బంజారాల ఆరాధ్యదైవం

Fri,February 15, 2019 01:29 AM

సంత్ సేవాలాల్ మహారాజ్ హింస పాపమని, మత్తు, ధూమ పానం శాపం అని హితవు పలికిన మహనుభావుడు. బంజారా జాతికే కాదు ఇతర కులాలకూ ఆదర్శ పురుషుడయ్యాడు. సేవాలాల్ మహారాజ్ బోధనల ద్వారా బంజారా జాతి పురోగమిస్తున్నది. బంజారాల దుర్భరస్థితిని తొలిగించి ఆర్థిక, సాంఘిక, రాజకీయ సంస్కరణల ద్వారా బంజారాలను చైతన్యపరిచి అభివృద్ధి బాటలో నడిపించేందుకు సంత్ సేవాలాల్ మహారాజ్ కృషిచేశారు. సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15వ తేదీన అనంతపూర్ జిల్లా రాంజీనాయక్ తండాలో జన్మించాడు.
SEVALAL
బంజారా సమాజం అశాంతి, సంక్షోభంలో ఉన్నప్పుడు తన బోధనల ద్వారా బంజారా జాతిని ధర్మ మార్గంలో నడిపించి, జాగృత పరిచారు. బంజారా జాతికి ఒక శక్తిని, శాంతిని, ఐక్యమత్యాన్ని పెంపొందించిన తపస్వీ ఆయన. బంజారా తండాల్లో సాంఘిక దురాచారాల ను, మూఢనమ్మకాలను రూపుమాపడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగశీలి. సేవాలాల్ మహారాజ్ ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశారు. వీటిలో ధర్మప్రచారం, ఆర్థిక సంస్కరణలు, మత మార్పిడిలు అరికట్టడం, క్షేత్రధర్మాన్ని రక్షించడం వంటివి ఉన్నాయి. ఆ జన్మ బ్రహ్మచారిగా సమాజానికి అంకితమైన ఆయన మనకు స్ఫూర్తిప్రదాత.ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మన పండుగలకు, మన మహనీయుల జయంతులకు అత్యంత ప్రాముఖ్యం ఇస్తున్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి దేశవ్యాప్తంగా అధికా రికంగా నిర్వహించుకోవాలి. దాదాపు 11 కోట్ల జనాభా వున్న బంజారాల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో సేవాలాల్ మహారాజ్ ఆశయాలను, లక్ష్యాలను నెరవేర్చటానికి జరుగుతున్న కృషి అభినందనీయం.
- జి.శంకర్ నాయక్
తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు
(నేడు సేవాలాల్ మహారాజ్ జయంతి )

403
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles