ఇదిగిదిగో యాదాద్రి
ఇల వెలిసిన స్వర్గాద్రి
ఇది జనులందరి సంక్షేమపు క్షేమాద్రి
ఇది సామాన్యుని సౌభాగ్యపు పుణ్యాద్రి
కేసీఆర్ కల నిలిపిన పుణ్యక్షేత్రం
భక్తహృదయ భాగస్వామ్య
ధన్యక్షేత్రం
మన తెలంగాణ చెక్కుకున్న
చిక్కని శిల్పం
ఘన లక్ష్మీనారసింహ
కృపానల్పకల్పం
ఇది సకల లోక సౌఖ్యానికి
సత్య శ్రీకారం
పునర్నిర్మాణపు శోభపంచు
దివ్య ప్రాకారం
సమకాలపు శుభచరితగ
ఆలయ నగరం
స్వర్ణగోపురం
ఇది నిత్యనవ్యశ్రీపురం
-దక్షిణామూర్తి ,98662 77107