e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home ఎడిట్‌ పేజీ బెత్తెడు గుడ్డపేగు!

బెత్తెడు గుడ్డపేగు!

బెత్తెడు గుడ్డపేగు!

తపస్సు చేసేవాడు కదలడు కదా
శవం కదలక పోతేనేం
ఏదో సందేశం చెపుతున్నట్లే ఉంది
చావుకు ఎన్నెన్ని కారణాలో
ఆపాదమస్తకంగా ప్రబోధిస్తున్నట్లే ఉంది!
పుటం పెట్టినట్లు పాఠం చెప్పడానికి
వ్యాకరణ దోషం లేని పాండిత్యమే కావాలా!

బెత్తెడు గుడ్డ పేగు మాస్క్‌ను
పట్టించుకోక జార విడుచుకున్నందుకు
చేతులకు శానిటైజర్‌ రాసుకోక
సెంటుతో షోకు మైదాకుగా బలాదూర్‌ ఐనందుకు
సామాజిక దూరాలు కథలు కథలు అన్నందుకు
వ్యాక్సిన్‌ బతుకు వరం కాదని నిర్లక్ష్యంగా
తిరునాళ్లుగా తిరుగుడు ఐనందుకు
పీనుగుతనం రాక ఏం వస్తుంది!

ఎన్నెన్ని శవాలో
ముందు జాగ్రత్తలుగా అన్నన్ని అధ్యయనాలు
శవం ఐందంటే నిలువెత్తుగా ఎంత అనుభవసారం
బతికున్నవారు నేర్చుకోకపోతే ఇగ ఏం బతుకు ?

కందాళై రాఘవాచార్య, 87905 93638

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బెత్తెడు గుడ్డపేగు!

ట్రెండింగ్‌

Advertisement