వైవిధ్యం వైరుధ్యం కావొద్దు!


Sun,January 6, 2019 12:00 AM

నాగరికత అన్న పదానికి సభ్యత, సం స్కారం, ఉన్నమైన సంస్కృతి ఇలా అనేక అర్థాలు చెప్పబడినాయి. నైతి క ప్రవర్తన కలిగినవారిని నాగరికులు అంటా రు. అయితే ఈ ప్రవర్తన రెండు విధాలుగా అలవడుతుంది. ఒకటి న్యాయం వల్ల, రెండోది ధర్మం వల్ల. మానవజాతి మొదలైనప్పుడు శారీరక బలమే న్యాయంగా ఉండేది. అంటే ఎవరు బలం కలిగి ఇతరులను అణిచిపెట్టగల రో వారే వారి గుంపులకు నాయకుడయ్యేవా డు. ప్రకృతి మీద ఆధారపడి దొరికిన తిండి తినే స్థితి నుంచి తన బుద్ధిని ఉపయోగించి మానవుడు ఎదిగాడు. అప్పుడు శారీరక బల మే కాక బుద్ధి బలాన్ని ఉపయోగించి తమ జీవన విధానాన్ని మానవులు మార్చుకున్నా రు. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వలసలు పోలేదు. ఒకేచోట స్థిరపడి తమ చుట్టాలు, స్నేహితులతో ఒక వర్గంగా నివసించడం మొదలుపెట్టారు. శారీరక, మానసిక కోణాలే కాక ఆధ్యాత్మిక కోణాన్ని కూడా పెంపొందించుకున్న మానవులు వివిధ దైవ రూపాలను రూపొందించుకొని, క్రమంగా వాటిని వివిధ మతాలుగా మార్చుకోవడం మొదలుపెట్టారు. అంతేగాకుండా తన మేధతో మానవులు సాంకేతికతను అనూహ్యంగా పెంచుకున్నారు. ఏ పెరుగుదల అయినా రకరకాల విషయాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి వైవి ధ్యం పెరుగడం సహజం. అలాగే వివిధ భాషలు, ఆచారాలు, సంప్రదాయాలు, ప్రాంతా ల వాతావరణాలు వైవిధ్యం కలిగి ఉంటాయి. ఈ పరిస్థితిలో ఆ వైవిధ్యాలను గౌరవించే నాగరికత పెరుగాలె. లేకపోతే సాంకేతికతతో బలం పొందిన ఈ మానవ జాతి ప్రశాంతంగా బతుకడం కష్టం.

ముఖ్యంగా 20వ శతాబ్దం నుంచి వలస ప్రభుత్వాలు, రాజరికాలు పోయి, ప్రజాస్వామ్య దేశాలు ఎక్కువయ్యాయి. నిరంకుశ పాలకులు, రాజుల పాలన ఉన్నప్పుడు న్యాయవ్యవస్థ మొత్తం వారి చేతిలో ఉండి వారి ఇష్టానుసారం న్యాయపాలన జరుగుతుంది. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరు న్యాయమే కాక, ధర్మ ప్రవృత్తి, నైతిక ప్రవర్తన కలిగి ఉండాలి. ఎందుకంటే అందరూ సమానం అన్న వ్యవస్థలో శాంతి, సౌఖ్యాలు కాపాడటం అనేది అందరి బాధ్యత అవుతుంది. ఏ ఒక్కరి కి ఇతరుల పట్ల ఇటువంటి గౌరవం, తేడాలను గౌరవించే ప్రవృత్తి లేకపోయినా, ఆ సం ఘం మొత్తం అశాంతికి గురవుతుంది. ఇట్లా అందరినీ, వారి ఆచార వ్యవహారాలను గౌరవించి, సంస్కారవంతమైన ప్రవర్తన కలిగిన వాడిని నాగరికుడని అంటారు. యూనిటీ ఈజ్ నాట్ యూనిఫార్మిటీ! కలిసి ఉండటం అంటే ఒకేలా ఉండటం కాదు. మనుషుల మధ్య వైవిధ్యాలున్నా, అవి వైరుధ్యాలుగా మార్చుకోకుండా కలిసి మెలిసి ఉండటం! ఈ రకంగా ఉండటానికి సంస్కారం కావాలి. ఇద్దరు మనుషుల మధ్య ఎటువంటి తేడాలున్నా మానవీయత వల్ల బంధాలు బలపడాలి. వివిధ మతాలు, కులా ల వారు కలిసి ఉండాలి. ఎందుకంటే అవి ఒకరి వ్యక్తిత్వ విషయాలు. ప్రతి దేశంలో న్యాయవ్యవస్థ ఉంటుంది. కానీ నాగరికులం అనుకునే వారికి దా ని పరిధిలోకి వెళ్లకుండా తమ ఆత్మ ప్రబోధించిన మార్గంలో బతికే శక్తి ఉండాలి.

అనాగరికులు అన్నియుగాల్లోనూ ఉంటారు. అన్ని ప్రాంతాల్లోనూ ఉం టారు. వారికి ధర్మం అన్నది శూన్యం. ఇతరుల న్యాయవ్యస్థలను గౌరవించరు. ధర్మం అన్నది తెలి స్తే న్యాయంతో, శిక్షలతో పనిలేకుండా వ్యక్తులు సమాజంలోని శాంతి, సౌహార్దాలను కాపాడుతారు. అయితే ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. కాబట్టి ధర్మమార్గాన నడిచే వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారు. ఈ రోజుల్లో తప్పు చేస్తే శిక్ష ఉంటుందని భయమే తప్ప, అంతరాత్మ ప్రకారం తప్పుచేయకూడదనే భావన చాలా కొద్దిమందిలో చూస్తాం. న్యాయవ్యవస్థను తీసుకుంటే అందులో ఉన్న పదవుల్లో ఉన్నవారు కూడా వ్యక్తిగత భావనలకు అతీతులుగా ఉంటారనుకోవడం భ్రమే! వారు కూడా రాజ్యాంగాలను అడ్డం పెట్టుకొని అభ్యంతరకర తీర్పులు ఇవ్వగలరు. కానీ ధర్మమాత్రులుగా ఉన్నవారు చాలా తక్కువ. అటువంటి ఒక ధర్మమూర్తిని ప్రజాకవి కాళోజీ చూశారు. ఒకసారి ఆంధ్ర ప్రాం తంలోని నాయకుడు ఒకరు ఉత్తరం పంపాడు. పోస్ట్ చేస్తే అది ఎక్కడ పోలీసుల చేతిలో పడుతుందో అని ఒక వార్తాహరుడి చేతికిచ్చి వరంగల్‌లో కాళోజీకి అందజేయవలసిందిగా చెప్పారు. దురదృష్టవశాత్తూ అతను పోలీసులకు చిక్కాడు. ఆ ఉత్తరం వారి చేతి లో పడింది. అందులో నిజాం రాజుకు వ్యతిరేకంగా చాలా ఘాటుగా రాసిన మాటలు చాలా ఉన్నాయి. పోలీసులు కాళోజీ మీద కేసు పెట్టి అక్కడి కోర్టులో హాజరుపరిచారు. రాజ్యం ముస్లిం రాజైన నిజాంది. న్యాయమూర్తి ముస్లిం.

పట్టుకున్న పోలీసులు ముస్లింలే. ఇక కాళోజీ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కేసు అంతా విని ఆ ఉత్తరా న్ని కూడా అనువదించుకొని చూసిన ఆ న్యాయమూర్తి చెప్పిన తీర్పునకు ప్రజలందరూ నిరుత్తరులయ్యారు. ఆయన అన్నారు; ఈ ఉత్తరంలోని మాటలకు ఎవరిని శిక్షించాలి? అది రాసిన వారిని. ఇది ఎవరికి పంపారో, వారిని కాదు. ప్రభుత్వ వకీలు ఏదో చెప్పబోతే ఆ న్యాయమూర్తి ఇలా అన్నారట. ఒకవేళ ఎవరో ఇలాంటి ఉత్తరం మన నిజాంకు హిందువులకు వ్యతిరేకంగా రాసి పంపుతారనుకోం డి. మరి నిజాంను శిక్షించాలా? ఎంత న్యాయం, ఎంత ధర్మంగా ఉందీ మాట. ఇటువంటి సంస్కా రం ఇప్పుడు న్యాయమూర్తులు అందరిలో కనిపిస్తున్నదా? రాజ్యాంగం అన్నది మానవ ధర్మం కంటే గొప్పది కాదు. కాబట్టి కాలనుగుణంగా దానిలో కూడా మార్పులు చేసుకుంటాం. అది శిలాశాసనం కానప్పుడు, మార్పులకు లోనయ్యే బలహీనతలు అందులో ఉన్నప్పుడు అది వందల ఏండ్ల నుంచి పాటించబడుతున్న సంప్రదాయానికీ, ఆచారాలకూ మించినదా? కోట్లాది ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా తీర్పు ఇవ్వడం న్యాయ మా? ధర్మమా? సమాజంలో వివిధ మతాలకు చెం దిన వారు శాంతియుతంగా బతుకాలంటే ఇటువం టి వైరుధ్యాలు సృష్టించడం న్యాయమూర్తుల స్థాయి కి తగిన పనేనా? ఇప్పుడు కేరళలోని శబరిమలలో జరుగుతున్న అల్లర్లకు, వివాదాలకు కొందరు ప్రాణా లు కోల్పోయారు. అది వీరు సృష్టించిన వైరుధ్యం వల్ల కాదా? దేవుడున్నాడని ఎలా రుజువు చేయలే మో లేడని కూడా అలాగే రుజువు చేయలేము.
Kanakadurga
భారతదేశం లాంటి వైవిధ్యభరిత దేశంలో రాజ్యాంగంలో సిద్ధాంతం సెక్యులరిజం. అయితే ఒకరి మనోభావాలు నొప్పించే అధికారం ఎవరికీ లేదు. ఆఖరికి కోర్టు, న్యాయూర్తులకు కూడా లేదు. శబరిమలలో అనాదిగా వస్తున్న సంప్రదాయాల్ని కించపరుచటం అసలే నేరం. దీన్ని ధర్మపరిధిలోని అంశంగానే పరిగణించాలి. కానీ న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోకూడదు. గుడిమీద, దేవుడి మీద విశ్వాసం లేనివారు అస లు గుడికి ఎందుకు వెళ్లాలి? అదీగాక అంతశక్తి ఉన్న మహిళలు నేడు దేశంలో స్త్రీలు, బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చడానికి పాటుపడవచ్చు కదా! మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక దాడుల కు వ్యతిరేకంగా, వివాహిత స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్షలను ఎదిరిస్తూ కృషి చేయవచ్చు. ఆడవారి కోసం చేయవలసిన పనులు ఇన్ని ఉన్నాయి. మన కర్మకు మనల్ని వదిలేసి వినోదం చూసే దేవుడి గుడికి వెళ్లడానికి ఎందుకు సమయం, శ్రమ వృథా చేయడం? నాగరికుల లాగా బతుకాలంటే మనుషులను మానవీయంగా చూడాలి. సమాజంలోని వైవిధ్యా లు వైరుధ్యాలు అవకుండా ప్రతి పౌరుడూ కృషిచే యాలి. ఇంకా వెనుకబడి ఉన్న దేశంలో మరింత అశాంతి సృష్టించడం ఎవరికీ క్షేమం కాదు.
సంస్కారవంతమైన ఆలోచనలు, ఉన్నతమైన భావనలు, సఖ్యత కలిగిన ప్రవర్తన ప్రతి వారూ కలిగి ఉండాలి. అప్పుడు ఈ దేశం గొప్పగా భావించే సమ్మిళిత సం స్కృతి జీవించి ఉంటుంది. అన్ని రాష్ర్టాలలోకి తెలంగాణ రాష్ట్రం నేడు ఈ విషయంలో ఆదర్శంగా నిలుస్తున్నది.

806
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles