లేచింది మహిళాలోకం

Sat,February 16, 2019 01:45 AM

లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం.. కొనేండ్ల కిందటి ఒక సినిమా పాటలో ఇది పల్లవి చరణం. ఆ సినిమాలో ఒక సన్నివేశానికి అతికిన పాట ఇది. నాటకరంగం నుంచి సినిమా రంగానికి వచ్చిన ఈ సినీ కవి శ్రవణానందం కలిగించే పాటలు రాయడంలో దిట్ట, గట్టివాడు, ప్రసిద్ధుడు. పౌరాణిక, సాంఘిక, జానపద చిత్రాలెన్నిటికో (సినిమాలెన్ని టికో) తియ్యని పాటలు రాసి భళి భళి అనిపించుకున్న, సమకాలికుల ప్రశంసలు సైతం పొందిన మధురకవి ఈయన. ఒక పౌరాణిక చిత్రంలో అధ్యాత్మిక భావల హరులు వీచిన ఒక పాటలో ఈయన అంటాడు.. ఒకరికి మోదం, ఒకరికి ఖేదం, సకలం తెలిసిన నీకు వినోదం అంటూ ఆ పరమాత్ముని లీలలను ప్రస్తావిస్తాడు.
Prabhakar-Rao
ఈ కవి గారికి సామాజిక స్పృహ, లోక పరిజ్ఞానం లేదనుకోలేం. నాటకరంగం నుంచి వచ్చిన వారికి ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ తటుక్కున విట్లు (సునిశిత హాస్య రసాత్మకమైన ఎదురు జవాబులు) విసరే చాకచక్యం పుష్కలంగా ఉం టుంది. లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం అన్నాడు. నిజానికి మహిళాలోకం, గత చరిత్రను అవలోకిస్తే, ఎన్నడూ నిద్రలో లేదని, ఎప్పుడూ జాగరితంగానే ఉందని స్పష్టమవుతుంది. లక్ష్మణుడు, అన్న రాముడు, వదిన సీతతో పధ్నాలుగేండ్ల అరణ్యవాసం నుంచి అయోధ్య కు ఆనం దోత్సాహాల మధ్య తిరిగిరాగానే అంతఃపురంలో అసూర్యంప శ్చ, పలాశ కుసుమ పేశల ఊర్మిళమ్మ కూడా నిద్రలేచింది. అందువల్ల, మహిళాలోకం నిద్ర లేచిందని కవీజీ తియ్యని, ఊపేసే ఒక పాట రాయ డంలో ఔచిత్యం లేదనుకుంటాను. మహిళ, అమ్మ, సోదరి, తల్లి నిద్రబో యే క్షణాలు తక్కువ. ప్రతి నిమిషం ఆమెకు వేదనే, మెలకువే. కన్యాశు ల్కం నాటకంలో గురజాడ ఒక ఇంగ్లీష్ గీతికలో అంటారు ఇంటి ఆడప డచు, వితంతువు బుచ్చమ్మ సూర్యోదయానికి ముందే 4 గంటలకు నిద్ర లేచి ఊడ్చుతుందని, నీళ్లు చల్లుతుందని! గతుకుల బతుకులీడ్చే పేద మహిళలకు జీవితం కష్టాల వల్ల నిద్రరాదు. విలాస జీవితంలో తేలియా డే, తూలిపోయే కొందరు మహిళలకు ఇతర కారణాల వల్ల నిద్రరాదు, నిద్రమాత్రలు పనిచేయవు.

శ్రీమద్రామాయణం సుందరకాండలో సీతాన్వేషణ పండితుడు ఆంజనేయ స్వామికి లంకాపురంలో, రావణా సుర హర్మ్యాలలో (ఫలక్‌నుమా, చౌమహల్లా ప్యాలెస్‌ల తాతల వంటి, తలదన్నిన హర్మ్యా లు!) కనిపించిన వనితలందరూ నిద్రకు వెలి అయిన వారే! మొత్తం మీద మహిళా లోకం ఇప్పుడిప్పుడే, నిన్నమొన్ననే నిద్ర లేచిందని సినీ కవి అనుకోవడం నిశ్చయంగా అతిశయోక్తే. మన పీవీ రాసిన గొల్ల రామవ్వ కథ సంగతి చూడండి. రాత్రంతా రజాకార్ల, రజాకార్ల మిత్రులైన రాచరికం పోలీసుల బూట్ల చప్పుడు వినిపిస్తున్నంత సేపు, పోలీసుల బారినుంచి, స్వాతంత్య్ర సమరయోధుడైన ఓ యువ కుడికి రక్షణ కల్పించి, సురక్షితంగా బయటికి పంపించేదాకా రామవ్వ నిద్రపోదు. చిన్నప్పుడు, కొన్నేండ్ల కిందట, వరంగల్ పక్కనే మా ఊళ్లో మా ఇంటెనుక యాకమ్మ గుడిసె. దినమంతా రజాకార్లు వస్తారని భయం, రాత్రి వేళ దళం వాళ్లు వస్తారన్న అలజడి. యాకమ్మ మొగుడు తాగినా తాగకపోయినా రాత్రింబవళ్లు నిద్రపోయేవాడు. యాకమ్మ కనీ సం కునుకైనా తీయదు. ఓ రోజు రజాకార్లు వచ్చారని మొగోళ్లు చాలా మంది చేన్లు, చెలకలకు, ఊరవతలికి పారిపోతున్నారు. యాకమ్మ మొగు డు కోళ్లను కమ్మే పెద్ద గంప కిందికి పోయి కూర్చున్నాడు.

యాకమ్మ తన పసిబిడ్డను మా అమ్మ చేతికిచ్చి వడిసెల, వడిసెల రాళ్లతో మంచె ఎక్కింది!. భర్త, పిల్లలు పడు కున్న తర్వాత కూడా తల్లికి కడుపార నిద్ర పోయే అవకాశం ఉండదు. మధ్యన పసిబిడ్డ లేచి చనుబాల కోసం ఎక్కడ ఎక్కెక్కి ఏడుస్తాడోనని ఆ తల్లి ఆందోళన. మహిళలు, తల్లులు నిశ్చింతగా పడుకున్న, ఆదమరచి నిద్రపోయిన సందర్భాలు చాలా తక్కువ. రామాయణం చూడండి, భారతం చూడండి - మగ మహాశయులు పడుకొని ఉంటారు, రాజ గృహాల్లో మహిళామణులు నిద్రకు దూరమై ఉంటారు. కుంతీదేవి, గాం ధారి నిద్రపోలేదు. అయిదుగురు మగధీరులు, ఏదంటే అది చేయగలిగే సాక్షాత్తు కృష్ణ భగవానుడు తానెప్పుడు పిలిస్తే అప్పుడు పలికినా ద్రౌపది బహుశా నిద్రపోలేదు. అగ్నిపుత్రి ద్రౌపది ప్రతీకార జ్వాలలతో, అవమా నపు చిచ్చులో భగభగ మండుతూ నిద్ర పోగలుగుతుందా?! బొంబా యిలో పుట్టి ప్రపంచ ప్రసిద్ధుడైన ఆంగ్ల రచయిత రుడ్ యార్డ్ కిప్లింగ్ ఒక పుస్తకంలో ద్రౌపది గురించి రాసిన మాటలు ..she was the woman who managed to keep her head while every on -e around her lost theirs. Naturally hers was the earth and she the immortal empress.. ద్రౌపదిని ఇచ్ఛాశక్తి అని అంటారు. ఆమె వజ్రసంకల్పం, అకుంఠిత దీక్ష, మొక్కవోని చొరవ, ఈ కాలం జార్గన్‌లో చెప్పాలంటే ఆమె లాబీయింగ్ కారణంగానే కురుక్షేత్ర సంగ్రామంలో దుష్టసంహారం జరిగిందని, మీసాల్లేని కృష్ణుడు కూడా రోషంతో మీసాలు మెలేసేవాడని ఒక మేధావి అన్నాడు.

గత అయిదు వేల సంవత్సరాల చరిత్రలో వెనుకకు వెళ్లి అవలోకిస్తే నిద్రాహారాలు మాని విజయశిఖరాలు అధిరోహించిన వనితా రత్నాలు అనేకులు కనిపిస్తారు వివిధరంగాల్లో ఋగ్వేదకాలంలో ఋషిత్వం పొం ది రాణించిన మహిళామణులు ముప్ఫై వరకు ఉంటారని సాక్ష్యాధారా లు లభించాయి చరిత్ర శోధకులకు. ఋషలై, సరుచిరులై మైత్రేయి, గార్గి సమానస్థాయిలో నిలిచి మహాఋషి యాఙ్ఞవల్క్యునితో తాత్త్విక వాదన ల్లో తమ అపార వైదుష్యాన్ని ప్రదర్శించారు. ధర్మ స్మృతికర్త మను మహ ర్షి సైతం స్త్రీలను గౌరవించిన చోటనే దేవుళ్లకు సంతృప్తి కలుగుతుందని, స్త్రీలను గౌరవించనిచోట ఫలితాలు శూన్యమన్నాడు. అయినా, వేద కాల సంస్కృతికి, సంప్రదాయాలకు భిన్నంగా, విరుద్ధంగా హైందవ సమాజం లో స్త్రీలు అనేక చారిత్రక దశల్లో వివక్షకు, లైంగికదాడులకు, అన్యాయాల కు, మూఢాచారాలకు, దుష్ట సంప్రదాయాలకు గురై బలయ్యారు. హైందవ సమాజం కుళ్లి దుర్గంధంతో కుప్పకూలుతున్న భయానక సూచ నలు కనిపించాయి. ప్రాచీన, మధ్యయుగాల మౌఢ్యాన్ని దాటి ఆధునిక యుగంలో అడుగుపెడుతున్నా స్త్రీలు ఘోరమైన వివక్షకు, అసమానతల కు, పురుషాధిపత్యానికి, అణిచివేతకు గురికాకతప్పడం లేదు.

స్త్రీని దేవత గా, మాతృమూర్తిగా కీర్తించిన సమాజంలోనే ఆమెను రక్కసిగా, అశుభమూర్తిగా వర్ణించిన నిదర్శనాలున్నాయి. ఏమైనా, మానవాళి చరి త్రలో మహిళలు కొందరు సాహసించి తమ అస్తిత్వాన్ని నిలుపుకొన్న, తమ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించిన ఘటనలు అనేకం. రాజా రామ్మో హన్‌రాయ్ వంటివారు ఈ దేశంలో స్త్రీల అస్తిత్వ పోరాటానికి సంస్కర్త లుగా అండగా నిలిచారు. భారత స్వాతంత్ర సమరంలో, గడిచిన నూటా యాభై ఏండ్ల రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, సారస్వత ఉద్యమా ల్లో, విద్య, వైజ్ఞానిక, ఆధ్యాత్మికరంగాలకలె, తెలంగాణ ఉద్యమాల్లో ప్రతిభావంత, విప్లవాత్మక పాత్ర నిర్వహించిన మహిళలు విశ్రాంతిని వర్జించారు. నిద్రను నిగ్రహించారు. భర్తల సిద్ధాంతాల కోసం భార్య లు చేసిన త్యాగాలు గొప్పవి. ఈ భర్తలు తమ సిద్ధాంతాలకు ఇచ్చిన విలు వను భార్యల బాగోగులకు ఇవ్వలేదు. గాంధీజీ దక్షిణాఫ్రికాలో సత్యాగ్ర హ పోరాటాలు జరుపుతున్నప్పుడు ఆయన సతీమణి కస్తూర్భా ఆరో గ్యం బాగా దెబ్బతిన్నది. డాక్టర్లు ఆమెకు గుడ్లు ఇవ్వాలన్నారు. గుడ్ల ఆహా రం ఇవ్వడానికి గాంధీజీ అంగీకరించలేదు. తన ప్రాణానికి హాని కలిగినా ఫర్వాలేదు కానీ గుడ్ల ఆహారం తీసుకోనని, గాంధీజీ సిద్ధాంతాన్ని గౌరవి స్తానని కస్తూర్భా ప్రతిన చేశారు. తన ప్రాణం కంటే తన భర్త గాంధీజీ అహింసా సిద్ధాంతం ముఖ్యమైనదని ఆమె డాక్టర్లకు చెప్పారు.

సినిమా కవి లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురు ష ప్రపంచం అన్నాడు. ఇటీవల ఫిబ్రవరి 3 ఆదివారం రాత్రి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కలకత్తా నడిబొడ్డు రోడ్డు మీద రాజ్యాంగ రక్షణ కోసం ధర్నాకు హఠాత్తుగా కూర్చోవలసిన క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. మమ తా బెనర్జీ బక్కపలుచటి మనిషి. ఆమె ధర్నాతో పురుష ప్రపంచం దద్ద రిల్లిందో లేదో గానీ ఢిల్లీలో మోదీ ప్రభుత్వంలో వణుకుపుట్టింది. కేంద్రం తక్షణమే జోక్యం కల్పించుకోవలసిన పరిస్థితి ఉత్పన్నమైందని స్వయం గా దేశ వ్యవహారాల మంత్రి ప్రకటించారు (బీజేపీ సన్యాసి యోగి ఆది త్యనాథ్ పాలిస్తున్న రాష్ట్రంలో హత్యలు జరుగని రోజు లేదు, అయినా అడిగే నాథుడు లేడు!) హుటాహుటిన దేశ వ్యవహారాల మంత్రి రాష్ట్ర గవర్నర్ నుంచి నివేదిక కోరారు. రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి (మోదీ ప్రభుత్వం నియమించిన గవర్నర్, ప్రజలు ఎన్నుకున్న ముఖ్య మంత్రి!) ధర్నాపై రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, డీజీపీతో మాట్లాడి కేం ద్రం కోరిన రీతిగా నివేదిక పంపించారు. సుప్రీంకోర్టు జోక్యం లేకపోతే బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన, అంటే మోదీ పాలన వచ్చి మమత కలక త్తా కారాగారంలో బందీ అయ్యేది. కాకపోతే సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్, ఐటీ డిపార్ట్‌మెంట్, ఎన్.ఐ.ఏ., అన్నింటికంటే ముఖ్యంగా అజిత్ దోవల్, అమిత్ షా పంజాలో ఇరుక్కొని గిలగిలలాడవలసి వచ్చే ది. ఏ రాష్ట్రంలో ఇటువంటి దుస్థితి రాకుండా నివారించడానికి, రాజ్యాం గం ప్రకారం నిజమైన ఫెడరల్ వ్యవస్థ దేశంలో ఏర్పడటానికి సీఎం కేసీఆర్ అపార విజ్ఞతతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడాలంటున్నారు.

773
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles