యువతకు స్ఫూర్తి వివేకానందుని జీవితం


Sat,January 12, 2019 12:23 AM

vivekanandha
ఆధునిక యువతపైనే నాకు విశ్వాసం ఉన్నది. నేను నిర్మించిన ఆదర్శాన్ని దేశమంతా వ్యాప్తిచేసేది ఆధునిక యువతే, అలాంటి యువత ముందుగా బలిష్టంగానూ, జవసంపన్నులు గానూ, ఆత్మవిశ్వాసులు గానూ, రుజు వర్తనులుగానూ మారాలి. ఇలాంటి యువత వందమం ది ఉన్నా ఈ ప్రపంచాన్నే మార్చేయవచ్చునని యువతను కొనియాడారు స్వామి వివేకానంద. ఆయన సందేశా లు సూటిగా యువత హృదయాన్ని తాకుతాయి. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం మనసులో ఉన్న యువత ఈ దేశానికి కావాలని వివేకానందుడు కోరుకున్నాడు. వివేకానందుడు పశ్చిమబెంగాల్ రాష్ట్రం కలకత్తాలోని సిమ్లా అనే పేటలో విశ్వనాథ దత్తా, భువనేశ్వరీదేవి దంపతులకు 1863 జనవరి 12న జన్మించాడు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం.


వివేకానంద తన ఉపన్యాసంలో ఏ ధర్మమైతే ప్రపంచానికి గౌరవించడం నేర్పిందో, ఆ ధర్మానికి చెందినవాడిగా నేను గర్విస్తాను. అన్ని మతాలు సత్యమని మేము అంగీకరిస్తాం. మతతత్వం, పిడివాదం, వాటి భయంకరమైన వారసత్వం ఈ సుందరమైన భూమిపై చాలాకాలం రాజ్యం చేశాయి. అవి ఈ భూమిని హింసతో నింపేశాయి. మానవుల రక్తంతో తడిపేశాయి. సభ్యత సం స్కారాలను నాశనం చేశాయి. దేశం మొత్తాన్ని నైరాశ్యంలో ముంచేశాయి. ఈ భయంకరమైన దహనకాండ లేకపోతే మానవ సమాజం ఇప్పటికి ఎంతో అభివృద్ధి చెందేదంటూ ఉపన్యాసం చేశారు. వివేకానంద ఎక్కడ ప్రసంగించినా ప్రజలు ఓపికతో వినేవారు. వివేకానంద ఇచ్చిన సందేశాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలి.

- కాళంరాజు వేణుగోపాల్
(నేడు జాతీయ యువజన దినోత్సవం)

409
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles