e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home ఎడిట్‌ పేజీ ముంగిట్లో పరిపాలన

ముంగిట్లో పరిపాలన

ముంగిట్లో పరిపాలన

ఈమధ్యనే ముఖ్యమంత్రి సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల నూతన సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయాలను, పోలీసు భవనాలను ప్రారంభించారు. కలెక్టరేట్లలోనే జిల్లాకు చెందిన అన్ని శాఖల కార్యాలయాలనూ ఏర్పాటు చేసి ప్రజలకు మరింత పాలనా సౌలభ్యం కల్పించారు. ముఖ్యమంత్రి ప్రగతిశీల ఆలోచన విధానానికి ఇదొక నిదర్శనం.ఉమ్మడి రాష్ట్రంలో కలెక్టరేట్లకు సామాన్యుడు వెళ్లే పరిస్థితులు చాలా మేరకు ఉండేవి కావు. అనేక ప్రాంతాల్లో కొత్త జిల్లాలకోసం సిద్దిపేట, మంచిర్యాల్‌లాంటి అనేక ప్రాంతాల్లో ఉద్యమాలు జరిగాయి.

1978లో రంగారెడ్డి జిల్లా ఏర్పడింది. ఆనాటి నుంచే వికారాబాద్‌, తాండూర్‌, పరిగి, చేవెళ్ల ప్రాంత ప్రజలు వికారాబాద్‌ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ఉద్యమాలు ప్రారంభించారు. గుడిసె రుక్మయ్య అనే నాయకుడు ఆమరణ దీక్ష చేస్తే ఈ ప్రాంత ప్రజలంతా మద్దతుగా నిలిచారు. జిల్లా కార్యాలయాలు హైదరాబాద్‌లో ఉండేవి. ఒక్కో కార్యాలయం ఒక్కో చోట ఉండేవి. ఇక్కడి ప్రజలకు జరుగుతున్న పాలనా ఇబ్బందులను ఉద్యమకాలంలో కేసీఆర్‌ గుర్తించారు. 2002లో వికారాబాద్‌ వచ్చిన సందర్భంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటుతోనే ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని కేసీఆర్‌ గారు ప్రకటించారు. దాంతో వికారాబాద్‌ జిల్లా సాధన ఉద్యమం కూడా తెలంగాణ ఉద్యమంతో కలిసి సమాంతరంగా నడిచింది.

- Advertisement -

వికారాబాద్‌ డిస్ట్రిక్ట్‌ డెవలప్‌మెంట్‌ ఫోరమ్‌ ఆధ్వర్యంలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులతో కలిసి అప్పటి ఏపీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి దగ్గరకు వెళ్లాం. వికారాబాద్‌ జిల్లా చారిత్రక నేపథ్యం గురించి, మా అసౌకర్యాలు గురించి చెప్పాం. వికారాబాద్‌ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరాం. కిరణ్‌ కుమార్‌ రెడ్డి జవాబు విన్నాక, కేసీఆర్‌ తెలంగాణ కోసం ఎందుకు కొట్లాడుతున్నరో మాకు బాగా అర్థమైంది. ‘కొత్త జిల్లా ఇవ్వడానికి చాక్లెట్‌, బిస్కెట్‌ అనుకుంటున్నారా?’ అంటూ ఆయన హేళనగా చేసిన వ్యాఖ్యలను మేం ఎన్నటికీ మరిచిపోలేము. తెలంగాణ రాష్ట్రం వస్తేనే సిద్దిపేట, మంచిర్యాల, వికారాబాద్‌ జిల్లాలు ఏర్పడుతాయని ఉద్యమ నేతగా కేసీఆర్‌ 2010 సెప్టెంబర్‌ 9 న మేము పెట్టిన విద్యార్థి సంగ్రామ సదస్సులో చెప్పారు. అందుకే మా ప్రాంత ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడూ ముందు వరసలో నిలబడి పోరాడారు.

వికారాబాద్‌ జిల్లా తెలంగాణకే ఒక ఆరోగ్యశాల. అందుకు అనంతగిరి అడవులే ఒక సాక్ష్యం. ఇక్కడ అద్భుతమైన ప్రకృతి వనరులు ఉన్నాయి. మూసీ, ఈసీ జీవనదుల జన్మస్థలమిది. ఇక్కడి ఔషధ మొక్కలు విశిష్టమైనవి. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉద్యమకాలం నుంచీ ఈ ప్రాంతమంటే ప్రత్యేక అభిమానం. వారి అభిమానమే వికారాబాద్‌ను జిల్లాగా మార్చగలిగిందని మా నమ్మకం. వికారాబాద్‌కు ఒక మెడికల్‌ కాలేజీని కూడా ఇస్తారని మా జిల్లా ప్రజలు నమ్మకంతో ఉన్నారు. నిజానికి మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు వికారాబాద్‌ అనేక రకాలుగా అనువైన ప్రాంతం. అలాగే కాలుష్యరహిత పరిశ్రమలు కూడా మా జిల్లాకు ఇవ్వాలని యువత కోరుకుంటున్నది. పరిశ్రమల రాకతో ఉద్యోగం, ఉపాధి మార్గాలు జిల్లాలో పెరుగుతాయి. రాజధాని హైదరాబాదుకు వికారాబాద్‌ ప్రాంతం ఆనుకొని ఉన్నా పరాయి పాలనలో మాకు అనేక కష్టాలు ఉండేవి. దశాబ్దాలపాటు పోరాడిన మా ప్రాంత ప్రజల ఆకాంక్షను కేసీఆర్‌ నెరవేర్చారు. వికారాబాద్‌ జిల్లాను ఏర్పాటు చేశారు. అందుకు వికారాబాద్‌ ఉద్యమకారులమైన మేమంతా కేసీఆర్‌కు సదా కృతజ్ఞులం. ఇపుడు వికారాబాద్‌ జిల్లాలో సమీకృత కలెక్టరేట్‌ నిర్మాణం అన్ని హంగులతో పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. వికారాబాద్‌కు ముఖ్యమంత్రి ఎపుడొస్తారా అని వెయ్యి కనులతో ఎదురుచూస్తున్నం.

(వ్యాసకర్త: శుభప్రద్‌ పటేల్‌, న్యాయవాది, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర యూత్‌ జనరల్‌ సెక్రటరీ)

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ముంగిట్లో పరిపాలన
ముంగిట్లో పరిపాలన
ముంగిట్లో పరిపాలన

ట్రెండింగ్‌

Advertisement