ఉరిశిక్షను ధిక్కరించిన యోధుడు

Fri,February 22, 2019 01:42 AM

Nandyala
మొన్న ఉదయం ఆఫీసుకు పోతుంటే తెలంగాణ సాయుధ పోరా టయోధుడు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నంద్యాల శ్రీనివాస్ రెడ్డి గారు కన్నుమూశారని తెలిసింది. దాదాపు పదమూడేం డ్ల కిందట మిర్యాలగూడెంలో మొదటిసారి శ్రీనివాస్‌రెడ్డి గారిని కలిశాను. తెలం గాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆయన నిర్వహించిన పాత్ర గురించి పత్రికల్లో చదివి, ఆయనను కలువాలని మిత్రుడు దిండినాథ్ ముక్క, నేనూ ఆయనను కలిశాం. కొన్ని గంటలు నాటి సాయుధపోరాట సంగతు ల గురించి ముచ్చట పెట్టినం. తెలంగాణ చరిత్ర సరిగ్గా డాక్యుమెంట్ కాలేదనేది మనందరికీ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో బాగా అర్థమైంది. ప్రాచీన చరిత్రను వదిలేసి ఇటీవలి చరిత్ర కూడా సరిగ్గా రికార్డు కాకపోవడం నిజంగా దురదృష్టకరం. ప్రపంచస్థాయిలో ఎంతో స్ఫూర్తిదాయకమైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తు న్నారు. వారి పోరాట అనుభవాలు, త్యాగాలు సరిగ్గా రికార్డు చేయలేకపోయాం.ఈ దిశగా కొంత ప్రయ త్నం జరిగినా పోరాట విరమణ తర్వాత రెండు మూడు దశాబ్దాల తర్వాత వారి జ్ఞాపకాలు రికార్డు చేయడం మొదలుపెట్టడం వల్ల అవి అసమగ్రంగా ఉన్నాయి. అంతకుమించి అవి చాలా పైపైన రాసినట్టుగా అనిపిస్తుం డటం మరింత విషాదం. ఎవరో ఒకరిద్దరు తప్ప నాటి పోరాటంలో ప్రత్యక్షంగా క్షేత్ర స్థాయిలో తెలంగాణ పల్లెల్లో ప్రజాపక్షాన నిలి చి పోరాడిన వారి అనుభవాలు, జ్ఞాపకాలు ఎంతో విలువైనవి. అలాంటివాటిని రికార్డు చేయ లేకపోవటం ఒక చారిత్రక వైఫల్యంగా చెప్పుకోక తప్పదు. స్వయంగా భూస్వామ్య కుటుంబానికి చెందినవాడైనా నాటి భూస్వామ్య విధానానికీ, నిజాం అతని తాబేదార్ల పాలనకు వ్యతిరేకంగా నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి పోరుబాట పట్టాడు.

సాయుధ రైతాంగ పోరాటం లో చేరాడు. అనేక దాడుల్లో పాల్గొన్నాడు. సాయుధ పోరులో పాల్గొన్నం దుకు నంద్యాల శ్రీనివాసరెడ్డికి అప్పటి ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. అయితే కేసు విచారణలో ఉండగానే ఆయన జైలునుంచి తప్పించుకొని అజ్ఞాతంలోకి వెళ్లి పోరాటంలో దూకాడు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నందుకు గాను.. పోరాట యోధులకు మిలిటరీ ట్రిబ్యునల్ విధించిన ఉరి శిక్షలు అమలు చేయడానికి భారత ప్రభుత్వం ప్రయత్నించిందనేది బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండిపోయింది. ఆ కాలంలో అనేకమంది పోరాటయోధులకు ఉరిశిక్షలు పడ్డాయి. అయితే విశేషమేమంటే.. ఉరిశిక్షలు నిజాం ప్రభుత్వం విధించలేదు! ప్రజాస్వామ్య ప్రభుత్వంగా చెప్పుకునే భారత ప్రభుత్వం విధించింది. ప్రజలను దోపిడీ పీడనల నుంచి విముక్తి చేయటం కోసం, స్వతంత్రం కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాటయోధులను ఉరి తీయాలని చేసిన దుర్మార్గ ప్రయత్నం నాడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అంతర్జాతీయంగా ఉన్న మేధావుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా నల్ల గొండ జిల్లా అప్పాజీపేటకు చెందిన ఎర్రబోతు రాంరెడ్డి అనే 15 సంవ త్సరాల యువకుడు కూడా ఈ ఉరిశిక్ష పడ్డవారిలో ఉండటం, అతని గురించి ఒక అమెరికా జర్నలిస్టు తెలుసుకొని, జైల్లో ఉన్న రాంరె డ్డిని ఇంటర్వ్యూ చేయడంతో ప్రపంచానికి మొత్తం ఈ దాష్టీకం గురించి తెలిసింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధు లను ఉరి తీయవద్దని ప్రపంచం నలుమూలల నుంచి భారత ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెల్లు వెత్తాయి. అమెరికాకు చెందిన ప్రఖ్యాత గాయ కుడు పాల్‌రాబ్సన్ కూడా ఈ ఉరిశిక్షలను ఖండించాడు. ఉరిశిక్ష పడ్డ తెలంగాణ సాయుధ పోరాటయోధులను రక్షించడా నికి ఒక తెలంగాణ డిఫెన్స్ కమిటీ ఏర్పాటైంది.

దేశ స్థాయిలో ప్రముఖ లాయర్లు బారిస్టర్ డానియేల్ లతీఫ్, మనోహర్ సక్సేనా వంటివారు కమిటీ తరఫున పోరాటయోధుల కేసులు వాదించడానికి పూను కున్నారు. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా పేరుమోసిన బ్రిటిష్ బారిస్టర్ డెనిస్ నోవె ల్ ప్రిట్ ఈ కేసులను వాదించడానికి లండన్ నుంచి వచ్చారు. ఉరిశిక్ష పడ్డప్పుడు భగత్‌సింగ్‌ను రక్షించడానికి ప్రయత్నించింది కూడా ఈ డి. ఎన్.ప్రిట్ కావడం గమనార్హం. మొత్తానికి డి.ఎన్.ప్రిట్ బృందం కొత్తగా ఏర్పాటైన భారత్ సుప్రీంకో ర్టులో తెలంగాణ యోధులకు పడ్డ ఉరిశి క్షలపై సుదీర్ఘంగా వాదించింది. వారిపై బనాయించిన కేసుల్లోని డొల్లతనా న్ని విజయవంతంగా బయట పెట్టింది ప్రిట్ బృందం. అంతర్జాతీయంగా పెల్లు బుకిన నిరసనలు ఓ వం క, ప్రిట్ నేతృ త్వంలోని న్యాయవాదుల బృందం చేసిన డిఫెన్స్ వాదనలు ఓ వైపు ఉక్కి రిబిక్కిరి చేయడంతో భారత ప్రభుత్వం దిగివచ్చింది. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న యోధులకు వేసిన ఉరిశిక్ష ల ను ఒక్కొక్కటిగా రద్దుచేసి, వాటిలో కొన్నింటిని యావజ్జీవ కారాగార శిక్ష లుగా మార్చి పోరాటయోధుల పట్ల భారత ప్రభుత్వ వైఖరిని చాటుకు న్నది. సాయుధపోరాట విరమణ అనంతరం 1962 ఎన్నికల్లో నకిరేకల్ నుం చి భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున ఎమ్మెల్యేగా శ్రీనివాస్‌రెడ్డి ఎన్నిక య్యారు. తదనంతర పరిణామాల్లో భారత కమ్యూనిస్టు పార్టీలో చీలికలు రావటంతో శ్రీనివాస్‌రెడ్డి సీపీఎం వైపు వెళ్లారు. ఆ తర్వాత కాలంలో పార్టీ లో కీలక భూమిక పోషించారు. ఉన్నత స్థానాలకు ఎదిగి పార్టీకి దిక్సూచిగా నిలిచారు. తెలంగాణ యువతరానికి వేరే ప్రాంతాల పోరాటయోధుల గురించి తెల్సినంతగా మన ప్రాంతపు వీరుల గురించి పెద్దగా తెలియదనే చెప్పా లె. తెలంగాణ చరిత్రలో మరుగున పడిపోయిన ఇటువంటి వీరగాథలెన్నో డాక్యుమెంట్ చేయాల్సిన బాధ్యత నేటితరం మీద ఉన్నది.
Dilip-Konatham
కానీ, ఒక్కరొ క్కరుగా వెళ్లిపోతున్న సాయుధ పోరాటయోధులను చూస్తుంటే, వారి త్యాగపూరిత జీవిత గాథలు, త్యాగాలు, అనుభవాలు ఈ తరానికి తెలి యకుండా పోతున్నాయేననే బాధ పీడిస్తున్నది. పోరాటయోధుల జీవిత గాథల రికార్డు చేసే పని జరుగవలసినంత వేగంగా జరుగకపోవటం ఫలి తంగా జరుగుతున్న లోటు పూడ్చలేనిది. నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి గారికి 101 సంవత్సరాలని చదివాను. మరణించాక వారి భౌతికకాయం ఒక మెడికల్ కాలేజీకి ఇవ్వడం ద్వారా మరణంలో కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచారు ఆయన. నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి గారికి అశ్రునివాళి.
(పోరాటయోధుడు నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి గారికి నివాళిగా..)

539
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles