మతవాదంపై ధిక్కార స్వరం


Wed,February 13, 2019 12:51 AM

ఇరాన్‌లోని మతాధికారులు 1979 ఇస్లామిక్ విప్లవ నలభయ వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1979లో అయతొల్లా ఖొమేనీ నాయకత్వంలోని ఇస్లామిక్‌వాదులు మొహమ్మద్ రెజా పహ్లవి నాయకత్వంలోని లౌకిక రాచరికాన్ని కూలదోశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ రాజకీయ వ్యవస్థలో విలాయత్ ఇ ఫకి హ్ (న్యాయమూర్తి సంరక్షణ) అనే సిద్ధాంతం ఇరుసులాంటిది. దీని ప్రకారం షియా మత న్యాయమూర్తి దేశాధినేత అవుతాడు. దైవ సార్వభౌమత్వం ప్రాతిపదికన ఒక న్యాయమూర్తి ఇంత శక్తిమంతమైన పదవి పొందడానికి న్యాయబద్ధత లభిస్తున్నది. నేటి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌లో మతవాద, గణతంత్ర లక్షణాలు ఇమిడి ఉన్నాయి. దేశాధ్యక్షుడిని, పార్లమెంట్‌ను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకుంటారు. ధర్మరక్షక మండ లి, న్యాయవ్యవస్థ వంటి సంస్థలకు మాత్రం సర్వోన్నత నాయకుడు నియమించిన వారుంటారు. ధర్మరక్షక మండలి (గార్డియన్ కౌన్సిల్) ఎన్నికలను పర్యవేక్షించి చట్టసభను ఆమోదిస్తుంది. ఇస్లామిక్ రిపబ్లిక్ రాజ్యాంగం ప్రకారం- ప్రతి శాసనం, విధానం, కార్యక్రమం ఇస్లామిక్ సూత్రాలకు అనుగుణమైనవి గా ఉండాలె. శాసనసభ నిర్ణయాలను పర్యవేక్షించే బాధ్యత ఈ ధర్మ రక్షక మండలిది. శాసనాలు ఇస్లామిక్ సూత్రాలను ఉల్లంఘిస్తున్నాయా లేదా అనేది ఈ మండలి పరిశీలిస్తుంది. ఇరాన్‌లోని ఈ అసాధారణ రాజకీయ వ్యవస్థ నాలుగేండ్లుగా ఎంతో ఆంతరంగిక ఘర్షణను సృష్టించింది. ఒకప్పుడు అమెరికా మిత్రదేశంగా ఉన్న ఇరాన్ ఇస్లామిక్ విప్లవం తర్వాత శత్రుదేశంగా మారింది. అంతర్జాతీయ ఆంక్షలు, మతాధికారులు పాలనా లోపం, తీవ్రమైన అవినీతి దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చాయి. నిరుద్యో గం, ద్రవ్యోల్బణం ఇంకా పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ పరిస్థితుల్లోనూ, ఇస్లామిక్ రిపబ్లిక్ నిలబడుతుందనడంలో సందేహం లేదు.

త్వరలో మరో విప్లవం వచ్చినా ఆశ్చర్యం లేదని కొందరు అంటున్నారు. నలభై ఏండ్ల తర్వాత ఇరాన్ ఇప్పుడెట్లా ఉన్నదనే ఆసక్తి వ్యక్తమవుతూ ఉన్నది. 1989లో అయతొల్లా ఖొమేనీ మరణించడంతో, ఆయనకన్నా ఛాం దసవాది అయతొల్లా ఖమేనీ అధికారానికి వచ్చారు. ఈయన మతవ్యవస్థను మరింత బలోపేతం చేశారు. ఈ కొత్త ఛాందసవాద వ్యవస్థకు వ్యతిరేకంగా 1990లో సంస్కరణవాద ఉద్యమం తలెత్తింది. అయితే మత వ్యవస్థలు బలంగా ఉన్నందువల్ల ఈ సంస్కరణవాదులు అధికా రం చేపట్టే అవకాశాలు తక్కువ. అయినప్పటికీ సంస్కరణవాదులు మహిళల హక్కులు, ప్రజాస్వామిక పాలన కోసం ఉద్యమించారు. పౌర ప్రభుత్వంలో సైనిక జోక్యం ఉండకూడదని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సంస్కరణవాదులు రెండుసార్లు అధికారానికి వచ్చారు. 199 7 నుంచి 2005 వరకు అధికారంలో ఉన్నారు. మళ్లా 2013లో ఉదారవాది అయిన హస్సన్ రౌహానీ దేశాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఇప్పటికీ రౌహానీ పాలనే సాగుతున్నది. సంస్కరణవాదులు పార్లమెంట్‌ను, దేశాధ్యక్షపదవిని చేజిక్కించుకోగలిగారు. వీరు కొన్ని దశాబ్దాలుగా మతవాద సంస్థల బలాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మతాధికారుల చట్టాలకు తలొగ్గి ఉంటూనే, ఖొమేనీ సూత్రాలను ఆమోదిస్తూనే, గణతంత్ర వ్యవస్థల ప్రాబల్యాన్ని విస్తరింపచేస్తూ ఉన్నారు. అయితే ఖమేనీ నేతృత్వంలోని మతవాద సంస్థల నుంచి గట్టి ప్రతిఘటన వీరికి ఎదురవుతున్నది. ఈ మతవాద సంస్థలు 1990 దశకం కన్నా ఇప్పుడు మరింత బలంగా ఉన్నాయి. అంతర్జాతీయ సమాజంతో కూడా ఇరాన్‌కు తరచూ ఘర్షణ సాగుతున్నది. ఇరాక్‌తో ఎనిమిదేండ్ల పాటు యుద్ధం సాగింది. నాలుగు దశాబ్దాలుగా అంతర్జాతీయ ఆంక్షలు అమలవుతున్నాయి.

అమెరికా, యూరోపియన్ యూనియన్‌తో పాటు ఐరాస కూడా ఆంక్షలను విధించింది. ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన షరతులను ఉల్లంఘించింద ంటూ ఈ ఆంక్షలను విధిస్తున్నాయి. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ఇరాన్ పట్ల అత్యంత వైషమ్యంతో వ్యవహరిస్తున్నది. ఒబామా అమెరి కా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిన ఒప్పందం ప్రకారం- ఇరాన్ తన అణు కార్యక్రమంపై పరిమితులకు అంగీకరించింది. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా మళ్లా ఇరాన్‌పై పాత ఆంక్షలను పునరుద్ధరించింది. కొన్ని కొత్త ఆంక్షలు కూడా విధించింది. ట్రంప్ ప్రయాణాలపై నిషేధం విధించడం వల్ల ఎక్కువగా నష్టపోతున్న ముస్లిం దేశం కూడా ఇరానే. ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో, సామాజిక కట్టుబాట్లను సరళీకరించడంలో, అంతర్జాతీయ ఆంక్షలను సడలింపజేయడంలో సంస్కరణవాదులు కొంత పురోగతి సాధించారు. కానీ ఇరాన్‌లోని రాజకీయ వ్యవస్థ చాలా ప్రమాదకర లక్షణాలను కలిగి ఉన్నది. మతాధికారులు ఏ సంస్కరణను చేపట్టినా మొగ్గలోనే తుంచి వేస్తున్నారు. ప్రజాస్వామికీకరణ కార్యక్రమాన్ని అడుగడుగునా అడ్డుకుంటున్నారు. 2017 డిసెంబర్ నుంచి 2018 జనవరి వరకు ఇరాన్‌లో భారీ నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. సంస్కరణవాదులు అర్థవంతమై న మార్పులు తేగలరనే నమ్మకం ప్రజల్లో పోయింది కనుకనే ఈ ఉద్యమాలు మొదలయ్యాయి. ఆర్థిక సమస్యల పట్ల నిరసనకారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇతర దేశాల్లో యుద్ధాలకు ఇరాన్ నిధులు ఇవ్వడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. యెమెన్, సిరియా వంటి దేశాల్లో పోరాటాలకు ఇరాన్ మద్దతు ఇస్తున్నది. మతాధికారుల పాలన ముగియాలని ప్రజలు నినాదాలు చేశారు. రౌహానీ సంస్కరణలను తేవడంలో విఫలమయ్యారు.

అవినీతి తీవ్రస్థాయిలో ఉన్నది. ఆర్థికవ్యవస్థ బాగుపడలేదు. పౌర, రాజకీయ హక్కుల్లేవు. మహిళల సమానత్వ భావన లేనేలేదు. ఇంటర్నెట్ అందుబాటులో లేదు. అమెరికా మళ్ళా ఆంక్షలు విధించడంతో, ఇక సంస్కరణలు చోటుచేసుకుంటాయనే ఆశ ప్రజలకు పూర్తి గా పోయింది. ఇతర దేశాల్లోని ఇరానియన్లు తమ దేశంలో సంస్కరణ లు రావాలని నిరసన ఉద్యమాలు చేస్తున్నారు. ఇంత ఉద్యమాలు సాగుతున్నా సంస్కరణవాదులు ప్రజా ప్రాతినిధ్య సంస్థలలో పట్టు సాధిస్తారనే ఆశలేదు. సంస్కరణవాదులు శాసనసభకు గెలిచినా చివరికి విఫలమయ్యారనే ముద్ర పడటం ఖాయం. ఈ నేపథ్యంలో ఇరాన్‌లోని ఇప్పటి రాజకీయ పరిస్థితిలో చట్టబద్ధమై న మార్పులు రావనే అభిప్రాయం బలపడుతున్నది. ఈ మతవాద వ్యవ స్థ ఉన్నంతకాలం సంస్కరణలు సాధ్యంకావనే అభిప్రాయం నెలకొనడంతో ఈ వ్యవస్థను కూలదోయాలనే వర్గం ఒకటి తయారైంది. వీరిలో ఎక్కువగా విదేశాల్లో స్థిరపడిన ఇరానియన్లు ఉన్నారు. ఒకప్పుడు దేశాధినేతగా పదవీచ్యుతుడైన రాజు రెజా పహ్లవి కుమారుడు కూడా ఉన్నా డు. అయితే విదేశాల్లోని ఇరానియన్లలో కూడా అనేక విభేదాలున్నాయి. ఇరాన్‌లోని మతవాద వ్యవస్థను కూలదోయాలనే విషయంలో ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ, ఆ తర్వాత ఏర్పడబోయే చట్రంపై విభేదాలు న్నాయి. దీంతో వారి వనరులు, మేధోసంపత్తి వృథా అవుతున్నాయి. ఇరాన్ అధికారపక్షాన్ని కూలదోయడంలో విఫలమవుతున్నారు. ఇరాన్ లో మతవాద వ్యవస్థను కూలదోయాలనే వారు, దానికి ప్రత్యామ్నాయా న్ని ఎట్లా నిర్మించాలనే స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ప్రతిపక్షాలన్నీ లౌకి క ప్రజాస్వామ్యం అంటున్నాయి. కానీ అదేమిటనే స్పష్టత వారికి లేదు. రాకుమారుడు పహ్లవికి తాను సింహాసనం మీద కూర్చోవాలని లేదు.
naser
ప్రజలు ఎటువంటి రాజకీయ వ్యవస్థను కోరుకుంటున్నారో తెలుసుకోవాలంటున్నారు. రూపమేమిటనేది కాదు, సారమేమిటనేది ప్రధానం అన్నారాయన. ఇరాన్ లౌకిక, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంగా అవతరించాలనేది నా కోరిక. కానీ తుది రూపం అనేది ప్రజలు నిర్ణయించాలె అన్నారాయన. పహ్లవి ఆలోచనాధోరణి సమంజసమైనది. కానీ ఇప్పుడున్న మత వ్యవస్థకు ప్రత్యామ్నాయాన్ని రూపొందించడంలో పహ్లవి ప్రతిపక్షాలకు సహకరించాలె. అందరికి కేంద్రబిందువు కావాలె. వీరు చూపెట్టే ప్రత్యామ్నాయం ప్రజలను ఆకట్టుకోగలగాలె. ఇస్లామిక్ రాజ్యం అనే భావన చాలామందికి నచ్చడం లేదు. ఇస్లామిక్ రాజ్య భావనను ఎండగట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. మతాధికారుల విధానాలను వారు ప్రశ్నిస్తున్నారు. కానీ ఇప్పటికే ప్రజలు మతాధికారుల పాలనతో విసిగి ఉన్నారనేది అవి గమనించడం లేదు. ఇప్పుడు ప్రతిపక్షాలు చేయాల్సింది- ప్రత్యామ్నాయాన్ని సూచించడమే. ఇస్లామిక్ రాజ్యాన్ని ప్రజాస్వామ్యం గా ఎట్లా మార్చాలనేది ప్రధానం. ప్రత్యామ్నాయ రాజకీయ స్వరూపాన్ని రచించి, ప్రజల్లో ప్రచారం చేయనంత వరకు ప్రతిపక్షాలు బలహీనంగానే ఉండిపోతాయి. పరివర్తన వైపుగా దేశాన్ని నడిపించాలని అవి గ్రహించాలె. పరివర్తన అసాధ్యమేమీ కాదు. అమెరికా లేదా ఇజ్రాయెల్‌తో ఇరాన్ యుద్ధానికి దిగినా, అయతొల్లా ఖమేనీ కాలధర్మం చెందినా, అనుకోకుండా ప్రజలు తిరుగుబాటు చేసినా ఇరాన్‌లో అనూహ్య మార్పు వస్తుంది.
(వ్యాసకర్త: ఆస్ట్రేలియన్ క్యాథలిక్ విశ్వవిద్యాలయం నేషనల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో సీనియర్ అధ్యాపకుడు)
( ది కన్వర్జేషన్ సౌజన్యంతో)

909
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles