ఎఫ్ 16పై అమెరికా మౌనం

Tue,March 12, 2019 10:52 PM

Iraqi-F-16
ఇటీవల రెండు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొని యుద్ధవిమానాల ఘర్షణ సాగినప్పుడు, భారత్ పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్ 16 విమానాన్ని కూల్చివేసిందా అనేది అంతుచిక్కని విషయంగా మారింది. తాము ఎఫ్ 16 విమానాన్ని కూల్చివేశామని భారత్ కచ్చితం గా చెబుతున్నది. కానీ పాకిస్థాన్ మాత్రం ఈ ఘర్షణలో తాము ఎఫ్ 16 విమానాలను వాడనే లేదంటున్నది. పాకిస్థాన్ ఎఫ్ 16 విమానాల గుట్టు అమెరికా దగ్గర ఉంటుంది. కనుక ఈ ప్రశ్నకు సమాధానం అమెరికా దగ్గర తప్పకుండా ఉంటుంది. కానీ అమెరికా మాత్రం మేం వార్తలను పరిశీలిస్తున్నాం అంటున్నదే తప్ప ఏ విషయమూ చెప్పడం లేదు. భారత వైమానిక దళం ఎఫ్ 16కు సంబంధించిన ఎలక్ట్రానిక్ సంకేతాలను, ఉష్ణ సూచికలను గ్రహించింది. ఎఫ్ 16 విమానం నుంచి ప్రయోగించిన (అమెరికా సరఫరా చేసిన) క్షిపణి (ఆమరామ్) శకలం కూడా జమ్ముకశ్మీర్‌లోని రాజోరీ సెక్టార్‌లో దొరికింది. ఈ విధంగా దొరికిన క్షిపణి శకలంపై ఉన్న అంకెలను గమనిస్తే పాకిస్థాన్‌కు చేసిన సరఫరాకు సంబంధించి 2006 నవంబర్ 17న అమెరికా రక్షణశాఖ విడుద ల చేసిన జాబితాలోనిదేనని ధ్రువపడుతున్నది. దీంతో భారత్‌పై పాకిస్థాన్ ఎఫ్ 16 విమానాలను ఉపయోగించిందనేది స్పష్టం. అయితే భార త్ ఎఫ్ 16 విమానాన్ని కూల్చివేసినామని అంటున్న దానిపై ఇంకా అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి పాశ్చాత్య దేశాల నిపుణులు ఈ సందేహాలను వెల్లడించారు. భారత్ మరింత సమాచారం చూపించాలంటున్నారు. కానీ ఎఫ్ 16 విమానం మిగ్ 21 మాదిరిగానే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో కూలిపోయిందని భారత్ అంటున్నది. మిగ్ 21 విమానమే ఎఫ్ 16ను కూల్చివేసిందని వెల్లడించింది.

భారత్ మొదటగా దాడికి దిగిందని పాకిస్థాన్ వాదించవచ్చు. కానీ పుల్వామా దాడి నేపథ్యంలో తాము ప్రతిదాడి చేశామని భారత్ అనవచ్చు. కానీ ఇంతకు పాకిస్థాన్ ఎఫ్ 16ను వాడిందా లేదా అనేది అమెరికా వెల్లడిస్తుందా? అమెరికా ఏ విషయమూ చెప్పకపోవచ్చు.


మూడు పారాషూట్స్ దిగడం గమనించామని పాకిస్థాన్ గ్రామస్తులు తెలిపారు. ఈ మూడింటిలో ఒకటి-భారత వింగ్ కమాండర్ అభినంద న్ వర్ధమాన్ దిగింది. ఈయనను పాకిస్థాన్ సైన్యం నిర్బంధించి ఆ తర్వా త విడుదల చేసింది. మిగతా రెండు పారాషూట్స్ రెండు సీట్లు గల ఎఫ్ 16 విమానానివి అయి ఉంటాయి. వారేమంటున్నారు, వీరేమంటున్నా రని కాకుండా, వాస్తవాలను అమెరికా వెల్లడిస్తే సరిపోతుంది. అమెరికా 2006లో ఎఫ్ 16లను అమ్మింది. 2010 నుంచి కూడా సరఫరాలు సాగించింది. అయితే వీటిని ఎవరిపై ప్రయోగిస్తున్నామనే విషయంలో కఠినమైన షరతులను విధించింది. ఈ విషయాన్ని నాడే అమెరికాకు చెందిన రక్షణశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. అమెరికా ఐదు బిలియన్ డాలర్ల విలువైన ఎఫ్ 16 విమానాలను సరఫరా చేసిందని తెలు సు. కానీ ఇందుకు సంబంధించిన షరతులను మాత్రం గోప్యంగా పెట్టిం ది. రక్షణ ఒప్పందాలకు సంబంధించిన వివరాలను వెల్లడించకపోవడం మా విధానం అని అమెరికా విదేశాంగశాఖ ఉప అధికార ప్రతినిధి రాబర్ట్ పాలడినో అన్నారు. ఈ ఒప్పందాలకు సంబంధించిన అవగాహన గలవారు చెబుతున్న ప్రకారం-ఈ సైనిక సామగ్రిని అమెరికా మిత్రదేశాలపై ప్రయోగించకూడదు. భారత్ అమెరికా మిత్రదేశం. అందువల్ల భారత్ మీద దాడికి ఎఫ్ 16లను వాడకూడదు. ఈ విధంగా చూస్తే పాకిస్థాన్ ఇటీవల ఎఫ్ 16లను వాడటం అమెరికాతో గల ఒప్పందాన్ని ఉల్లంఘించడమే. పాకిస్థాన్ తన రక్షణ కోసం కాకుండా దాడి చేయడానికి వాడింది కనుక ఒప్పందాన్ని కచ్చితంగా ఉల్లంఘించినట్టేనని భారత్‌కు చెందిన నిపుణులు అంటున్నారు. పాకిస్థాన్ విమానాల వాడకాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటామని అమెరికా అధికారులు అక్కడి చట్టసభకు హామీ ఇచ్చారు.

నాడు అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందా అనేది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. అయితే పాకిస్థాన్ ఒకవిధంగా సమర్థించుకునే ప్రయత్నం చేయవచ్చు. ఈ విమానాలను దాడులకు కాకుండా ఆత్మరక్షణకు వాడుకోవచ్చు. అయితే పాకిస్థాన్ చర్య ఆత్మరక్షణ కిందకు వస్తుందా అనేదే చర్చ.


ఉగ్రవాదానికి పోరాటానికి సహకరించినందుకు కృతజ్ఞతగా అమెరికా పాకిస్థాన్‌కు 2006లో ఈ ఎఫ్ 16 విమానాలను సరఫరా చేసింది. వీటికితోడుగా ఆమ్‌రామ్స్ క్షిపణులను కూడా అందించింది. ఈ ఆమ్‌రామ్స్ క్షిపణులు విమానం నుంచి విమానాలపైకి ప్రయోగించేవి. ఉగ్రవాదులు విమానాలను వాడటం లేదు. మరి ఈ క్షిపణులను అమెరికా పాకిస్థాన్‌కు ఎందుకు సరఫరా చేసినట్టు? పాకిస్థాన్‌కు రక్షణ సామగ్రి సరఫరా చేసినప్పుడల్లా అమెరికా అధికారులు ఎంతో కళాత్మకంగా కథనాలను వినిపించగలరు. భారత్ నాడే అమెరికాకు అభ్యంతరం చెప్పిం ది. ఆత్మరక్షణకు కాకుండా దాడులకు ఉపయోగించే అత్యాధునిక వ్యవస్థలు ఎటుచేసీ భారత్‌పై ప్రయోగించడానికే ఉపయోగపడుతాయి. కానీ పాకిస్థాన్ అప్పటివరకు ఆశ్రయం ఇచ్చిన అల్‌కాయిదా ఉగ్రవాదులను పట్టుకోవడానికి సహకరిస్తున్నది కనుక అందుకు బహుమానాలు ఇవ్వడంపైనే అమెరికా దృష్టిసారించింది. వీటిని సరఫరా చేయడం పట్ల అమెరికా చట్టసభ కూడా అభ్యంతరం చెప్పింది. తమకు ముందుగా సమాచారం ఇవ్వలేదని ఆక్షేపించింది. పాకిస్థాన్ భద్రతా ప్రణాళికలోని అసాధారణ అంశాల రీత్యా ఈ విమానాలను, క్షిపణులను అమ్మవలసి వచ్చిందని అమెరికా ప్రభుత్వం నాడు తెలిపింది. అమెరికా అధికారి స్వయంగా వీటి వాడకాన్ని పర్యవేక్షిస్తారని కూడా చెప్పింది. తాము సరఫరా చేసిన విమానాలను, పరికరాలను ఆరు నెలలకు ఒకసారి తనిఖీ చేస్తామని కూడా హామీ ఇచ్చింది. వీటి నిర్వహణ విధులను విదేశాలకు అప్పగించకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కూడా తెలిపింది. ఇంతటి కఠిన నిబంధనలు ఉండటంతో, అమెరికా చట్టసభ సంతృప్తి చెందింది.

నాడు అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందా అనేది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. అయితే పాకిస్థాన్ ఒక విధం గా సమర్థించుకునే ప్రయత్నం చేయవచ్చు. ఈ విమానాలను దాడులకు కాకుండా ఆత్మరక్షణకు వాడుకోవచ్చు. అయితే పాకిస్థాన్ చర్య ఆత్మ రక్ష ణ కిందకు వస్తుందా అనేదే చర్చ. భారత్ మొదటగా దాడికి దిగిందని పాకిస్థాన్ వాదించవచ్చు. కానీ పుల్వామా దాడి నేపథ్యంలో తాము ప్రతిదాడి చేశామని భారత్ అనవచ్చు. కానీ ఇంతకు పాకిస్థాన్ ఎఫ్ 16ను వాడిందా లేదా అనేది అమెరికా వెల్లడిస్తుందా? అమెరికా ఏ విషయ మూ చెప్పకపోవచ్చు. రష్యాకు చెందిన పాతకాలపు యుద్ధ విమానమైన మిగ్ 21 తమ దేశపు అత్యాధునిక ఎఫ్ 16ను కూల్చివేసిందనేది అంగీకరిస్తే తమకు అవమానకరంగా ఉంటుందని అమెరికా భావిస్తుంది. భారత్‌కు ఎఫ్ 16 విమానాలను అమ్మాలని భావిస్తున్న దశలో ఇటువం టి వ్యాఖ్యలు మరీ ఇబ్బందికరంగా ఉంటాయి. అయితే ఇందులో అమెరికా ప్రతిష్టకు భంగకరమైంది ఏమీలేదని కార్నీజీ ఎండోమెంట్‌కు చెం దిన దక్షిణాసియా నిపుణులు ఆష్లీ టెలిస్ అభిప్రాయపడ్డారు. పాత విమానమైనంత మాత్రాన దాడికి ఉపయోగపడదని అనుకోకూడదు. పైగా మిగ్ 21 బైసన్‌కు కొన్ని ఆధునిక రాడార్ ఇతర హంగులు సమకూర్చారు. గెలుపు అనేది విమానంపై మాత్రమే ఆధారపడి ఉండదు. ఎన్నో అంశాలు పనిచేస్తాయి. ఎన్నో విమానాలు దాడిలో పాల్గొన్నప్పు డు ఒకదానిపై దృష్టిపెట్టడం కష్టం అని టెలిస్ వివరించారు. ఏదేమైనా ఈ ప్రశ్నలకు అమెరికా సమాధానం చెప్పదలుచుకోలేదు. ఇందుకు ఎన్నో కారణాలుండవచ్చు.
seema-sirohi
ఆఫ్ఘనిస్థాన్ శాంతిచర్చల్లో పాకిస్థాన్ సహకరిస్తుండటం ఒక కారణం కావచ్చు. దక్షిణాసియా గొడవల్లో ఏదో ఒక స్పష్టమైన వైఖరి తీసుకోవద్దని అనుకుంటూ ఉండవచ్చు. పాకిస్థాన్ విషయంలో తమ విధాన వైఫల్యం బయటపడుతుందనే జంకు కూడా కార ణం కావచ్చు.
(వ్యాసకర్త: వాషింగ్టన్‌లోని సీనియర్ పాత్రికేయురాలు, రచయిత్రి, విదేశాంగ వ్యవహారాల వ్యాఖ్యాత)

545
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles