మున్నూరుకాపులు పరివర్తనా సారథులు

Sat,February 16, 2019 01:43 AM

ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ కులసంఘాల భవనాల నిర్మాణానికి స్థలాలు కేటాయించడంతో రాష్ట్రంలో కులాల ఐక్యతకు వేగం పుంజుకున్నది. కాకతీయుల కాలంలో గొలుసుకట్టు చెరువులు నిర్మించిన మున్నూరుకాపులు వ్యవసాయంతో పాటు ముస్లిం దండయాత్రల నుంచి కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడేందుకు సైన్యంగా పనిచేశారు. దీనికోసం వేయిమంది (హజారీ) సైన్యాన్ని ఏర్పాటుచేశా రు. మున్నూరు కాపులలో ఇప్పటికీ గోల్కొండ హజారీలు గా, సుబేదారి హజారీలుగా ఇంటి పేరు స్థిరపడింది. కాకతీయులు పేద కులాల్లో ఆత్మగౌరవం పెంచడానికి కాకతీయుల రాజకీయ పట్టణమైన కొలనుపాకలో శైవ సంప్రదా యం ప్రకారం 18 శూద్రకులాలకు మఠాలను స్థాపించా రు. కులపురాణాలు వృత్తికులాల వంశ చరిత్రను తెలియజేస్తాయి. ఈ మఠాల్లో మున్నూరు కాపులకు కూడా శైవ మఠం ఉన్నది.

ప్రాచీనకాలం నుంచి మున్నూరు కాపులు రాజకీయ చైతన్యవంతులు. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం అయినప్పటికీ పటేల్, పట్వారీ వతన్లు చాలావరకు మున్నూరుకాపుల చేతుల్లోనే ఉండేవి. కాలక్రమంలో సంఖ్యాపరంగా విశిష్ట స్థానంలో ఉన్నప్పటికీ రాజకీయంగా, సామాజికంగా అణిచివేతకు గురిచేయబడ్డారు. స్వాతంత్య్రోద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాంబశివ కన్నంవార్, సయాజీశీలంలు పోరాటం చేసి ఎరవాడ జైలుకెల్లి శిక్ష అనుభవించారు. తెలంగాణ మున్నూరు కాపులు తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేయడంతో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించారు. రాష్ట్రంలో 18 శాతం ఉన్నప్పటికీ ఆంధ్ర పాలనలో సరైన ప్రాతినిధ్యం దక్కలేదు. బొజ్జం నర్సింహులు నాయకత్వంలో హైదరాబాద్‌లో మున్నూరు కాపు మహాసభ 1930లో ప్రారంభమైంది. 2007లో ఆవిర్భవించిన తెలంగాణ మున్నూరుకాపు మహాసభ సామాజిక అభివృద్థితో పాటు, ప్రభుత్వం ద్వారా మంజురయ్యే పథకాలను, సంఘ సభ్యులకు వర్తింపజేసి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నది. ఇం దులో భాగంగా మున్నూరు కాపులకు వచ్చే ఫలాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఫిబ్రవరి 16న హైదరాబాద్‌లోని అనోజిగుడలో మహాసభ బహిరంగ సభ నిర్వ హిస్తున్నారు. ఈ సభకు కుల బంధువులంతా తరలిరావా లి. మున్నూరు కాపుల ఐక్యతను చాటాలి.

- డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్
(నేడు అన్నోజిగూడలో జరిగే తెలంగాణ మున్నూరుకాపు మహాసభలో మున్నూరుకాపు చరిత్ర-సంస్కృతి గ్రంథం
ఆవిష్కరణ జరుగుతుంది)

451
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles