స్వచ్ఛ సర్వేక్షణ్‌ను స్వాగతిద్దాం

Fri,January 18, 2019 01:14 AM

జనవరి 4 నుంచి 2019 జనవరి 31 వరకు దేశం అంతటా మొదలైన స్వచ్ఛ సర్వేక్షణ్ కొనసాగనున్నది. ఇంతవరకు అమృత్, స్మార్ట్ సిటీస్, హృదయ్ లాంటి ప్రతిష్టాత్మక పథకాలను ఎన్డీయే ప్రభుత్వం చేపట్టింది. అమృత్ కార్యక్రమ విస్తరణలో స్వచ్ఛ సర్వేక్షణ్ విధానాన్ని 2016లో ప్రారంభించారు. మొదటి రెండేండ్లలో కొన్ని పట్టణాలు, మహా నగరాలకు మాత్రమే అమృత్ పరిమితం కాగా, 2018, 2019 వచ్చేసరికి అన్ని మున్సిపాలిటీల్లో ఈ స్వచ్ఛ సర్వేక్షణ్‌ను విస్తరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అంటే స్వచ్ఛత ఆధారంగా ఒక నగరానికి ర్యాంకింగ్ ఇవ్వడం. క్రెడిట్ రేటింగ్ సర్టిఫికెట్స్ ఇచ్చే పాశ్చాత్య సంస్కృతి నుంచి స్వచ్ఛత ఆధారంగా ర్యాంకింగ్ ఇవ్వడం అనేది బహుశా మన దేశమే మొదలు పెట్టింది. స్వచ్ఛ సర్వేక్షణ్ వల్ల లాభనష్టాలు సామా న్య ప్రజలకు అంతగా అర్థం కాకపోయినా పురపాలక సంఘాలకు అర్థమ వుతుంది. అమృత్ నగరాలకు దేశస్థాయిలో మిగితా మున్సిపాలిటీలకు రీజియన్ స్థాయిలో జనాభా ప్రాతిపదికన ర్యాంకులు కేటాయిస్తున్నారు. లక్ష జనాభా దాటిన పట్టణాలను అమృత్ సిటీలుగా కేంద్రం గుర్తించింది. తెలంగాణలో మొత్తం 12 అమృత్ నగరాలున్నాయి. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్ విధానం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన డాక్యుమెంటేషన్, ప్రజల అభిప్రాయాలు, స్పందనకు, క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా ఉం టుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ నాలుగు విభాగాలుగా విభజించి ఈ సర్వేక్షణ్ చేస్తారు. ముఖ్యంగా ఘణ, వ్యర్థ పదార్థాలు, పారిశుధ్య నిర్వహణకు పురపాలక సంఘాలు తీసుకుంటున్న చర్యలపై ఈ ర్యాంకు ఇస్తారు.
Venkatesh
ఈసారి 500 మార్కులకు గానూ, 50కి పైగా ప్రశ్నలున్నాయి. పురపాలక సంఘా లు వాటికి సమాధానమిస్తూ ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. ఇదం తా ఆన్‌లైన్లోనే జరుగుతుంది. ఈ మొత్తంలో 45 శాతం మార్కులు ఘన, వ్యర్థ పదార్థాల నిర్వహణకే కేటాయించారు. అంటే చెత్త సమస్య తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. సౌత్ జోన్‌లో వంద లోపు ర్యాంకుల్లో తెలంగాణలోని 21 మున్సిపాలిటీలు చోటు దక్కించుకున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్-2018 పోటీలో బోడుప్పల్, ఫిర్జాదీగూడ, సిద్దిపేట నగరాలు సౌత్ ఇండియాలో మొదటి మూడు పట్టణాలుగా చోటు దక్కించుకోవడం తెలంగాణ రాష్ర్టానికి గర్వకారణం.స్వచ్ఛ సర్వేక్షణ్ 2017లో సూర్యాపేట 30వ ర్యాంకు సాధించి కేంద్ర ప్రభుత్వం చేత అవార్డు అందుకున్నది. ఈ పోటీ ద్వారా తెలంగాణలోని అన్ని పట్టణాల మధ్య ఒక సుహృద్భావ పోటీ వాతావరణం నెలకొన్నది. ఏదైనా ఉత్పత్తి జరుగుతున్నప్పుడు ప్రధాన ఉత్పత్తితో పాటు వ్యర్థాలు (అనుత్పాదకాలు) కూడా వెలువడుతాయి. ఇవి ఉపయోగకరం కాకపోయినా వాటిని నివారించలేం. నివారించి ఏ ఉత్పత్తినీ సాధించలేం. అలా అనివార్య వ్యర్థాలను ఏ దృక్పథంతో నిర్వహణ, నిర్వీర్యం చేస్తున్నామన్నదాన్ని బట్టే ఆ ఉత్పత్తి లేదా సంస్థ ఉన్నతి ఆధారపడి ఉంటుంది. సరిగ్గా పట్టణాల స్వచ్ఛత దీనిపై ఆధారపడి ఉంటుంది.

స్వచ్ఛ సర్వేక్షణ్ 2018లో ర్యాంకులతో, మున్సిపాలిటీలు ఆత్మావలోకనం చేసుకుంటూ కొత్తగా ఏర్పడిన 74 మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలుస్తూ మునుముందు కూడా దేశానికి మార్గదర్శకంగా నిలువాలని కోరుకుందాం.
భారతదేశంలో 72.2 శాతం జనాభా 6,38,000 గ్రామాల్లో నివసిస్తున్నారు. అంటే 27.8 శాతం జనాభా కేవలం 5,480 పట్టణాలు, నగరాల్లో జీవిస్తున్నారు.దేశంలోని పట్టణాలు, నగరాల్లో రోజుకు 1, 88,500 మెట్రిక్ టన్నుల చెత్త పోగవుతున్నది. రాష్ట్రంలోని పట్టణాలు, మహానగరాల్లో రోజుకు 6,628 మెట్రిక్ టన్నుల ఘన, వ్యర్థ పదార్థాలు ఉత్పన్నమవుతాయి. అంతేకాకుండా 10,592 కిలోమీటర్ల రోడ్డు ఊడ్చగా చెత్త, 12,81,302 కిలోమీటర్ల మురుగు కాలువలను శుభ్రపర్చగా వెలువడిన వ్యర్థం మొత్తానికి అదనం. ఒక మనిషి రోజుకు గరిష్ఠంగా 100 గ్రాముల మలం, 1.25 లీటర్ల మూత్రం, 250-450 గ్రాముల ఘన వ్యర్థాలను విసర్జిస్తారు. జనాభా ప్రాతిపదికన అంచనా వేసుకుంటే రోజుకు గ్రామాల్లో ఉత్పత్తయ్యే వ్యర్థాలకన్నా పట్టణాలు,నగరాల్లో ఉత్పత్తి అయ్యేవి మూడొం తులు ఎక్కువగా ఉంటుంది. ఇదంతా మానవ జీవన విధానంలో భాగం గా మనిషి మనుగడ కోసం లేదా సౌకర్యాల కోసం అవసరమయ్యే శక్తి (వనరు)ని ఉత్పత్తి చేసుకోవడంలో భాగంగా వచ్చే అనుత్పాదకాలు (వ్యర్థాలు). నిత్యం ఉత్పన్నమయ్యే ఈ అనివార్యమైన వ్యర్థాలను నిర్వహణ, నిర్వీర్యం ఎలా చేస్తున్నామన్నదాన్నిబట్టి, ఆ వృత్తిలో ఉన్నవారి పట్ల ఉన్న దృక్పథంపై ఆ సమాజపు స్థాయి, ఉన్నతి నిర్ధారించబడుతుంది. ఎందుకంటే మనిషికి కావాల్సిన మౌలిక అవసరాలు నీరు, గాలి, తిండి, గుడ్డ, గూడు మొదలగు అన్నింటికీ ప్రత్యామ్నాయాలు ఉంటాయి. కానీ పారిశుద్ధ్యానికి ప్రత్యామ్నాయం లేదు.

స్వచ్ఛభారత్ లాంటి కార్యక్రమాలు, పారిశుధ్య కార్మికులకు ఎక్కువ పనిభారం పెంచేవిగా తయారయ్యాయనేది కాదనలేని సత్యం. కానీ, వారికి ఒక గౌరవప్రద స్థానం, కనీస వసతులు కల్పించేవిగా లేకపోవడం విచారకరం. తమ ప్రాణాలు పణం గా పెట్టి నిత్యం ఈ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే సఫాయి కార్మికులను అంటరానివారిగా చిన్నచూపు చూస్తున్నారు. పారిశుధ్య కార్మికుల బాధలు గమ నిస్తే సగటు మానవ విలువల గురించి ఆలోచించే వాళ్లందరికి ఈ హృద యవిదారక ప్రక్రియను నిత్యం కళ్లచూస్తూ చేతులు కట్టుకొని ఉంటున్నందుకు గుండెలు బాదుకోవాలనిపిస్తున్నది. ఎందుకంటే ప్రతి కులవృత్తుల వారికీ, లేదా శాఖల వారికీ ఆ ప్రభుత్వం తరఫున సంక్షేమ పథకాలు లేదా రక్షణ సౌకర్యాలకు సంబంధించిన ప్రత్యేక చర్యలుంటాయి. కానీ శానిటరీ వృత్తివారికి ఆ సదుపాయం లేదు.

అన్నిరంగాలను బలోపేతం చేస్తున్నామంటూ ప్రకటనలు ఇస్తున్న ప్రభుత్వాలు పారిశుధ్య కార్మికులనే అమానవీయ వ్యవస్థను రూపు మాపేందుకు చర్యలు తీసుకోవాలె. మనుషుల స్థానంలో యంత్రాలను ప్రవేశపెట్టేందుకు శాస్త్ర సాంకేతికరంగాల అభివృద్ధిని ఆలంబన చేసు కోవాలె. కానీ మన ప్రభుత్వాలు అప్పుడప్పుడు కార్మికులకు కొన్ని సబ్బు లు, రేడియం జాకెట్లు, బూట్లు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నాయి. పారిశుధ్య వ్యవస్థను ఎంత యాంత్రీకరిస్తే అంత మంచిది. ప్రాణాలు పణంగా పెట్టి పారిశుధ్యపనులు చేస్తూ ప్రాణాలు వదిలిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఏదో కొంత నష్టపరిహారం పేరిట ఆదుకోవటం జరుగుతున్నా, ఈ అమానవీయ వ్యవస్థ నిర్మూళనకు తగు రీతిలో కృషి జరుగటం లేదన్నది వాస్తవం. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం పారిశుధ్య వ్యవస్థను ఆధునీకరించి దేశానికే ఆదర్శంగా నిలు వాల్సిన అవసరం ఉన్నది.

506
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles