మోదీ, బాబు చీకటిదోస్తులు


Tue,January 8, 2019 12:59 AM

1983 మేలో స్త్రీ వేషంలో వచ్చిన గుండాలు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు పుంగనూరు శాసనసభ్యుడు బగ్గిడి గోపాల్ పై దాడి చేశారు. మీడియా మాత్రం కొజ్జాల చేతిలో దెబ్బలు తిన్న గోపాల్ అని ప్రచారం చేశాయి. ఆ తర్వాత గొపాల్ భార్యపై దాడి జరిగింది, తమ్ముడు కిడ్నాప్‌నకు గురయ్యాడు. ఇంతవరకు అతని శవం కూడా లభించలేదు. ఈ ఘటనల సందర్భంగా మొదటిసారిగా చంద్రబాబు పేరు వార్తల్లోకి వచ్చింది. అక్కడినుంచే తెలుగు రాష్ట్రంలో కుట్ర పూరిత రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ ప్రభుత్వం కూల్చివేతతో భ్రష్ట రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయి. కోవర్టులు, క్యాస్ట్ కరప్షన్లనే పునాదులపై మాయ సామ్రాజ్యం నిర్మించుకొని రాజకీయాల్లో కొనసాగుతున్నాడు. ఒకసారి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసి, రెండుసా ర్లు బీజేపీ సహయంతో అధికారంలోకి వచ్చాడు. కానీ, స్వతహాగా ఎప్పు డూ అధికారంలోకి రాలేదు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు ప్రధాన లక్ష్యాలను సాధించాలనుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వ సహా యంతో అష్ట దిగ్బంధనం చేసి విఫల రాష్ట్రంగా చూపించి తిరిగి సమైక్యాంధ్ర రాష్ర్టాన్ని ఏర్పాటు చేయడం. జగన్ ఆస్తులను, మీడియాను ఆర్థిక నేరాల కింద కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేయించి దివాలాదారుగా చేయడం. జగన్‌ను వివిధ కోర్టు కేసుల ద్వారా శాశ్వతంగా జైలు పాలు చేయడం. నోటుకు ఓటు కేసు తర్వాత హైదరాబాద్ నగరంలో సెక్షన్ 8 ను అమలుచేయడానికి కేంద్రానికి సిఫార్సు చేయనందుకు గవర్నర్ నరసింహన్‌ను శత్రు జాబితాలో చేర్చాడు. నరసింహన్ తొలిగింపు అనేది బాబు ఎజండాలో నాలుగవ అంశంగా చేరింది. ప్రధాని మోదీని ప్రత్యేకంగా ఐదుసా ర్లు కలిసి గవర్నర్‌ను తొలిగించమని విజ్ఞప్తి చేశాడు. ఆంధ్రప్రదేశ్‌కు కావల్సిన అంశాలకంటే ఈ నాలుగు అంశాలపైనే చంద్రబాబు ప్రదాని మోదీని 26 సార్లు కలిశాడు.


ఆంధ్రప్రదేశ్‌కు 2016 సెప్టెంబర్‌లో ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని బాబు తో అరుణ్ జైట్లీ రోజుల తరబడి చర్చించిన తర్వాతనే విడుదల చేయడం జరిగింది. ప్యాకేజీలో ఉన్న అంశాలన్నింటికీ చంద్రబాబు అమోదం తెలి పారు. అందుకే టీడీపీ కేంద్రమంత్రి సుజనా చౌదరి 2016 సెప్టెంబర్ 11న ప్యాకేజీ వల్లనే ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ కంటే ఎక్కువగా లాభపడుతుందని, ఎందుకంటే శివరాజ్‌సింగ్ చౌహన్ కమిటీ గ్రాంట్లపై విధించిన 60:40 నిబంధన వల్ల 40 శాతం గ్రాంట్లను తిరిగి కేంద్రానికి చెల్లించాల్సి ఉంటుందనీ, కానీ ప్రత్యేక ప్యాకేజీ వల్ల వచ్చిన సహాయాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని అన్నాడు. టీడీపీ ఎంపీ జయదేవ్ 2017 మార్చ్ 10న మాట్లాడుతూ ప్రత్యేక హోదా వల్ల రాష్ర్టానికి రూ.2, 500 కోట్లు మాత్రమే వస్తాయి. కానీ, ప్రత్యేక ప్యాకేజీ వల్ల రూ.16,000 కోట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నాడు. ఆరు నెలల తర్వాత మార్చిలో కేంద్ర క్యాబినెట్ ప్రత్యేక ప్యాకేజీకి అమోదం తెలిపింది. టీడీపీ సభ్యుడు అశోక గజపతిరాజు కేంద్ర క్యాబినెట్‌లో ఉండి సంపూర్ణ మద్దతు ఇచ్చా డు. కేంద్రం ఉదారంగా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్మానించింది. చంద్రబాబు, నరేంద్ర మోదీల హనీమూన్ చెడటానికి కారణం ప్రత్యేక ప్యాకేజీ రాకపోవడమే కారణమా లేక వేరే కారణం ఎమైనా ఉన్నాదా అనేది ప్రధాన ప్రశ్న. అమిత్ షా బీజేపీ అధ్యక్షుడైన తర్వాత పార్టీని కొత్త పంథాలో నడిపిస్తున్నాడు. చిరకాల మిత్రపక్షమైన శివసేనను కాదని ఒంటరిగా పోటీచేసి మహరాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని పార్టీకి దక్కించుకున్నాడు. తెలంగాణలో బీజేపీ ప్రధాన పక్షంగా అవతరిస్తుందని ఊహించి విభజన చట్టం లో పేర్కొన్న నియోజకవర్గాల సంఖ్య పెంపును అడ్డుకున్నాడు.

చంద్ర బాబుకు మాత్రం నియోజకవర్గాల పెంపు, పునర్విభజన లేకుండా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అసాధ్యమని తెలుసు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ ప్రభంజనం, పవన్‌కళ్యాణ్ కలిసినా వచ్చిన మెజార్టీ 6,01,539 ఓట్లు మాత్రమే. బీజేపీలో ఉన్నతవర్గాల సమాచారం ప్రకారం చివరి మూడుసార్లు చంద్రబాబు మోదీని ప్రాధేయపడింది నియోజకవర్గాల పెంపు, పునర్విభజన గురించి మాత్రమే. మిత్రపక్షానికి సహాయపడాల్సిన ధర్మం బీజేపీకి ఉన్నదని గుర్తుచేసినా మోదీ బాధ్యత అంతా అమిత్ షాదే అని చెప్పాడు. అమిత్ షా తన పార్టీకి ఏది మేలు జరుగుతుందని ఆలోచిస్తాడు కానీ మిత్రపక్ష ప్రయోజనం గురించి ఎం దుకు పట్టించుకుంటాడు. అందుకే మోదీని వాజపేయిలాగా బెదిరించి పని చేసుకోవాలంటే కుదరదు మీ ప్రయోజనం కోసం మేము తెలంగాణలో పార్టీ ప్రయోజనాలను త్యజించలేమని నిక్కచ్చిగా చెప్పాడు. తెలు గు రాష్ర్టాల్లో బీజేపీ అత్యున్నతస్థాయి నాయకుడు పార్టీ ప్రయోజనాలను టీడీపీకి తాకట్టు పెడుతున్నాడని భావించి కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించి పంజరంలో పెట్టిన విషయం గమనార్హం. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో రిజర్వేషన్లు, సరిహద్దులను నిర్ణయించడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నిస్తే సఫలం కాలేదు. మారిన బీజేపీ తత్వం గురించి అంచనా వేయడంలో బాబు విఫలమయ్యా డు. చంద్రబాబు పదేపదే చెప్పే నమ్మిమోసపోయామనే విషయం సీట్ల పెం పు అమోదించకపోవడం గురించే కానీ బయటకు చెప్తున్నట్లు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకపోవడం గురించి కాదు. ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రలో నియోజకవర్గాల సంఖ్యను పెంచితే చంద్రబాబు ఇంకా ఎన్డీయేలో భాగస్వామిగా ఉండేవాడు. ఇంత గొడవ జరుగుతున్నప్పటికీ చంద్రబాబు, నరేంద్ర మోదీల సఖ్యత చెడిందంటే పొరపాటు పడ్డట్టే.

చివరి సమావేశాల్లో వీరిద్దరు ఏం చర్చించుకున్నారు? తీవ్ర విబేధాలు ఎందుకొచ్చాయనే విషయంపై నరేంద్ర మోదీ పెదవి విప్పడు. చంద్రబాబు నిజం చెప్పడు. నీవు వస్తానంటే నేను వద్దంటానా అని నరేంద్ర మోదీ, నీవు రమ్మంటే ఎక్కడికైనా రానంటానా అని చంద్ర బాబు చాటుమాట ప్రేమాయణం ఇంకా సాగిస్తున్నారు. కేసీఆర్, జగన్, పవన్ కళ్యాణ్ ఏకమై మోదీతో కలిసి రాష్ర్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని నిందించినా మోదీ అసలు విషయం చెప్పడు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంను అనేక ఆరోపణల మధ్య అదుపులేకుండా పెరుగుతున్న అం చనాలతో రాష్ట్ర ప్రభుత్వం కట్టడానికి అనుమతించడం, ప్రపంచానికి సేవలను అందిస్తున్న మన నిపుణులను కాదని సింగపూర్ కంపెనీలకు అమరావతి నిర్మాణం అప్పచెప్పడం వెనుక రహస్యమేమి టి? కేంద్ర నిధులతో నిర్మాణం అవుతున్నందున నరేంద్ర మోదీ మౌనం గా ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? చంద్రబాబు, నరేంద్ర మోదీ సంబంధాలపై అనేక అనుమానాలున్నాయి. దేశంలో రూమర్ మిల్లు (అబద్ధాలను, కుట్ర సిద్ధాంతాలను అనుమానాలను సృష్టించే) వ్యవస్థ కలిగిన ఏకైక పార్టీ టీడిపీ. లబ్ధి పొందిన మీడి యా సహాయంతో అనేక అవాస్తవాలను దశాబ్దాలుగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఒక పార్టీని విలన్‌గా చిత్రీకరించి, వ్యతిరేక పార్టీలన్నీంటిని సంబంధం లేకున్నా ఆ విలన్‌కు అంటగట్టి, రాష్ట్ర ప్రయోజనాల వ్యతిరే క గ్రూప్‌గా ప్రచారం చేస్తూ, ప్రజల్లో అనుమానాలను రేకెత్తిస్తూ లాభపడే విధానాన్ని చంద్రబాబు చాలా సమర్థవంతంగా అమలుపరుస్తూ వస్తున్నాడు.
m-nagendhar
దేశంలో అన్ని పార్టీలకు కారెక్టర్ సర్టిఫికెట్, బ్యాడ్ కండక్ట్ సర్టిఫి కెట్ ఇచ్చే అధికారాన్ని చంద్రబాబు తనకుతానుగా పుచ్చుకున్నాడు. సమయానుకులంగా హీరో పార్టీలను, విలన్ పార్టీలను నిర్వచిస్తాడు. ఆ తర్వాత రాజకీయక్రీడ ఆడుతాడు. సొంత మీడియా, అపరిమితమైన ఆర్థిక వనరుల్లేని వారు రాజకీయాల్లో కొనసాగలేని దురదృష్టకర పరిస్థితిని సృష్టించాడు. 2014లో కాంగ్రెస్ విలన్, జగన్ పిల్ల కాంగ్రెస్ అని ప్రజలను నమ్మించాడు. 2019లో బీజేపీ విలన్ టీఆర్‌ఎస్, వైసీపీ, జన సేనలు పిల్ల బీజేపీలు అని ప్రచారం చేస్తున్నాడు. తెలంగాణ ప్రజలు ఈ వాదాన్ని తిరస్కరించారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.
(వ్యాసకర్త: రాజకీయ విశ్లేషకులు, న్యూయార్క్)

908
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles