e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home ఎడిట్‌ పేజీ ఉడుతా భక్తి!

ఉడుతా భక్తి!

‘చిత్రకళారాజితంబు, శిల్పకళా శోభితంబు, దివ్యౌషధి దీపితంబు, భవ్య గోపురావృతంబు’ అంటూ యాదాద్రి శోభను ముడుంబై వరదాచార్యులు సరళంగా వర్ణించారు. పవిత్ర తెలంగాణ భూమిపై కొలువై ఉన్న లక్ష్మీ నరసింహుడి ఆలయాన్ని పునర్నిర్మించాలనేది భక్తాగ్రేసరుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్ష. సాధారణంగా ఇంతటి బృహత్తర ఆలయ నిర్మాణమంటే కొన్ని తరాలు పడుతుంది. తెలంగాణ ఏర్పాటైన 2014లోనే అక్టోబర్‌ 17న యాదాద్రి ఆలయాన్ని పునర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. మరుసటి ఏడాది విజయదశమి రోజున అంకురార్పణ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత ఆరేండ్లలోనే ఒక మహాద్భుతమే యావత్‌ ప్రపంచం ముందు ఆవిష్కృతమైంది. కేసీఆర్‌ సంకల్ప బలం, కార్యదక్షత మూలంగా, నిర్మాణ కార్యక్రమం నిర్విఘ్నంగా, అతివేగంగా కార్యరూపం దాల్చింది. వచ్చే మార్చిలో లక్ష్మీ నరసింహుడు ప్రధాన ఆలయంలోనే దర్శనమివ్వనున్నాడు. మార్చి 21 నుంచి మహా సుదర్శనయాగం, 28న మహా కుంభ సంప్రోక్షణకు ముహూర్త నిర్ణయం జరిగింది.

కాకతీయుల నాటి శిల్పకళనేగాక దక్షిణాది, ఉత్తరాది ఆలయాల్లోని శిల్పరీతుల్ని కూడా వినియోగించటంతో యాదాద్రి నేడు నిజమైన అర్థంలో భారతావని గర్వించే ఆధ్మాత్మిక, కళా క్షేత్రంగా రూపుదాల్చింది. కాగా తెలంగాణ సమాజానికి ఈ దేవదేవుడి నిలయం ఒక అస్తిత్వ ప్రతీక. ఒకప్పుడు గోదావరి అంటే మన దగ్గరే ఉంటుందని గుర్తు చేసి, నాటి పాలకుల నిరాసక్తత మధ్య, ధర్మపురిలో సొంతంగా పుష్కరాలు నిర్వహించిన ఘనత కేసీఆర్‌ది. తెలంగాణ భౌగోళికతకు ప్రత్యేకమైన చెరువులను పునరుద్ధరించుకోవడమైనా, గోల్కొండ కోటలో పతాకావిష్కరణైనా, గోదావరీ జలాలను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పొలాలకు తరలించడమైనా స్వయంపాలన ద్వారా సాధ్యమైన ఫలితంగా, విస్తృత అస్తిత్వప్రకటనగా భావించాలి.

- Advertisement -

ఉడుత ఇసుక వేయడం వల్లనే రామ సేతు నిర్మాణం పూర్తయిందని కాదు. అది ఉడుత భక్తిని, చిత్తశుద్ధిని సూచిస్తుంది. వారధి నిర్మాణంలో ఉడుతకు భాగస్వామ్యం లభించి, జనసామాన్యంలో వాడుకగా మారి చిరస్థాయిగా నిలిచిపోయింది. యాదాద్రి నిర్మాణం మన కళ్ల ముందే జరగడం ఈ తరం చేసుకున్న మహద్భాగ్యం అనే అభిప్రాయం తెలంగాణ బిడ్డలలో ద్యోతకమవుతున్నది. ఇందులో ఉడుతాభక్తిగా తమకూ కొంత భాగస్వామ్యం లభించాలనే భావన బలంగా ఉన్నది. ఈ నేపథ్యంలో ఆలయ శిఖరానికి బంగారు తాప డం కోసం ఎవరికి తోచినంత, చేతనైనంత వారు ధన రూపంలో కూడా సమర్పించుకోవచ్చునని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడం విశేషం. యాదాద్రి క్షేత్ర నిర్మాణంలో భాగస్వాములయ్యే ఈ అపూర్వ అవకాశాన్ని భక్తులు ఉపయోగించుకోవచ్చు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement