రైతుకు విస్తృతమైన అవకాశాలు


Wed,March 13, 2019 11:14 PM

ఒకసారి రఘురామ్ రాజన్ ఆర్బీఐ గవర్నర్ హోదాలో ఫెడర ల్ బ్యాంకుకు సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన డానికి కేరళ రాష్ట్రంలోని కొచ్చికి వెళ్లారు. ఆ సమావేశంలో ఒక ఇంజినీరింగ్ విద్యార్థి లేచి.. సార్ దేశంలో అందరూ అభివృద్ధి చెందుతున్నారు కదా కానీ రోడ్డుపక్కన ఇడ్లీ బండి యజమాని మాత్రం ఎందుకు ఎప్పటికీ అలాగే ఉంటున్నాడు? అని ప్రశ్నించాడు. అప్పుడు రఘురామ్‌రాజన్.. అవును ఆ ఇడ్లీ బండి యజమాని నూతన ఆవిష్కరణలు సాంకేతికతను అందిపుచ్చుకోకుండా ఎన్నో ఏండ్ల నుంచి అదే పెంకు, అదే పాత్ర వాడుతున్నాడు కదా.. అని అన్నాడు. బహుశా ఇలాంటి సమాధానం ఆ విద్యార్థి ఊహించి ఉండడు. నిజమే! ఏ రంగం అభివృద్ధి అయినా ఆ రంగంలో నూతన ఆవిష్కరణలు అందిపుచ్చుకోవ డం మీదనే ఆధారపడి ఉన్నది. మన దేశంలో సుమారు అరువై శాతం మంది వ్యవసాయరంగం మీద ఆధారపడి ఉన్నారు. 1950-51లో మొత్తం స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయరంగం వాటా 55 శాతం పైన ఉంటే, అదిప్పుడు 16 శాతానికి పడిపోయింది. దీనికి ఎన్నో కారణా లున్నప్పటికీ, ముఖ్యమైన కారణం మాత్రం వ్యవసాయరంగంలో అవస రమైన నూతన ఆవిష్కరణలు అందిపుచ్చుకోవడంలో విఫలం కావడమే. దేశంలో మిగిలిన ఇతర రంగాలు నూతన ఆవిష్కరణలు, సాంకేతికత తో పరుగులు పెడుతుంటే వ్యవసాయరంగం మాత్రం రోజురోజుకు ప్రతి కూల ఫలితాలు చవిచూస్తున్నది. నిజానికి మనదేశంలో వ్యవసాయ రం గంలో నూతన ఆవిష్కరణలు ఎన్నో చోటుచేసుకున్నప్పటికీ అవి కేవలం అధిక దిగుబడికే ప్రాధాన్యం ఇచ్చాయి. కానీ ఆ పండిన పంటను లాభసా టిగా మార్కెటింగ్ చేయడమనే విషయంలో మాత్రం నూతన ఆవిష్కర ణలు జరుగలేదు.


కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలతో నిమిత్తం లేకుండా వ్యవసాయరంగంలో నూతన ఆవిష్కరణలకు పెద్దపీట వేసి రైతుల శ్రేయస్సే ధ్యేయంగా అనేక పథకాలను ప్రవేశపెట్టింది. ఫలితంగా దేశవ్యాప్తంగా వ్యవసాయరంగంలో తెలంగాణ మోడల్ అయ్యింది. రైతుబంధు, రైతు బీమా వంటి నూతన పథకాలతో రైతులకు భరోసా ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు రైతులకు గిట్టుబాటు ధర లభించేవిధంగా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ అవకాశాలు పెరిగేవిధంగా నూతన ఆవిష్కరణలకు తెరతీశారు.


కేవలం రూపాయి విలువ గల విక్స్ బిళ్లను అమ్ముకోవ డానికి కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మార్కెటింగ్ పద్ధతులను అవలంబి స్తున్న రోజులివి. వ్యవసాయ మార్కెటింగ్ విధానం కాస్త భిన్నమైనదే కావచ్చు కానీ, లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి, ఆరు కాలాలు కష్టించి రైతు పండించిన పంటను ఇప్పటికీ నూతన మార్కెటింగ్ పద్ధతుల ద్వారా కాకుండా సంప్రదాయ మార్కెటింగ్ కమిటీల ద్వారా విక్రయించడం శోచ నీయం. పండిన పంటను తీసుకొని మార్కెట్‌కు చేరుకునే రైతుకు లాభాల మాట దేవుడెరుగు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాని దుస్థితిని చూస్తు న్నాం. కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక, స్థానికంగా ఉన్న దళారులకు వచ్చిన ధరకే అమ్ముకునే రైతుల బాధలు రైతులకు కాక ఇంకెవరికి తెలుస్తయ్. ఇలాంటి పరిస్థితుల్లో రైతు తెచ్చిన బాకీలు తీర్చలేక, ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు, లేదా వ్యవసాయం బంద్ పెట్టి పట్టణా లకు వలస పోతున్నాడు కూలీ కోసం. చిత్రమేమంటే, గత ప్రభుత్వాలు కూడా రైతుల పంటల అధిక దిగుబడికి కావలసిన పరిశోధనలకు ఆవిష్క రణలపై దృష్టిపెట్టాయి. కానీ వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్‌లో నూతన పరిశోధనలకు ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. రైతు నుంచి పంట ను కొనుగోలు చేసిన దళారులు లక్షాధికారులు అవుతున్నారు. అలాగే దళారుల నుంచి కొనుగోలు చేసిన ప్రాసెసర్, ఎక్స్‌పోర్టర్స్, పలు కంపెనీలు కోట్లు దండుకుంటున్నాయి. గిట్టుబాటు ధర లేక రైతు కుదేలవుతుంటే వారి కష్టం మీద ఆధారపడిన ఈ దళారులు మాత్రం కుబేరులవుతున్నా రు. ఇంకెన్నాళ్లు ఈ పరిస్థితులు, రైతుల బతుకంతా ఇలాగేనా? ఇతర వ్యాపారస్థుల వలె రైతు దర్జాగా బతుకలేడా?

రైతుల శ్రేయస్సు అని ఊదరగొట్టిన గత పాలకులకు రైతులకు విస్తృత మైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం కూడా రైతు శ్రేయస్సులో భాగ మేనన్న విషయం తెలియలేదు! రైతులకు విస్తృతమైన మార్కెటింగ్ అవ కాశాలు లేకపోతే వారు పండించిన పంటను ఎలా అమ్ముకుంటారు? వారికి గిట్టుబాటు ధర ఎలా వస్తుంది? ఈ మాత్రం తెలియని మన నాయ కులు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పిస్తాం, రైతుల ఆదాయం పెంచుతా మంటే నమ్మేదెలా? రైతు పండించిన పంటకు లాభసాటి మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తే చాలు ఎంతో మేలు జరుగుతుంది. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలతో నిమిత్తం లేకుండా వ్యవసాయరంగంలో నూతన ఆవిష్కరణలకు పెద్దపీట వేసి రైతుల శ్రేయస్సే ధ్యేయంగా అనేక పథకాలను ప్రవేశపెట్టింది. ఫలితంగా దేశవ్యాప్తంగా వ్యవసాయరంగంలో తెలంగాణ మోడల్ అయ్యింది. రైతు బంధు, రైతుబీమా వంటి నూతన పథకాలతో రైతులకు భరోసా ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు రైతులకు గిట్టుబాటు ధర లభించేవిధంగా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ అవకాశాలు పెరిగేవిధంగా నూతన ఆవిష్కరణలకు తెరతీశారు. అందులో మొదటిది.. రాష్ట్ర ప్రభుత్వమే ఫుడ్ ప్రాసెసింగ్ పరి శ్రమలను నెలకొల్పి రైతుల నుంచి నేరుగా ఉత్పతులను కొనుగోలు చేసి తెలంగాణ బ్రాండ్ పేరిట వాటిని ప్రాసెస్ చేసి మార్కెట్ చేయాలని నిర్ణ యం తీసుకున్నారు. రెండవది.. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ బిజినెస్ విం గ్ అనే కొత్త శాఖను ఏర్పాటుచేసి దానిద్వారా రైతుల నుంచి నేరుగా వ్యవ సాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి వాటిని సరసమైన ధరలకే వినియోగ దారునికి అందించాలని నిర్ణ యం చేయడం. నిజంగా వ్యవ సాయ మార్కెట్లో ఈ రెండు ఆలోచనలు వినూత్నమైనవి. దీంతో వ్యవసాయ మార్కె ట్లో పోటీతత్వం పెరిగి రైతుకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు ఇటు వినియోగదారునికి కూడా కల్తీ లేని, స్వచ్ఛమైన ఆహారపదార్థాలు లభ్యమ య్యే అవకాశం ఉంటుంది. ఇది ఆహ్వానించదగింది.
rama-krishna
ఉదాహరణకు.. నిజామాబాద్ జిల్లాలో పసుపు, ఖమ్మం జిల్లాలో మిర్చీ, వికారాబాద్ ఏరియాలో కందులు వంటి వ్యవసాయ ఉత్పత్తులు అధికంగా పండిస్తా రు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా వ్యవసాయ మార్కెట్లోకి ప్రవేశించి రైతుల నుంచి పంటలను కొనుగోలు చేసి, శుద్ధి చేసి తెలంగాణ బ్రాండ్ పేరుతో వినియోగదారులకు అందిస్తుం ది. ఇది ప్రభుత్వానికి, రైతులకు వినియోగదారులకు ఎంతో మేలు చేస్తుం ది. ఇలా వ్యవసాయరంగంలో నూతన ఆవిష్కరణలకు తెలంగాణ రాష్ట్రం ఒక దిక్సూచి కావడం గర్విందగింది. వ్యవసాయరంగంలో ఇలాంటి ఆవిష్కరణలతో రైతులకు మార్కెట్ అవకాశాలు పెంచేవిధంగా కేంద్రం, ఇతర రాష్ర్టాలు ఆలోచించాలి. ముఖ్యంగా ప్రభుత్వాలు వ్యవసాయ మార్కెటింగ్‌లో పరిశోధనలకు మరింత అవకాశాలు పెంచాలి. వ్యవసాయ మార్కెటింగ్ అనేది కేవలం వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు చెందిన అంశంగా పరిగణించకుండా దాన్ని ఇతర విశ్వవిద్యాలయాల్లో ముఖ్యంగా కామర్స్ విభాగంలో ఒక పాఠ్యాంశంగా చేర్చాలి. తద్వారా ఆయా విభాగంలో నూతన పరిశోధన లకు అవకాశాలు ఏర్పడి రైతులకు, ప్రభుత్వానికి మేలు చేకూరుతుంది. ఏదేమైనా దేశంలోని రైతులు తాము పండించిన పంటకు లాభసాటి ధర రావాలంటే కచ్చితంగా మార్కెట్ పరిధి పెరుగాలె. తదనుగుణంగా తెలం గాణ రాష్ట్రం ఆదర్శంగా నూతన పద్ధతులకు నాంది పలుకాలి.
(వ్యాసకర్త: వ్యవసాయ మార్కెట్ పరిశోధకుడు, ఓయూ)

744
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles