నువ్వూ.. నేనూ..
కలిసి భోంచేయడమంటే
కడుపు నింపుకోవడం కానే కాదు
రక్త సంబంధాలకు పాదులు తీయడం!
పాయలు పాయలుగా చీలి
బతుకులీడుస్తున్న వేళ
నలుగురు ఒక చోట కలుసుకుని
సద్దులిప్పుకోవడమే ఒక సంబురం!
భౌతిక వాదం
అందరికీ బాగా ఒంటబట్టిన వేళ
ఎవని ఆకలి వానిదే.., ఎవని సుఖం వానిదే..
నలుగురు కలిసి తినడం ఒక రంగుల కల!
ఒకే చూరు కింద
కలిసి విడి విడిగా బతుకుతున్న వేళ
సామూహిక భోజనం ఓ దారి దీపమే
వాసాలమర్రి ఏడాదికోసారి కలిసి తిందాం రా అంటది!!
-కోట్ల వెంకటేశ్వర రెడ్డి ,94402 33261