అభినందనీయం

Tue,January 8, 2019 12:59 AM

ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న ఆలోచనా ధోరణి నుంచి పుట్టిందే కంటివెలుగు పథకం. ఈ పథకం విజయవంతమైంది. రాష్ట్రవ్యాప్తంగా పేద ప్రజలం దరో ఈ పథకం సాయంతో కంటిచికిత్సలు చేయిం చుకున్నారు. ఇదిలా ఉంటే గత ఎన్నికల ప్రచారం లో భాగంగా కేసీఆర్ కంటి వెలుగు పూర్తవగానే, ఈఎన్టీ, దంత చికిత్సకు సంబంధించి వైద్యులు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చికిత్స అందిస్తారని తెలి పారు. ఇది హర్షణీయం. హైదరాబాద్‌లోని కోఠి ఈఎన్టీ దవాఖానలో రోజుకు వెయ్యి నుంచి పదిహే ను వందల దాకా ఈఎన్టీ బాధితులు డాక్టర్లను సం ప్రదిస్తున్నారు. ఇంటింటి చికిత్స ద్వారా చాలా మంది పేదలకు వైద్య సేవలు అందనున్నాయి. ఈ దిశగా కేసీఆర్ ఆలోచించడం అభినందనీయం. ఈ పథకాలతో ఆరోగ్య తెలంగాణ ఆవిష్కృతమవు తుందనటంలో సందేహం లేదు.
- నారదాసు రాజేందర్, తార్నాక, హైదరాబాద్

అర్హులకు న్యాయం జరుగాలె

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఆసరా పింఛన్లను అందిస్తు న్నది. ఈ పింఛన్ల పట్ల వృద్ధులు, వితంతవులు, ఒంటరి మహిళ లు, వికలాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్‌ఎస్ రెండో సారి సాధించిన విజయంలో ఆసరా పింఛన్ల ప్రభావం ఉన్నదన డంలో సందేహం లేదు. ఇలాంటి పథకాల అమలును నిష్పాక్షి కంగా, పారదర్శకంగా అమలు చేయాలి. అర్హులందరికీ న్యాయం జరుగాలి.
- బేగరి ప్రవీణ్ కుమార్, అంతారం, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా

నల్లధనాన్ని వెనక్కి తీసుకురావాలె

2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో నల్లధనం వెనక్కి తెచ్చి ప్రతి పౌరుని ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని మోదీ డాంబీకా లు పలికాడు. కానీ ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకోక పోవడం విడ్డూరం. నల్లధనాన్ని పేద, మధ్య తరగతి ప్రజలకు పంచితే పేదరికంలేని భారత్‌ను ఆవిష్కరించుకోగలం.
- బోనాల కృష్ణ, హైదరాబాద్

227
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles