కుటీర పరిశ్రమలు నెలకొల్పాలె

Wed,January 9, 2019 11:11 PM

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి ఎన్నో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబంధు, రైతు బీమా వంటి ఎన్నో సంక్షే మ పథకాలతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. అదేవిధంగా నిరుద్యోగుల సమస్యలు కూడా పరిష్కరించే దిశగా రాష్ట్రస్థాయి నుంచి మండల స్థాయి దాకా అభివృద్ధి ప్రణాళికలు రచించాలి. నిరుద్యోగ యువతకు అందులో భాగస్వామ్యం కల్పించాలి. అదేవిధంగా గ్రామస్థాయి నుంచి ఆయా ప్రాంతాలకు అనుగుణంగా కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలి. తద్వారా ఎన్నో ఏండ్లుగా రాష్ర్టాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగ సమస్యను నిర్మూలించిన వారమవుతాం. ఆ దిశగా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలి. అప్పుడే నిరుద్యోగ యువతకు ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుంది.
- బత్తిని లక్ష్మయ్య, మిర్యాలగూడ

జాగ్రత్తగా వ్యవహరించాలి

సీబీఐ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పు బట్టింది. రాజ్యాంగబద్ధ పదవులపై ఇలాంటి వివాదాలు రావడం శోచనీయం. వాటిని స్వతంత్రంగా పనిచేసేలా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నది. కాబట్టి సుప్రీంకోర్టు తాజా తీర్పుతో అయినా కేం ద్రం ఇకముందు ఇలాంటి వివాదాలు తలెత్తినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి.
- డాక్టర్ ఎండీ ఆదిల్, అంబర్‌పేట్, హైదరాబాద్

విలువలు పెంచే విద్య కావాలె

సమాజంలో నానాటికీ హింస, అరాచకాలు పెరిగిపోతున్నాయి. అక్షరాస్యత శాతం పెరుగుతున్నా విలువలు ప్రాతిపదికగా విద్యాబోధన జరుగకపోవటం కారణంగా రోజురోజుకూ హింసా దౌర్జన్యాలు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా విద్యాబోధనలో విద్యాప్రమాణాలతో పాటు, విలువలు పునాదిగా విద్యాబోధన జరుగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దీనికి అన్నిస్థాయిల్లో
ప్రభుత్వాలు కృషిచేయాలి.
- ఫజల్ అహ్మద్, అక్బర్‌బాగ్, హైదరాబాద్

240
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles