనాలున్న ప్రత్యేక ప్యాకేజీ చాలు అన్న పెద్దమనిషి ప్రత్యేక హోదా విషయంలో స్పష్టంగా ఉన్న మోదీ, జగన్, కేసీఆర్‌లను జతకట్టడం విచిత్రం. ఇది చంద్రబాబు ద్వంద్వనీతికి నిదర్శనం. తానే స్వయంగా అసెంబ్లీలో ప్రత్యేక ప్యాకేజీ కోసం తీర్మానం చేసిన విషయం కూడా మరిచిపోయినాడంటే చంద్రబాబుకు అల్జీమర్స్ వ్యాధి ఉన్నట్లా లేనట్లా? చంద్రబాబు ఇప్పటివరకు ఏ ఎన్నికల్లో స్వయంగా పోటీకి దిగలేదు. రోజుకో పార్టీతో జతకడుతూ, పూటకో మాట మారుస్తూ అసలు ఎటువం టి పొత్తులేని వైసీపీని, టీఆర్‌ఎస్‌ను ఒక గాట కడుతూ ఇష్టారీతిన విమర్శిస్తున్నాడు. ప్రత్యేక హోదా విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్‌కు మద్దతుగా నిలిచారు.

తెలుగు రాష్ర్టాలు సమాంతరంగా అభివృద్ధి చెందాలంటూ ఆకాంక్షించి అమరావతి రాజధా ని నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి వెళ్లి మరీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదంతా పక్కనబెట్టిన చంద్రబాబు కేసీఆర్‌ను దెబ్బతీయాలని మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బద్ధ శత్రువైన కాంగ్రెస్‌తో సైతం పొట్టు పెట్టుకునేందుకు కూడా వెనుకాడలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ విషయంలో కూడా ఇలాగే దంద్వనీతిని పాటించాడు. తెలంగాణలో నేను లేఖ ఇచ్చినందుకే రాష్ట్ర విభజన జరిగింది అంటాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి రాష్ర్టాన్ని అడ్డగోలుగా విభజించారంటాడు. ఆస్తులు తెలంగాణకు, అప్పు లు ఆంధ్రప్రదేశ్‌కు అంటూ బీద అరుపులు అరుస్తూ ఉంటాడు. ఆంధ్రప్రదేశ్‌కు అప్పులే ఉంటే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉందని ఎలా డబ్బా కొట్టుకుంటాడో అర్థం కాదు. ఎన్నికల ఫలితాలపై తరచూ మాట మారుస్తూ ఉంటాడు చంద్రబాబు. 2014లో తాము గెలిచినప్పుడు ప్రజాస్వామ్యం గెలించిందని సమర్థించుకున్నాడు. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఘోర పరాజయం చెందినందుకు ఒక్కటే గగ్గోలు పెట్టాడు. ఇప్పుడు ఈవీంలు వద్దు, బ్యాలెట్ పేపర్లలోనే ఎన్నికలు నిర్వహించాలని వాదిస్తున్నాడు. తెలంగాణలో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారనుకుంటే కాంగ్రెస్ గెలిచిన మిగితా మూడు రాష్ర్టాల సంగతేం టో చంద్రబాబే సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిప క్షం వైసీపీ కాబట్టి ఆ పార్టీని విమర్శిస్తే అర్థం ఉంటుంది. కానీ తనకు ఏ సంబంధం లేని తెలంగాణ రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ పార్టీని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎందుకు విమర్శిస్తున్నాడో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో రానున్న అసెం బ్లీ ఎన్నికల్లో తానెక్కడ ఓడిపోతాననే భయం పట్టుకున్నట్లు ఉన్నది చంద్రబాబుకు. అందుకే కేసీఆర్‌పై అవాకులు చెవాకులు పేలుతున్నాడు.
alwal-reddy
దీన్నిబట్టే అర్థమవుతున్నది అతని మానసిక పరిస్థితి ఏంటిదో..? దేశంలో గుణాత్మకమార్పు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను పక్కనబెట్టి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కృషిచేస్తున్నారు. ఈ ప్రయత్నాలను హేళన చేస్తూ చంద్రబాబు వెకిలిగా నవ్వుతున్నాడు. ఇది చంద్రబాబు సంస్కారాన్ని తెలియజేస్తున్నది. మాట్లాడితే నేనే సీనియర్‌ను అని చెప్పుకునే చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ఎందుకు కాపీ కొడుతున్నాడో చెప్పా లి. నిజంగా ఆంధ్రప్రదేశ్‌పై చంద్రబాబుకు మమకారం ఉంటే కేసీఆర్ తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతు ఇవ్వాలె. కానీ కాంగ్రెస్ విష కౌగిలిలో చలికాచుకోవడమెందుకు? అతను పొత్తుపెట్టుకోని పార్టీ లేదు, ఒక్క వైసీపీ తప్ప. అవకాశవాద రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన చంద్రబాబు నీతులు చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది. ప్రస్తుతం చంద్రబాబు వ్యవహార శైలి, మానసిక స్థితి గమనిస్తూ ఉంటే బాబుకు అల్జీమర్స్ వ్యాధి ఏమైనా సోకిందనిపిస్తున్నది! ఎందుకైనా మంచిదే ఓసా రి చికిత్సలు చేయించుకుంటే మంచిది!

642
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles