ఆ.వె: కొత్త ఏడు వచ్చె కొత్త ఆశలు లేవు
‘కొవిడు’ తొలగిపోవ కోరుకొందు
నిరుడు వచ్చిచేరి నిలచియున్నది నంగనాచ్చి.
ఆ.వె: చీని దేశమందు చెలరేగి మొదటగా
అన్ని దేశములను ఆక్రమించె
వత్సరమ్ముదాటె వదలిపోవుట లేదు
విస్తరించి మరల విచ్చుకొనెను.
ఆ.వె: మానవాలి చరితలోన మచ్చగమారె
వింత ‘కరొన’ వలన విశ్వమంత
తల్లడిల్లిపోయె తనువులు రాలెను
కోట్ల జనముపడిరి ‘కొవిడు’ బారి.
ఆ.వె: ‘మాస్కు అభయమొసగు
మరువక ధరియించు
బయట వెళ్లినప్పుడు బాగుగాను
స్వీయ రక్ష మేలు శ్రేయము కలుగును
చిన్న తప్పిదములు చిచ్చుబెట్టు!
ఆ.వె: ప్రజలు నేర్పుగల్గి
పాటించి నియమాలు
పరగవలెను ఇంట బయట కూడ
‘శానిటైజ’రెపుడు చక్కగా వాడుతు
ఒకరికొకరు దూరముండవలయు!
కం: టీకాయే రక్షించును
శోకము లేకుండ జేసి శుభముల గూర్చున్
లోకులు అపోహ తోడన్
నాకెందుకు అనుట తగదు; నమ్మినమేలౌ!
కం: టీకా వేయించుకొనుము
మోకాలొడ్డకు మరిమరి మూఢత్వముతో
వేకువ వచ్చును మనకిక
చీకట్లే తొలగి బ్రతుకు చిన్నిదమగులే!
కం: లోగడ వైరసులెన్నో
వేగంగా వెళ్ళిపోగ వెడలెను బాధల్
ఆగము కావద్దు మనము
రోగభయము వీడదగును
రూడిగ నరుడా!
జక్కని వేంకటరాజం, 94400 21374