e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home ఎడిట్‌ పేజీ మధుర క్షణం

మధుర క్షణం

మధుర క్షణం

గుండెలందున లే గులాబీ దండలను పండించుతూ
పెదవులందున నవరసాల రసాలనే ఊరించుతూ
పాతగిల్లిన భూతలమ్మున లేత సొంపులు నింపుతూ
ఈక్షణమ్ముల ముందు వ్రాలిన ఈ క్షణం మధురక్షణం.
విసిగిపోయిన మానవాళికి వింత ఆశలు కూర్చదా?
మ్రోడువారిన చెట్టుచేమల మొలక నవ్వులు తీర్చదా!
కంటకాయిత కాననమ్ముల కఱకు రూపం మార్చదా?
ఈక్షణమ్ముల ముందు వ్రాలిన ఈ క్షణం మధురక్షణం.
పొంగివచ్చే పూల సంద్రం నింగినేలల కలిపెను
ముళ్ళు రాళ్ళూ బోళ్ళూ మ్రోళ్లూ మల్లెలై చిరునవ్వెను
రుసరుసలతో కసరు లోకం మిసమిసలతో నిండెను
ఈక్షణమ్ముల ముందు వ్రాలిన ఈ క్షణం మధురక్షణం.
ఈ క్షణం నా అతిథి; నవవర్షేప్సితం తెచ్చిందట!
కొత్త పంచాంగమును ఎంతో కోర్కెతో వింటుందట!
ద్యారబంధాలందు ప్రేమల తోరణం కడుతుందట!
ఈక్షణమ్ముల ముందు వ్రాలిన ఈ క్షణం మధురక్షణం.
ఈ క్షణం ప్రతి కొమ్మ మామిడికొమ్మయై వికసించనీ
ఈ క్షణం ప్రతి మనిషి మాధవదేవుడై వికసించనీ
ఈ క్షణం తెలుగింట సమరస భావమే నివసించనీ
ఈక్షణమ్ముల ముందు వ్రాలిన ఈ క్షణం మధురక్షణం.
-దాశరథి

Advertisement
మధుర క్షణం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement