e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News చందమామలో కలిసిన ‘సిరివెన్నెల’

చందమామలో కలిసిన ‘సిరివెన్నెల’

తెలుగు సినీగీతాల వినీలాకాశంలో
అలుపులేక కాచిన ‘సిరివెన్నెల’
నేడు చందమామలో కలిసిపోయింది!
గగన ‘గంగావతరణం’తోడుగా
శివుని సిగలో విలసిల్లిన జాబిల్లి
తన వెన్నెలను తానే మింగేసింది
జాగృతవీణలు మూగవోయాయి
దినకరమయూఖాలకు గ్రహణం పట్టింది
జగమంతా తన కుటుంబమే అంటూ
తరలిపోయింది ఆత్మ
పరమశివుని పాదపద్మంలోనికి!
మనోవీధిలో ‘సిరివెన్నెల’ ఎన్నటికీ
మరపురాదు, మాసిపోదు..!

డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ
94404 68557

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement