సమాఖ్యలోనే రాష్ర్టాల అభివృద్ధి

Sun,January 6, 2019 12:00 AM

పదహారు ఎంపీ స్థానాలతో కేసీఆర్ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడా అని కొందరు మాట్లాడుతున్నారు. సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజార్టీ లేక ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఏర్ప డే సంకీర్ణ ప్రభుత్వానికి బలమైన ఫెడరల్ స్ఫూర్తితో ఏర్పడే కేంద్ర ప్రభుత్వానికి మధ్య తేడా అర్థం చేసుకోలేకపోవడమే వాళ్ల అస్పష్ట ఆలోచనలకు మూలం. కేంద్ర ప్రభుత్వంలో అధికారం చెలాయించడానికి మాత్రమే ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వాలు తొందరగా విచ్ఛిన్నమవుతాయి. సంకీర్ణానికి ప్రాంతీయ పార్టీలు కొన్ని నిర్దిష్టమైన ప్రయోజనాలు ఆశించే మద్దతు ఇస్తాయి. ఆ ప్రయోజనాలు నెరవేరలేని పక్షంలో మద్దతు ఉపసంహరించుకుంటాయి. గతంలో 1989లో వీపీసింగ్, అలాగే 1997లో వాజపేయి ఆధ్వ ర్యంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాలు ఇవే కారణాల వల్ల కూలిపోవడం మనం చూశాం. ప్రస్తుతం ఏర్పడబోయే ఫెడరల్ ఫ్రంట్ దీనికి పూర్తిగా విరుద్ధం. రెండు ముఖ్య జాతీయ పార్టీల ఏకఛత్రాధిపత్యానికి, నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా, రాష్ర్టాల స్వేచ్ఛకు వికేంద్రీకృత అధికార స్థాపనకు మార్గదర్శకంగా ఈ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడబోతుందని కేసీఆర్ మాటలను బట్టి స్పష్టమవుతున్నది. భారత రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సృష్టించుకున్న కేసీఆర్ జాతీయస్థాయి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానని ప్రకటించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణం గా రాష్ర్టాలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ నుంచి బయటకు రావా లని, రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్ర ఆధిపత్యాన్ని పూర్తిగా పరిమితం చేయాలని, కేంద్ర ప్రభుత్వాన్ని రక్షణ, కరెన్సీ, విదేశాంగం వంటి అంశాలకే పరిమితం చేయాలని కేసీఆర్ వివరిస్తున్నారు.

మరీ ముఖ్యంగా నేటి రాజకీయాల్లో రాజ్యాంగంలోని విశిష్ట లక్షణమైన సమాఖ్య స్ఫూర్తి కనుమరుగవుతున్నది. ఈ నేపథ్యంలో కేసీఆర్ లాంటి నాయకులు సమాఖ్య స్ఫూర్తి నినాదం చేపట్టి ఫెడరల్ ఫ్రం ట్ ఏర్పాటు దిశగా పయనించడం జాతీయస్థాయిలో చర్చానీయాం శమైంది. ఈ చర్య రాష్ర్టాల బలోపేతానికి ముందుడుగుగా భావించ వచ్చు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటినుంచి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ర్టాలను రాజకీయ లబ్ధి కోసం అణిచి వేస్తూ సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచాయి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కొత్తలో రాజ్యాంగంలో ఎక్కడా సమాఖ్య అనే పదం ఉపయోగించనప్పటికీ రాజ్యంగ నిర్మాతలు మౌలికంగా సమాఖ్య విధానానికి మొగ్గు చూపారు. రాజ్యాంగంలోని మొదటి ప్రకరణ దేశాన్ని రాష్ర్టాల యూనియన్ అని పేర్కొంటున్నది. రాష్ర్టాల సమాఖ్య అని పేర్కొనకుండా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పేర్కొనడానికి రాజ్యంగా నిర్మాతలు రెండు కారణాలు పేర్కొన్నారు. 1.అమెరికా వలె రాష్ర్టాల మధ్య ఒప్పందంతో భారత దేశం ఏర్పడలేదు, 2.సమాఖ్య నుంచి అమెరికాలో వలె రాష్ర్టాలకు విడిపోయే అవకాశం మన దేశంలో రాష్ర్టాలకు లేదు. మన రాజ్యాంగం సమాఖ్య తరహా వ్యవస్థను ఏర్పరిచినప్పటికీ మనది పూర్తిస్థాయి సమాఖ్య కాదు. పూర్తిస్థాయి సమాఖ్య వ్యవ స్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్పష్టమైన అధికార విభజన ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం చేసే శాసనపరమైన అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ అం శాల్లో కేంద్రం జోక్యం చేసుకోదు.

పూర్తిస్థాయి సమాఖ్యలో కేంద్ర, రాష్ర్టాలకు వేర్వేరు ప్రత్యేక రాజ్యంగాలు ఉంటాయి. ఆ దేశ పౌరులకు కేంద్రస్థాయిలో, రాష్ట్రస్థాయిలో వేర్వేరు పౌరసత్వం ఉం టుంది. పూర్తిస్థాయి సమాఖ్యగా ఉన్న దేశాల్లో దృఢమైన రాజ్యాం గం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా చట్టాలు చేయలేదు. దేశం మొత్తం వర్తించే చట్టం చేయాలంటే రాష్ర్టాల ఆమోదం తప్పనిసరి. మన దేశం ఇందుకు భిన్నమైన సమాఖ్యను ఏర్పరుచుకున్న ది. కేంద్ర రాష్ర్టాల మధ్య స్పష్టమైన అధికార విభజన ఉన్నప్పటికీ మన దేశంలో కేంద్ర అధిపత్యమే అంతిమం. మన రాజ్యాంగం కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా పేర మూడు రకాలైన అధికార విభజన చేసింది. కేంద్ర జాబితాలో వంద అంశాలున్నాయి. వీటి మీద కేంద్రమే చట్టాలు చేస్తుంది. రాష్ట్ర జాబితాలోని 61 అం శాల మీద రాష్ట్రమే చట్టాలు చేయాలి. ఉమ్మడి జాబితాలోని 52 అంశాలపై కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసుకోవచ్చు. రాష్ట్ర జాబితా చట్టాల్లో రాష్ర్టాలదే అధికారమైనప్పటికీ అవి కేంద్ర చట్టాలకు లోబడి ఉండాలి. అలాగే ఉమ్మడి జాబితాలో రాష్ర్టాలకు అధికారం ఉన్నప్పటికీ కేంద్ర చట్టమే అంతిమం. కేంద్రం అత్యవసర పరిస్థితి ప్రకటించడం ద్వారా నిరంకుశంగా పాలించే అవకాశం ఉన్నది. కేంద్రం ప్రభుత్వాలు రాష్ర్టాలను బెదిరిస్తూ తమ ఆధిపత్యం చెలాయిస్తున్నది. కేంద్రంలో, రాష్ర్టాల్లో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు అనేక సమస్యలు వస్తు న్నాయి. రాష్ట్రంలో పరిపాలనా రాజ్యంగబద్ధంగా లేదని రాష్ట్రపతి పాలనా తీసుకువచ్చి రాష్ర్టాల హక్కులను కాలరాసిన ఉదంతాలు ఉన్నాయి.

అదేవిధంగా రాష్ర్టాలకు చెల్లించాల్సిన గ్రాంటులు నిలిపి వేసి రాష్ర్టాల అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. ఉదాహరణకు కేం ద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి రావలసిన నిధులను విడుదల చేయలేదు. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకతాభావం పెంచడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొం దాలని ప్రయత్నించింది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ర్టాలకు సంబంధించి న అంశాల్లో జోక్యం చేసుకోవడం పెరిగిపోతున్నది. దీనివల్ల రాష్ర్టాల అభివృద్ధి కుంటుపడుతున్నది. మారుతున్న కాలానికి అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర సంబంధాలు ఉండాలె. బలమైన కేంద్రం గల వ్యవ స్థ నుంచి బలమైన రాష్ర్టాల వ్యవస్థ ఏర్పడాలె. లేకపోతే పెద్ద నోట్ల రద్దు వంటి కేంద్ర ప్రభుత్వ తొందరపాటు నిర్ణయాల వల్ల అన్ని రాష్ర్టాలు, ప్రజలు ఇబ్బంది పడవలసి వస్తుంది. అందువల్ల ప్రాంతీ య ప్రభుత్వాల ఐక్యతతోనే దేశాభివృద్ధి సాధ్యం. డ్బ్భై ఏండ్ల నుంచి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమ రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలను బలహీనం చేస్తూ రాష్ర్టాల అభివృద్ధిని అడ్డుకున్నాయి. ఇలాంటి ఏకపక్ష నియంతృత్వ పోకడ చివరికి రాష్ర్టాల మధ్య ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలకు దారితీసింది. ఈ విధానాలు దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు, ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగాయి.
srinivas-sarla
అది జాతీయ సమగ్రతకు భంగం కలిగిస్తూ, అస్థిర పరిస్థితులు పెరుగడానికి దోహదం చేశాయి. ఇప్పుడున్న వ్యవస్థ దేశానికి ప్రమాదకరం. కేసీఆర్ సూచ నల మేరకు రాష్ర్టాల ప్రయోజనాన్ని కాపాడుకునేలా, రాష్ర్టాల అధికారాలను బలోపేతం చేసుకునేవిధంగా చర్చలు జరుగాలె. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏడు దశాబ్దాలు దాటినప్పటికీ రెండుసార్లు మాత్రమే దక్షిణ భారతానికి ప్రధాని పదవి దక్కింది. ఇది కచ్చితంగా ఆ రెండు జాతీయ పార్టీల నాయకులు చూపించిన రాజకీయ వివక్ష. వారి పాలనలో ఉత్తరాది రాష్ర్టాలు అభివృద్ధి చెందలేదు. దక్షిణాది రాష్ర్టాల ఆదాయాన్ని తమ రాజకీయ స్వార్థం కోసం మింగేస్తూ, ఇటు దక్షిణాది రాష్ర్టాలకు, అటు ఉత్తరాది రాష్ర్టాలకు న్యాయం చేయలేకపోయారు. ప్రతి రాష్ట్రం సంపూర్ణ్ణంగా అభివృద్ధి చెందాలంటే ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రావడం ఒక్కటే మార్గం. అది కేసీఆర్‌తోనే సాధ్యం.

428
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles