తెలంగాణ పల్లెల్లో మణిహారం
కోటి కలల బతుకులు స్వర్ణ మయం
ఆరు దశాబ్దాల పోరు ఆగి ఉదయించిన నవ కిరణం!
నిజాముల నిరంకుశత్వం..
రజాకరుల రాచరికపు దౌర్జన్యం
ఎదిరించి ఉద్యమించి
సాధించుకున్న ప్రజాస్వామ్యం
వేల ప్రాణాల త్యాగఫలం..
రుధిరం చింది వశమైన స్వరాజ్యం!
రామప్ప శిల్ప కళా నైపుణ్యం
రుద్రమదేవి ధీరత్వం
కాకతీయ ‘రత్న గర్భ’ నిలయం
హరప్పా.. మొహంజోదారోను తలదన్నే సంస్కృతి
మట్టి మహత్తుకు నిలువెత్తు సాక్ష్యాలు..!
బంతి పూల బతుకమ్మల తెలుగింటి సంబరాలు
సమ్మక్క సారక్క మేడారం జాతరల అంబరాలు
ఊరూరా హరితహారాల మణిహారం
పల్లెలంతా ప్రగతిబాట
తెలంగాణ పూతోట
భావి బతుకుల్లో ఉషోదయపు వెలుగు బాట..!
స్వప్న మేకల
90522 21870