e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 23, 2021
Home ఎడిట్‌ పేజీ గ్రామీణ వికాసానికి ఆదర్శం తెలంగాణ

గ్రామీణ వికాసానికి ఆదర్శం తెలంగాణ

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే దేశ ప్రగతికి ప్రథమ సోపానం. గాంధీ మొదలు ఎంతోమంది గొప్ప నాయకులు, మేధావులు గ్రామీణాభివృద్ధి ప్రాధాన్యాన్ని పదే పదే ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నది. సీఎం కేసీఆర్‌ సుదీర్ఘ మేధోమథనం తర్వాత 2018లో నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని రూపొందించి అమలు చేస్తున్నారని పంచాయతీరాజ్‌, గ్రామీణా భివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉద్ఘాటిం చారు. ఈ నెల 8న ఆయన శాసన మండ లిలో చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు.

గ్రామ పంచాయతీల ఏర్పాటు: ‘మా తండాలో మా రాజ్యం, మా గూడెంలో మా రాజ్యం’ అనే నినాదంతో గిరిజనులు, ఆదివాసీలు తమ ఆవాసాలను పంచాయతీలుగా మార్చాలని గత ప్రభుత్వాలకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు. కానీ ఆ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తండాలను, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చింది. దీంతో 3,146 మంది షెడ్యూల్డ్‌ తెగలకు చెందిన వ్యక్తులు సర్పంచులుగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో గతంలో 8,690 గ్రామ పంచాయతీలుండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 12,769కి పెరిగింది.

- Advertisement -

నియామకాలు: గ్రామ పంచాయతీల పరిపాలన సమర్థవంతంగా జరిగేందుకు ప్రతీ గ్రామపంచాయతీకి ఒక కార్యదర్శి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయింది. 9,355 పోస్టులను మంజూరు చేసి గ్రామ కార్యదర్శులను నియమించింది. దీంతో 3,414 ఉన్న కార్యదర్శుల సంఖ్య 12,769కి పెరిగింది.

వైకుంఠధామాలు: అంత్యక్రియలు జరపడానికి కావాల్సిన వసతుల్లేక గతంలో గ్రామీణ ప్రజలు ముఖ్యంగా పేదలు అనేక ఇబ్బందులు పడేవారు. ఈ పరిస్థితిని మార్చటం కోసం ప్రభుత్వం రూ.1, 547 కోట్లతో ఊరూరా వైకుంఠధామాల నిర్మాణం చేపట్టింది. 12,660 వైకుంఠధామాలు పూర్తయ్యా యి. 109 గ్రామాల్లో నిర్మాణ దశలో ఉన్నాయి.

గ్రామీణ పారిశుద్ధ్యం: ఉమ్మడి ఏపీలో తెలంగాణ పల్లెలు అపరిశుభ్రంగా ఉండేవి. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో చేపట్టిన ‘పల్లె ప్రగతి’తో గ్రామాలు సమగ్రాభివృద్ధి దిశగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని 16 మినహా అన్ని గ్రామాల్లో డంప్‌ యార్డుల నిర్మాణం పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం చెత్తను డంప్‌యార్డులకు తరలించేందుకు ట్రాలీలతో కూడిన ట్రాక్టర్లను ప్రతీ గ్రామపంచాయతీకి సమకూర్చింది. మొకలకు నీరు పోసేందుకు నీటి ట్యాంకర్‌ను కూడా ఇచ్చింది. ఉమ్మడి ఏపీలో తెలంగాణలో 87 గ్రామపంచాయతీలకే సొంత ట్రాక్టర్లు ఉంటే, ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 12, 769 ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లున్నాయి. పారిశుద్ధ్యంలో వచ్చిన గణనీయ మార్పులతో డెంగ్యూ వంటి విషజ్వరాల వ్యాప్తి తగ్గుముఖం పట్టాయి.

మంచినీటి సరఫరా: గత ప్రభుత్వాల హయాం లో ప్రజలు మంచినీటి కోసం అనేక కష్టాలు పడేవారు. బోర్ల మీద ఆధారపడాల్సి వచ్చేది. బోర్లు, మోటార్లు సరిగా లేక నీటి సరఫరా అరకొరగా జరిగేది. గ్రామ పంచాయతీలు నీటి సరఫరా కరెంటు బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం రూ.40 వేల కోట్లతో చేపట్టిన ‘మిషన్‌ భగీరథ’తో ఈ పరిస్థితి సమూలంగా మారిపోయింది. ప్రభుత్వం ఇంటింటికి ప్రతి రోజు పరిశుభ్ర మంచినీటిని సరఫరా చేస్తున్నది. తెలంగాణ ఫ్లోరైడ్‌ రహిత రాష్ట్రమని పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రం ప్రకటించడం మనకు గర్వకారణం. ఈ పథకాన్ని అధ్యయనం చేసేందుకు కేంద్ర జలశక్తి శాఖాధికారులు, 15 రాష్ర్టాల ప్రతినిధులు అనేకసార్లు రాష్ట్రాన్ని సందర్శించారు. ‘మిషన్‌ భగీరథ’ స్ఫూర్తితో కేంద్రం ‘హర్‌ ఘర్‌ జల్‌’ పేరుతో ఇంటింటికీ నీరందించే పథకాన్ని ప్రవేశపెట్టింది.

వీధి దీపాల నిర్వహణ: 4 విడుతలుగా జరిగిన పల్లె ప్రగతి సందర్భంగా ప్రభుత్వం వీధి దీపాల సమస్యను పూర్తిగా పరిషరించింది. రూ.330 కోట్లతో 2,33,135 కొత్త కరెంటు స్తంభాలను అమర్చింది. గ్రామాల్లో వదులుగా ఉన్న కరెంటు తీగలను మార్చి, పటిష్ఠపరిచింది. గతంలో నిర్లక్ష్యానికి గురైన దళిత, గిరిజన ప్రాంతాల్లో 50,230 కి.మీ. మేర మూడో వైర్‌ను ఏర్పాటు చేసింది.

హరితహారం: రాష్ర్టాన్ని హరిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ యజ్ఞంలో పంచాయతీరాజ్‌శాఖ కీలక పాత్రను పోషిస్తున్నది. గత ప్రభుత్వాల హయాంలో ఏ ఒక గ్రామంలోనూ చెట్లను పెంచిన దాఖలా లేదు. పైగా విచక్షణారహితంగా అడవుల నరికివేత జరిగేది. ఇప్పుడు పరిస్థితి మారింది. అన్ని గ్రామపంచాయతీల్లో ప్రభుత్వం నర్సరీలను ఏర్పా టుచేసి గ్రామ పరిసరాలను హరితవనాలుగా తీర్చిదిద్దింది. గతంలో పారులు పట్టణాలకే పరిమితమయ్యేవి. ఇప్పుడు అన్ని గ్రామ పంచాయతీలతో పాటు చిన్న ఆవాసాల్లోనూ కలిపి 13,657 ఎకరాల విస్తీర్ణంలో.. 19,472 ప్రకృతి వనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటిలో వాకింగ్‌ట్రాక్‌లను, పిల్లలకు క్రీడా సౌకర్యాలను, కొన్ని ప్రకృతివనాల్లో ఓపెన్‌ జిమ్‌లను ఏర్పాటుచేసింది. మండలానికి 5 చొప్పున బృహత్‌ ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే 120 బృహత్‌ వనాలు పూర్తయ్యాయి.

గ్రీన్‌ బడ్జెట్‌: గ్రామ పంచాయతీలు తమ బడ్జెట్లలో 10 శాతం నిధులు విధిగా గ్రీన్‌ బడ్జెట్‌ కోసం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినట్లుగా రాష్ట్రమంతటా అమలవుతున్నది. తెలంగాణలో 4 శాతం ‘గ్రీన్‌ కవరేజ్‌’ పెరిగిందని కేంద్ర అటవీశాఖ ప్రకటించడం హరితహారం పథకం విజయానికి నిదర్శనం. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద పర్యావరణ పరిరక్షణ ప్రయత్నంగా మన హరితహారం గుర్తింపు పొందింది.

నిధుల కూర్పు-వ్యయం: జనాభాతో సంబంధం లేకుండా వంద, రెండు వందల మంది జనాభా ఉన్న చిన్న గ్రామపంచాయతీలు కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రూ.5 లక్షలకు తగ్గకుండా నిధులు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు ప్రతి గ్రామపంచాయతీకి నిధులు అం దుతున్నాయి. ప్రభుత్వ హయాం లో రూ.8,536 కోట్లతో 18,606 కి.మీ.ల రోడ్లు, రూ.2,265 కోట్లతో 7,553 కి.మీ.ల అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయింది.
(మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శాసనమండలిలో చేసిన
ప్రసంగ సారాంశం)

వేతనాల పెంపు: అరకొర జీతాలున్న పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. గ్రామకార్యదర్శుల వేతనాలను,స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ఇచ్చే గౌరవ వేతనాలను కూడా గణనీయంగా పెంచింది. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌,కర్ణాటక, యూపీ వంటి రాష్ర్టాల్లో వీరి వేతనాలు తక్కువగా ఉన్నాయి.

ఎర్రబెల్లి దయాకర్‌రావు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement