ఆత్మవిమర్శ లేని మోదీ, రాహుల్


Wed,March 13, 2019 11:14 PM

మోదీ, రాహుల్ గాంధీ ఇరువురూ దేశానికి స్వాతంత్య్రం లభించి 50 ఏండ్లు గడిచిపోయిన తర్వాత, ద్వితీయ అర్ధశతాబ్ది కాలంలో నాయకత్వాల స్థానంలోకి వచ్చినారు. రాహుల్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ, మోదీకి చెందిన జనసంఘ్/బీజేపీలు వీరిద్దరికన్న ముందుకాలంలో కేంద్రంలో నో, రాష్ర్టాలలోనో అధికారంలో ఉంటూ వచ్చినవే. ఒకవేళ వేర్వేరు సమయాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అది లెక్కించదగినదే. ఒక రాజకీయ పార్టీకి అధికారంలో ఉన్నందున లభించే అనుభవాలు ఎంత ముఖ్యమో, అధికారంలోకి రాలేకపోయినందువల్ల కలిగే అనుభవాలు కూడా అంత ముఖ్యమైనవే. రెండు కూడా తమ రాజకీయాలకు, ఆచరణకు, అవగాహనలకు, ప్రజలతో సంబంధాలకు సంబంధించిన విషయాలు గనుక. ఆ విధంగా ఒక యాభై ఏండ్ల రాజకీయానుభవ వారసత్వాలు మోదీ, రాహుల్ గాంధీలకు లభించాయి. కాంగ్రెస్ 1885లో ఆరంభం అయినందున రాహుల్‌కు ఇంకా సుదీర్ఘమైన వారసత్వం వచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్ 1925 నాటిది గనుక మోదీకి గల వారసత్వం అంతకన్న 40 సంవత్సరాలు మాత్రమే తక్కువ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారం 1937లో జరిగిన ఎన్నికలకు ముందుగాని, లేదా 1951-52 నాటి స్వాతంత్య్రానంతర ఎన్నికలకు పూర్వం గాని కాంగ్రెస్, జనసంఘ్‌లకు అధికారానుభవం లేకపోవచ్చు. ప్రత్యక్షంగా పరిపాలించటంలోని సాధక బాధకాలు, సాఫల్య వైఫల్యాలు అంతకుముందు తెలువకపోవ చ్చు. కానీ ఈ దేశ పరిస్థితులపై, ప్రజలపై ప్రత్యక్షానుభవాలు కూడా కలిగాయి. ఈ రెండు ఉండి కూడా ఇరువురూ పరిపాలనలలో విఫలమవుతూనే వచ్చారు. తమ మాటలను, మ్యానిఫెస్టోలను పాటించకుండా పో యారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోతూ ప్రజలకు దూరమవుతూ వచ్చా రు. సరిగా ఇదే నిరాశాపూరిత వైఖరి వర్తమాన నాయకులైన నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీలలోనూ కనిపిస్తున్నది.


ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ లోక్‌సభ ఎన్నికలు సమీపించినా కొద్దీ పరస్పర విమర్శలను పెంచుతున్నారు. మామూలుగా చూసినప్పుడు, సాధారణ సమయాల్లోనూ ఉండే విమర్శలు ఎన్నికల వేళలో ఇంకా పెరుగుతాయి గనుక సమస్య అది కాదు. వీరిలో ఎవరి పట్ల కూడా విశ్వాసం లేని ప్రజలు దేశంలో చాలామంది ఉన్నారు. వారి దృష్టిలో ఇరువురూ గురివింద గింజలే. ఈ నాయకులు ఎదుటివారి లోపాలను ఎత్తిచూపటంతో పాటు, తమ వైఫల్యాలపై ఆత్మవిమర్శ చేసుకొని వాటిని సరిదిద్దుకోవటం ఎప్పటికైనా చేస్తారా అన్నది సామాన్యుడికి అర్థం కానిది.


ఇంతకుముందు నాయకుల వలె వీరిలోనూ ఆత్మ పరిశీలనలు, దిద్దుబాట్లు అన్నవి లేనే లేవు. కేంద్రంలో, లేదా రాష్ర్టాలలో ప్రజా విశ్వాసాన్ని కోల్పోయి అధికారాన్ని కోల్పోతుండటం ఇందుకు నిదర్శనం. భారత రాజకీయాల్లో ఆత్మ విమర్శ అన్నది నెహ్రూ తరంతో, అదే తరానికి చెందిన సోషలిస్టులు, కమ్యూనిస్టులతో ముగిసిపోయిందనాలి. ఒక ఉదాహరణను గమనించండి. స్వాతంత్య్రానంతరం మొదటి ఎన్నికలు 1951-52లో జరుగగా, 1957లో రెండవ ఎన్నికలు వచ్చేసరికే కాంగ్రెస్ బలం తగ్గిపోయింది. ప్రధాన రాష్ర్టాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, ఒరిస్సాలలో ఓట్లు, సీట్లు తగ్గగా, కేరళలోనైతే అధికారాన్నే కోల్పోయింది. నెహ్రూకు ఇది దిగ్భ్రాంతిని కలిగించింది. తనది గొప్ప వ్యక్తిత్వం గనుక ఆ స్థితికి సాకులు వెతుకటమో, ఎవ్వరినో నిందించటమో గాక ఆ ఫలితాలపై ఆత్మపరిశీలన చేసుకున్నాడు. సమస్యకు దిద్దుబాటు ఏమిటో ఆలోచించాడు. ఎన్నికల ఫలితాల సమీక్షకు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన చెప్పిన మాటలను చూడండి:-సాధారణ ప్రజలలో, కింది వర్గాలలో చైతన్యం వస్తున్నది. అందరికీ ఓటు హక్కు కారణంగా ప్రజాస్వామిక చైతన్యాలు వస్తున్నా యి. మనం వీటిని గుర్తెరిగి వ్యవహరించాలి. లేనట్లయితే ఈ వర్గాల ప్రజ లు అసంతృప్తితో మనలను పక్కకు తోసివేసి ముందుకు వెళ్లిపోతారు అన్నాడాయన. అందులో ఆత్మ విమర్శ, హెచ్చరిక కలగలిసి ఉన్నాయి. కాని నెహ్రూ హెచ్చరిక, సమీక్ష స్వార్థపరులైన కాంగ్రెస్ నాయకులకు పట్టలేదు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిస్థితి ఈ విధంగా ఉందని, 1937, 1952 ఎన్నికల మధ్యకాలంలోనే కనిపించింది. ఈ హెచ్చరికను 1952 ఎన్నికలకు ముందే అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ స్వయంగా నెహ్రూ దృష్టికి తెచ్చాడు. తర్వాత అయిదేండ్లకు 1957లో వర్కింగ్ కమిటీకి నెహ్రూ చేసిన హెచ్చరికను పార్టీ నాయకత్వాలు పెడచెవిన పెట్టడం వల్ల ఏమేమీ జరిగిందనే వివరాల్లోకి ఇక్కడ పోలేముగాని, మొత్తానికి ఈ తరహాలో ఆత్మ విమర్శలు, దిద్దుబాటులేని వైఖరి ప్రస్తుతం రాహుల్ గాంధీ వరకు కూడా ఒక వైఫల్యాల స్రవంతిగా కొనసాగుతూనే ఉందనేది గమనించవలసిన విషయం.

కాంగ్రెస్ గాని, బీజేపీ గాని సమీక్షలు అంటూ చేసుకోలేదని కాదు. ప్రతి ఓటమి తర్వాత కమిటీలు, నివేదికలు ఒక పరిపాటిగా ఉంటూనే వస్తున్నాయి. కానీ, అవి నిజమైన అర్థంలో సమీక్షలు కావు. అవి ఎత్తుగడలు వ్యూహాలపై సమీక్షలు. కుల-మత సమీకరణలు, అభ్యర్థుల ఎంపికలు, పొత్తులూ సర్దుబాట్లు, ప్రచార లోపాలు, డబ్బు ఖర్చు, ఓటర్ల తరలింపు, బూత్ మేనేజ్‌మెంట్ వంటివి వారి సమీక్షాంశాలు. సమీక్ష అంతా గెలుపోటముల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మరుసటి ఎన్నికలకు అదే ప్రాతిపదిక అవుతుంది. అంతే తప్పా, తమ ఓటమి వెనుక గల ప్రజల మనోభావాలు ఏమిటన్నది వారి సమీక్ష పరిధిలోకి రాదు. కనుక అందుకు అనుగుణంగా దిద్దుబాట్లు ఉండవు.


రెండవ వైపు నరేంద్ర మోదీకి తమ సంఘ్‌పరివార్ వైపు నుంచి, జనసంఘ్/బీజేపీల వైపు నుంచి లభించిన వారసత్వం కూడా ఇటువంటిదే. 1950లో జనసంఘ్ ఏర్పడక ముందు ఆర్‌ఎస్‌ఎస్, హిందూ మహాసభ వంటి సంస్థల నాయకత్వాన కేవలం హిందూ మత భావజాలపు వ్యాప్తి, అందులోని సాఫల్య వైఫల్యాలను పక్కన ఉంచుదాం. కాని జనసంఘ్/ బీజేపీల దశలో రాజకీయ సంస్థలుగా, వారు అధికారానికి వచ్చిన సందర్భాలలోనూ వైఫల్యాలు అనేకం ఉన్నాయి. ఒకసారి అధికారానికి వచ్చినచోట, అది రాష్ర్టాలు అయినా కేంద్రం అయినా తిరిగి ప్రజాదరణలను పొందని సందర్భాలు అనేకం ఉండటం ఇందుకు రుజువు. కాని వారి నాయకత్వాలకు ఆత్మ విమర్శలు లేకపోయాయి. కాంగ్రెస్ గాని, బీజేపీ గాని సమీక్షలు అంటూ చేసుకోలేదని కాదు. ప్రతి ఓటమి తర్వాత కమిటీలు, నివేదికలు ఒక పరిపాటిగా ఉంటూనే వస్తున్నాయి. కానీ, అవి నిజమైన అర్థంలో సమీక్షలు కావు. అవి ఎత్తుగడలు వ్యూహాలపై సమీక్షలు. కుల-మత సమీకరణలు, అభ్యర్థుల ఎంపికలు, పొత్తులూ సర్దుబాట్లు, ప్రచార లోపాలు, డబ్బు ఖర్చు, ఓటర్ల తరలింపు, బూత్ మేనేజ్‌మెంట్ వంటివి వారి సమీక్షాంశాలు. సమీక్ష అంతా గెలుపోటముల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మరుసటి ఎన్నికలకు అదే ప్రాతిపదిక అవుతుంది. అంతే తప్పా, తమ ఓటమి వెనుక గల ప్రజల మనోభావాలు ఏమిటన్నది వారి సమీక్ష పరిధిలోకి రాదు. కనుక అందుకు అనుగుణంగా దిద్దుబాట్లు ఉండవు. ఈ పార్టీలు అదే క్షేత్రంలో పదేపదే ఓటమికి గురికావటానికి కారణం ఇదే. ఇటువంటి అనుభవాలు ఎన్ని ఎదురైనా వారు మారటం లేదు. ఇందుకు కారణం వారి నాయకులకు చదువులు, ఆలోచనా శక్తి, అనుభవం లేకపోవటం కాదు. మనం ఊహించలేని పాళ్లలో ఉన్నాయవి. అయినప్పటికీ ఇట్లా ఎందుకు జరుగుతున్నది? అందుకు సమాధానంగా తోస్తున్న విషయం ఒకటుంది.
Ashok
ఈ పార్టీల నాయకత్వాలకు కావలసింది తమ ప్రయోజనాల కోసం అవసరమైంది చేసుకోవటం తప్ప ప్రజల ప్రయోజనాల కోసం కావలసింది చేయటం కాదు. వివిధ లోపాలున్నట్లు తమకు తెలిసినా, ఆ కారణంగా తాము మధ్య మధ్య అధికారాన్ని కోల్పోయినా, వివిధ వైఫల్యాలకు గురైనా, తమ కోసం తాము కోరుకునేవి జరుగుతున్నాయా లేదా అనేది మాత్రమే ప్రధానం. కనుక సమీక్షలు అంతకే పరిమితమవుతాయి. ప్రజలను కేంద్రం చేసుకుంటూ ఆత్మ విమర్శలు అనేదానికి చోటుండదు. నరేంద్ర మోదీని, రాహుల్ గాంధీని, వారి నాయకత్వాన గల పార్టీల ను ఈ విశ్లేషణ వెలుగులో చూడవలసి ఉంటుంది. వాస్తవానికి దేశంలో ని ఇతర పార్టీల తీరు కూడా ఇదేవిధంగా మారింది. ప్రస్తుత పరిస్థితికి వస్తే, వచ్చే లోక్‌సభ ఎన్నికల సందర్భంలో రాఫెల్-బోఫోర్స్, ఉగ్రవా దం, కశ్మీర్ సమస్య, మతతత్వం, పేదరికం, వ్యవసాయం-రైతులు, నిరుద్యోగం గల, అవినీతి, మహిళల సమస్యలు మొదలైన అంశాలు ఇరువురు నాయకుల ప్రసంగాలలో ప్రస్తావనకు వస్తున్నాయి. ఈ వివిధాంశాలలో రెండు పార్టీలు కూడా గతకాలమంతా సాధించింది ఏమి టో, విఫలమైనది ఏమిటో ప్రజలకు తెలియనిది కాదు. కాని ఇరువురు నాయకులకు తమ వైఫల్యాలను దాచిపెట్టుకొని ఎదుటివారిని వేలెత్తి చూపటం ఎత్తుగడగా మారింది. అది మంచి ఎత్తుగడగా భావించి వారు సంతృప్తి చెందుతుండవచ్చు. కానీ ప్రజలకు సంతృప్తి కలిగిస్తున్నది ఏమీ లేదు.

700
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles