అప్రమత్తంగా ఉండాలె


Tue,January 8, 2019 11:33 PM

రాష్ట్రంలో చలి తీవ్రతగా మళ్లీ పెరుగుతున్నది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. స్వైన్ ఫ్లూ లాంటి వైరస్ బారిన పడకుండా వైద్యుల సూచనలు, సలహాలు పాటించాలి. సొంత నిర్ణయాలు తీసుకోవద్దని ఇప్పటికే వైద్యులు సూచిస్తున్నారు. స్వైన్‌ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తే ఆందోళన పడకుండా వైద్యులను సంప్రదించా లి. అలాగే చుట్టుపక్కల దోమలు లేకుండా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అపరిశుభ్రం గా ఉంటే సంబంధిత పారిశుద్ధ్య అధికారుల దృష్టికి తీసుకొని రావాలి. అలాగే అధికారులు ఎప్పటికప్పుడు చెత్తను ఏరివేస్తూ అక్కడ దోమ లు, ఈగలు ప్రబలకుండా తగిన చర్యలు చేపట్టాలి. ప్రజలు కూడా తడి, పొడి చెత్తను వేరు గా వేయాలి. ఎక్కడపడితే అక్కడ చెత్తవేయకుండా పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించాలి.
- తాళ్లపెల్లి మనోజ్‌గౌడ్, మలక్‌పేట్, హైదరాబాద్

ప్రాథమిక విద్య బలోపేతం

ఈ మధ్య పిల్లలకు చదువడం, రాయడం రావడం లేదనే వార్తలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలోనే పిల్లలకు పటిష్ట పునాది వేయాలి. దీనికోసం మూడవ తరగతికి వచ్చేసరికి పిల్లలకు ఎక్కాలు, చదువడం, రాయడం వచ్చేలా చూడాలి. అప్పుడే పిల్లలకు పై తరగతుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. విద్యాశాఖ ఈ దిశగా ఆలోచన చేయాలి.
- పి.శంకర్, హైదరాబాద్

చరిత్రాత్మక విజయం

ఏడు దశాబ్దాల కల నెరవేరింది. కోహ్లీ నేతృత్వంలోని యువ ఆటగా ళ్లు గవాస్కర్-బోర్డర్ ట్రోఫీని గెలిచి భారత్‌కు చరిత్రాత్మక విజయా న్ని సాధించిపెట్టారు. ఈ సిరీస్‌లో భారత జట్టు ఆటగాళ్లు బౌలింగ్, బ్యాటింగ్‌లో మెరుగైన ఆటను ప్రదర్శించారు. అందుకే ఈ విజయం దక్కింది. మునుముందు కూడా ఇదే ఆట తీరును కనబరుచాలి. వచ్చే ప్రపంచకప్‌ను మరోసారి భారత్‌కు అందించేలా కృషి చేయాలి.
- జి.నర్సింహా, సంగారెడ్డి

407
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles