చర్యలు తీసుకోవాలె

Tue,March 12, 2019 10:50 PM

స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నగరవ్యాప్తంగా మరుగుదొడ్లు నిర్మించింది. కానీ రాత్రి ఏడెనిమిది కాగానే మూసివేస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే అవి పరిశుభ్రంగా ఉండటం లేదు. నీరు సమృద్ధిగా లేకపోవటం కారణంగా ఈ సమస్య తలెత్తుతున్నట్లు కనిపిస్తున్నది. కాబట్టి వాటిని పరిశుభ్రంగా ఉంచటంతో పాటు ఎల్లవేళలా అందుబాటులో ఉండేట్లు చర్యలు తీసుకోవాలి. అలాగే రోడ్డు వెంట ఉన్న అన్ని పెట్రోల్‌బంకుల్లో కూడా టాయిలెట్లు ప్రజల వినియోగం కోసం ఏర్పా టుచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయి నా చాలా పెట్రోల్ బంకుల్లో టాయిలెట్లు ఏర్పా టుచేసిన పరిస్థితి లేదు. ఇలాంటివన్నీ సక్రమం గా అమలు చేసినప్పుడే స్వచ్ఛ హైదరాబాద్ సాధ్యమవుతుంది.
- విష్ణు, హయత్‌నగర్.

క్షమార్హం కాదు

ఏపీ ప్రజల సమాచారం చోరీకి గురైందని, దీనికి సంబంధించి ఐటీగ్రిడ్స్ స్కాం వ్యవహారం కలకలం సృష్టిస్తున్నది. దీనిపై ఏపీ ప్రభుత్వం పారదర్శకంగా వ్వవహరించాల్సింది పోయి ఆరోపణలు చేస్తున్న వారిపై విమర్శలకు దిగడం సరైంది కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం వారికి వ్యక్తిగత సమాచారానికి రక్షణ కల్పించాల్సింది పోయి పాలకులే దీనిపై ఆరోపణలు ఎదుర్కొంటుండటం అందరినీ విస్మయానికి గురిచేస్తున్నది. మాట్లాడితే సీనియర్‌ను అని చెప్పుకునే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంపై మాట్లాడుతున్న తీరు హాస్యాస్పదంగా ఉన్నది. అక్కడి పౌరులకు సంబంధించిన విషయాన్ని ఇంత తేలిగ్గా మాట్లాడటం నైతికత అనిపించుకోదు. పైగా తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం అసలు విషయాన్ని పక్కదారి పట్టించడమే అవుతుంది. ఈ వ్యక్తిగత సమాచారం చోరీకి గురైందన్న విషయంలో బాధ్యతాయుత ప్రభుత్వం ఏదీ ఉన్నా తన నిజాయితీని నిరూపించుకుంటుంది. కానీ ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి
ఇతరులను నిందిస్తున్నది. ఇది క్షమార్హం కాదు.
- పి.రమేశ్, హైదరాబాద్

192
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles