రాచఠీవి, ప్రజల మనిషి

Sun,February 17, 2019 01:46 AM

రాజు బలవంతుడుగా ఉన్నప్పుడు అక్కడక్కడ ఉన్న ప్రతీపశక్తులు ఏకమై ఒకతాటి మీదికి వచ్చి రాజును గెలువాలని చూస్తాయని దాదాపు రెండు వేల ఏండ్ల కిందటే చాణక్యుడు చెప్పాడు. ఇది కేసీఆర్ విషయంలో ఇటీవలి శాసనసభ ఎన్నికలు రుజువు చేశాయి. కేసీఆర్‌లో ప్రజాస్వామ్య విలువలు అణువణువునా జీర్ణించుకొని ఉన్నాయి. రాష్ట్రం విషయంలోనే కాదు, మొత్తం దేశం విషయంలో కూడా తనకు బాధ్యత ఉంద ని గుర్తించారు. దేశంలో ఫెడరల్ వ్యవస్థ బలంగా ఉండటం వల్లనే నిజమైన ప్రజాస్వామ్య విలువలు రక్షింపబడుతాయని, అన్నిరాష్ర్టాలు సరైన పద్ధతిలో అధికారాన్ని పంచుకున్నప్పుడే నిజమైన ఈగలిటేరియన్ సమాజం వర్ధిల్లుతుందని కేసీఆర్ బలంగా నమ్ముతారు. కేసీఆర్‌లో ఒక రాచఠీవి ఉంది. రాజరికపు ధోరణి కనిపిస్తుం ది. అంటే ఇక్కడ ఫ్యూడల్ అనే భావన కాదు. ఈ రాచఠీవిని కొత్తగా నిర్వచించాలి. దీన్ని ఇంగ్లీష్‌లో చెబితే Kings Paradigm అని చెప్పాలి. ప్రజల క్షేమాన్ని ఆలోచించేటప్పు డు ఒక సంపూర్ణమైన రాజు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించడమని అర్థం చేసుకోవాలి. ఈ గుణం కేసీఆర్ అమలు చేస్తున్న శాశ్వత పథకాల్లో చూడవచ్చు. యాదాద్రి వంటి దేవాలయ నిర్మాణం వెనుక, ఒక ఆధ్యాత్మిక పీఠాన్ని కొన్ని వందల ఏండ్లుగా నడుపుతున్న పీఠాధిపతులకు, ఆధ్యాత్మిక గురువులకు సాష్టాంగ దండ ప్రణామం చేయడం వెనుక ఉన్నది ఈ రాచఠీవి అనే చెప్పాలి. దీన్ని అర్థం చేసుకోలేని వారే ప్రజాస్వామ్య యుగంలో ఇదేమిటని ఆక్షేపిస్తున్నారు. సంపూర్ణమై న శిలా నిర్మాణంలో ఒక ఆలయం నిర్మించడమనేది రాచరిక వ్యవస్థలో కొన్ని వందల ఏండ్ల కిందట జరిగింది. ఇదే తెలంగాణ గడ్డపైన సంపూర్ణ శిలా నిర్మాణ ఆలయాలు దాదాపు ఎనిమిది వందల ఏండ్ల కిందట ఏర్పడ్డాయి.

ఒక రామప్ప దేవాలయం కట్టడానికి 40 ఏండ్లు పట్టింది. ముగ్గురు రాజులు మారారు. కానీ ఆ స్థాయి కన్నా పెద్ద శిలా నిర్మాణ దేవాల యం యాదాద్రిలో మన కళ్లముందే పూర్తి కాబోతున్నది. ఆధునిక యంత్రాలు ఉన్నప్పటికీ, అంతకుమించిన సంకల్పబల మే ఈ ఆలయాన్ని అతి త్వరగా నిర్మించడానికి కారణం. కేసీఆర్ ఒదిగి ఉండటం కూడా ఈ రాచరిక ఠీవిలో కనిపిస్తుంది. ఆ ఒదిగి ఉండటమే యజ్ఞ నిర్వహణల్లో కనిపిస్తుంది. ఈ కింగ్స్ ప్యారడైమ్ అనేదే సాగు, తాగునీటి పథకాలకు పేర్లు పెట్టడంలోనూ కనిపిస్తుంది. మిషన్ కాకతీయ పేరు ఇలా వచ్చిందే. రామరాజ్యంలో రాముడు కానీ, లేదా ఇతర రాజు లు కానీ పీఠాధిపతుల ఆధ్వర్యంలో పెద్ద పెద్ద యాగాలు నిర్వహించారని చదువుకున్నాం. కానీ నేటితరాలు చూడలేదు. ఆయుత చండీయాగం, సహస్ర చండీయాగం లాంటి బృహ త్ యాగాలను వందలాది మంది ఋత్విక్కులతో సశాస్త్రంగా నిర్వహించడమనేది కూడా కేసీఆర్‌లో ఉన్న రాచఠీవికి సంకేతం. ఇంత శాస్త్రబద్ధంగా బృహత్ స్థాయిలో కుండాలు నిర్మిం చి యాగం జరిపించడం ప్రజాస్వామ్యయుగంలో జరుగలేద ని ఆ విషయానికి చెందిన నిపుణులే చెప్పడం ఇక్కడ గమనించాలి. కానీ ఇక్కడ యాగం నిర్వహించింది తన కోసమో తన కుటుంబం కోసమో కాదు. ఇది ప్రజాక్షేమానికి అని స్పష్టంగా చెప్పి నిర్వహించడం గమనించాలి. రాజ్యం సుభిక్షంగా ఉం డాలని పరిపాలన సజావుగా సాగాలని రాజశ్యామల యాగం నిర్వహించడం, రాజ్య వ్యతిరేకులైన శత్రు వినాశనం కోసం బగళాముఖిని కొలువడం ఈ ఆలోచనలో భాగమే. వీటిని దృష్టిలో ఉంచుకొని కేసీఆర్‌ను మతపరమైన పిడివాది అని, రంధ్రాన్వేషణతో విమర్శలు చేసేవారు అభాసుపాలు కాక తప్పలేదు. ప్రజాస్వామ్యంలో అన్ని మతవర్గాల ప్రజల ఆకాంక్షలను క్షేమాన్ని చూడవలసి ఉన్నది. ఈ ఆలోచనలో భాగంగానే అటు ఇస్లాం, క్రైస్తవ మతాల వారిని ఆదరించే కార్యక్రమాన్ని కూడా అధికారికంగా చేపట్టారు.

ఇమామ్‌లకు జీతాలు ప్రభుత్వం ద్వారా ఇవ్వడం, అలాగే క్రైస్తవ చర్చిలకు ప్రోత్సాహకాలను ఇవ్వ డం, చర్చిల పునరుద్ధరణకు ఆర్థిక సహాయాన్ని అందించడం, వారివారి పండుగల సందర్భాల్లో వారికి కానుకలు ఇవ్వడం గమనార్హం. కాకతీయులు నిర్మించిన పాకాల, రామప్ప, లక్నవరం వైరా చెరువులు సాగరాలంత పెద్దవి. కొన్ని లక్షల ఎకరాలకు నేటికీ ఇవి సాగునీరు ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. రాష్ట్ర ప్రజలకు శాశ్వత ప్రయోజనం కలిగేరీతిలో ప్రాజెక్టులను నిర్మించడం వెనుక ఉన్నది ఈ ఆలోచనే. కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి కృష్ణాజలాల ఆధారంగా నిర్మించే ప్రాజెక్టు లు. మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు నీరిచ్చే పథకాలు ఇలాంటివే. మహబూబ్‌నగర్ జిల్లాలో వరి పంట రెండుసా ర్లు పండటం ఎప్పుడైనా చూశారా. ఇది నేడు కేసీఆర్ పథకాల వల్ల సాధ్యమైంది. ప్రజాక్షేమం కోసం ఇలాంటి శాశ్వత పథకాలను అమలు చేయడం ఒక ఎత్తయితే, కేసీఆర్ ప్రజా పాలనలో ఉన్న సంక్షే మ దృష్టిని అర్థం చేసుకోవడం మరొక కోణం. అన్నార్తులకు అన్నం పెట్టడం వ్యక్తి తక్షణ కర్తవ్యం కాగా ఇది రాజ్యానికి కూడా తక్షణ కర్తవ్యమే. కేసీఆర్ ఎన్నడూ ఏ ప్రజా ప్రభుత్వా లు ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు. వృద్ధులు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు అధికంగా పింఛన్ మం జూరు చేయడమనేది కేవలం భోజనం పెట్టడం కాదు, వారికి జీవితాన్నివ్వడం, ఆత్మగౌరవం పెంపొందించడమే. రాజధాని నగరంలో శాశ్వతంగా కుల భవనాలను నిర్మించే ఆలోచన ఏ ప్రభుత్వం చేయలేదు. కాగా ప్రజాస్వామ్య యుగంలో అది కేసీఆర్ ద్వారానే సాధ్యమైంది. సమగ్రమైన అభివృద్ధికి, గ్రామీణ కులవృత్తుల అభివృద్ధి, వ్యవసాయ అభి వృద్ధి, నీటి వనరుల అభివృద్ధి ప్రాధాన్యాన్ని సంతరించుకున్న ది. అందుకే కులవృత్తుల నైపుణ్యాలకు, గ్రామీణవృత్తుల అభి వృద్ధికి సాగు, తాగునీరు ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతున్నది.
krishna-mohan-rao
భూమి, నీరు, నైపుణ్యం, వనరులు, వాటి సద్వినియోగం, ఉపాధి కల్పన, సంపద సృష్టి ద్వారానే తెలంగాణ సమాజం ముందుకు సాగుతుంది. దేశానికి ఆదర్శ నమూనాను రూపొందించే ప్రయత్నం జరుగుతున్నదీ కేసీఆర్ పాలనలోనే. ఉద్యమకాలంలో ఉద్యమ గీతాలను స్వయంగా రచించా డు కేసీఆర్. ఆయన స్వయంగా కవి, వేల కావ్య శాస్త్ర గ్రంథాలను పఠించిన పండితుడు. ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించి శతావధానాలను దగ్గరుండి పాల్గొని పోషించడం కేసీఆర్‌లో ఉన్న కింగ్స్ ప్యారడైమ్‌కి మచ్చుతునక. అటు ఎన్నికల సమరాంగణంలో ప్రజా విజయాన్ని చవిచూచిన కేసీఆర్‌ను ఈ నేపథ్యంలో సాహితీ సమరాంగణ విజయుడు అని పిలువడం సమంజసం. ప్రజాస్వామ్య పాలనలో కేసీఆర్ ఒక కొత్త ఒరవడిని సృష్టించడాన్ని మనం చూడగలిగాం. దాన్ని ఒక రాచఠీవి అని కూడా చెప్పుకున్నాం. దాన్ని కింగ్స్ ప్యారడైమ్ అని కాని ప్యాలెస్ ప్యారడైమ్ అని కానీ అనవచ్చు. కేసీఆర్ ఒక రాజనీతిజ్ఞుడు. రాజనీతిజ్ఞతను ప్రదర్శించడం వల్లనే శాశ్వత ప్రయోజనాలిచ్చే ఆధ్యాత్మిక, శాశ్వత పథకాలకు రూపకల్పన చేశారు. కొన్ని వందల ఏండ్ల ప్రగతిని చూడగలిగే ముందుచూపు, ఈ ప్రజాస్వామ్య ప్రగతివాదం వెనుక ఉన్నది కేసీఆర్ రాచఠీవి, ఒక దార్శనికత. ఇది ప్రజాస్వామ్య పాలనకు ఎంతైనా అవసరం.
(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు)

575
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles