Telangana Intermediate 1st & 2nd Year Results 2019

అప్రమత్తత అవసరం

Fri,March 15, 2019 01:15 AM

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ ఎండ వేడిమికి గతవారం రోజుల్లోనే పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో స్వైన్‌ఫ్లూ వ్యాధి కూడా విజృంభిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ దవాఖానల్లో స్వైన్‌ఫ్లూతో చనిపోతున్న రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉన్న ది. ఇదిలా ఉంటే అనేకమంది స్వైన్‌ఫ్లూ వ్యాధి లక్షణాల తో దవాఖానాల్లో చేరుతున్నారు. ఈ వ్యాధి వ్యాపిస్తున్న ఛాయలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో స్వైన్ ఫ్లూ వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలె. ప్రజలను స్వైన్ ఫ్లూ పట్ల చైతన్యపరుచాలె. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన దవాఖానల్లో ప్రత్యేకంగా స్వైన్ ఫ్లూ వార్డులను ఏర్పాటు చేసి వ్యాధి లక్షణాలతో చేరిన వారికి వైద్యం అందించే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్న ది. కాగా ఎండ వేడిమికి ఉపశమనాలను ప్రచార, ప్రసార సాధానాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలె.
- ఎర్ర సైదులు, వలిగొండ, యాదాద్రి భువనగిరి జిల్లా

విద్యార్థులను బలితీసుకోవద్దు

ఈ మధ్య ముగిసిన ఇంటర్ పరీక్షల్లో కాపీకి పాల్పడ్డారన్న కారణంతో పరీక్ష నిర్వాహకులు కొందరు విద్యార్థులను డీబార్ చేశారు. దీంతో భయాందోళనలకు గురైన విద్యార్థులు పరీక్ష కేంద్రం ఉన్న భవనాల నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చోటుచేసుకోవటం దిగ్భ్రాంతి కలిగించింది. పరీక్ష కేంద్రాల్లో అధికారులు విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడకుండా చూస్తూ, వారిని చైతన్యపర్చా లి. ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలకు దిగకుండా ఆ పరీక్షకు మాత్రమే అనర్హులుగా చేసి వారికి మరో అవకాశం కల్పించేవిధంగా చూడాలి. లేనట్లయితే విద్యార్థులు తెలిసోతెలియకో కాపీయింగ్‌కు పాల్పడ్డారన్న కారణంతో డీబార్ చేస్తే భవిష్యత్తుపై భయంతో తీవ్ర నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉన్నది. కాబట్టి విద్యార్థులను పరీ క్షా విధానం పట్ల చైతన్యపర్చి, అక్రమాలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలి.
- యు. ఉదయకుమార్, ఏఐఎస్‌ఎఫ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా నేత

145
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles