e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home ఎడిట్‌ పేజీ నే మద్దతై వస్త

నే మద్దతై వస్త

నే మద్దతై వస్త

అవ్‌.. అది నిజమే

నిన్ననే మనం కశేరికెక్కింది కూడా వాస్తవమే

ఎయ్యేండ్లు కల్శున్నా యేరుదప్పదని

ఎవ్వలి పాలు వాండ్లం పంచుకున్నం

ఇగో గిప్పుడిప్పుడే

ఎవ్వలి ఇండ్లను వాండ్లం 

సగబెట్టుకుంటున్నం

యేరు వడేదాంకనే గదా

ఎవ్వరి కడుపులల్ల ఏమున్నా…

దూరమైనంక ఆపచ్చనే దప్ప ఇంకేముంటది 

పాల్లు వంచుకున్నంత మాత్రాన

అన్నెం అయిపోం గదా!

మన నడుమ పొరపొచ్చాలుండొచ్చు

నువ్వు నేను కుసోని ఒప్పించుకుందాం

మనం మనం లక్షనుకుంటం

యాలకు కూడాల్సొస్తే కూడుంటం

అది వేరే సంగతి

ఎంత దూరంవొయినా

ఎంత కాలం జరిగినా

అన్నా అని పిల్శిన నోరు

మాట దప్తదా

తమ్మీ అని వల్కిన నాలిక

తీరు మార్తదా

నీ ఆపతి సంపతికి నేనొస్త

నా సమస్య సంబురాలకు నువ్వొస్తవ్‌

అది వాజీవే

అట్లాంటిది…

ఇయ్యాల నీ ఇంట్లె  నిప్పువుడితే

నే సూసుకుంట ఊకుంటనా

రేపటినాడు

నా కంట్లె నలుసు వడితే

నువు తీయకుండ ఊకుంటవా

ఈ పొద్దు విశాఖ ఉక్కే గావొచ్చు

మాపటికి మా సింగరేణి 

                   బంగారమే గావొచ్చు

దోసుకవోనికే వాడెవడు

న్యాల మనది, శెమ్ట మనది

హక్కు మనది, బత్కు మనది

చల్‌ ఏదైతే అదైతది

నీ పొంటి నే నిలవడుత

నీ పోరుకు నే ఎన్నుదన్నైత

నువ్వు నిమ్మలంగుండు నే మద్దతై వస్తా

శెయ్యి శెయ్యి కల్పుదాం

హిమ్మతితో కలవడుదాం

ఢిల్లీ మెడలు వంచి తలలెత్తుకుందాం.

– డాక్టర్‌ బి.బాలకృష్ణ  , 99489 97983

(విశాఖ ఉక్కు పోరుకు మంత్రి కేటీఆర్‌  మద్దతు ప్రకటించిన సందర్భంగా.. )

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నే మద్దతై వస్త

ట్రెండింగ్‌

Advertisement