e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home ఎడిట్‌ పేజీ అభివృద్ధికి వ్యవసాయమే పునాది

అభివృద్ధికి వ్యవసాయమే పునాది


తెలంగాణలో అభివృద్ధికి వ్యవసాయం వెన్నెముక. కానీ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వ్యవసాయం తీవ్ర వివక్షకు గురైంది. వ్యవసాయం దండగ అన్న పాలకుల ఏలుబడిలో తెలంగాణ కరువు కాటకాలకు నెలవైంది. ఇలాంటి వివక్ష, అణచివేతల నుంచి విముక్తి కోసం రాష్ట్ర సాధన ఉద్యమం
ప్రారంభమైంది. కేసీఆర్‌ అసమాన నాయకత్వ పటిమ, త్యాగాల ఫలితంగా రాష్ట్రం ఏర్పడింది.

అభివృద్ధికి వ్యవసాయమే పునాది

ఆదాయ అసమానతలు, కొనుగోలుశక్తి లేకపోవడం, పేదరికం, వలసలు, నిరుద్యోగం లాంటి సమస్యలన్నీ తెలంగాణను చుట్టుముట్టాయి. ఈ క్రమంలో గోదావరి జలాలను కాళేశ్వరం ద్వారా పారించి తెలంగాణను జలసిరులతో నింపారు. దీంతో రికార్డుస్థాయిలో ఉత్పత్తి పెరిగింది. దేశానికే తెలంగాణ ధాన్యాగారంగా మారింది.

ఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం 2015, మార్చి 12న నిజామాబాద్‌ జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సదాశివనగర్‌లో మిషన్‌ కాకతీయ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. మన ఊరు, మన చెరువు కార్యక్రమాన్ని చేపట్టి 46,531 చెరువులను పునరుద్ధరించి 10 లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చారు. ఈ క్రమంలోనే 2018, మే 10న కరీంనగర్‌ జిల్లాలో హుజూరాబాద్‌లోని టేల్‌పూర్‌ వద్ద రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. ఆత్మహత్యలకు నెలవైన తెలంగాణలో రైతుబీమా పథకంతో మరణించిన రైతులకు రూ.5 లక్షల రైతు బీమా పథకాన్ని అమలుచేస్తున్నారు. సురక్షితమైన శుద్ధి చేసిన మంచినీరు కోసం మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని 2015, జూన్‌ 8న చౌటుప్పల్‌ గ్రామంలో ప్రారంభించి 2.72 కోట్ల మందికి తాగునీరు అందిస్తున్నారు. కృష్ణా, గోదావరి నదులలో ఏటా 10, 882 వేల ఘనపు లీటర్ల నీరు ప్రవహిస్తుండగా, అందులో 33 శాతం నీటిని మాత్రమే వినియోగిస్తున్నాం. నదుల నీళ్లు సముద్రం పాలైతే ఏం ప్రయోజనం అని భావించి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అంకురార్పణ చేశారు. అలాగే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి 2.77 లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్నారు. మరొక వైపు సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు మళ్లిస్తున్నారు. ఈ విధంగా ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఐదేండ్లలోనే దేశీయ తలసరి ఆదాయం రూ.1,32,000లు ఉండగా తెలంగాణ తలసరి ఆదాయాన్ని రూ.2,32,000 లకు పెంచడం జరిగింది.

1929లో ఉత్పత్తిలోని పెరుగుదల మేరకు ప్రజల కొనుగోలు శక్తి పెరగకపోవడం వలన యూరప్‌ ఖండంలో ఆర్థికమాంద్య పరిస్థితు లు ఏర్పడ్డాయి. ఈ సమయంలో జేయం కీన్స్‌ సిద్ధాంతాన్ని అనుసరించి గుంటలు తవ్వి గుంటలు పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు ఆదాయాన్ని కల్పించి కొనుగోలు శక్తిని పెంచడం వల్ల పరిశ్రమలు నడిచి తిరిగి ఆదాయ, ఉద్యోగితలు పెరిగాయి. అలాగే మన రాష్ట్రంలో కూడా ఆదా య, ఉద్యోగితలు పెరగాలం టే కొనుగోలుశక్తి పెరిగి పారిశ్రామిక, సేవారంగాలు సక్రమంగా నడవాలి. ప్రజల కొనుగోలు పెరగాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నూటికి 57 మంది ఇంకా వ్యవసాయరంగంలో ఉన్నారు. వారి ఆదాయాల వాటా 14 శాతం మాత్రమే. అదే బ్యాంకింగ్‌, బీమా, రవాణా, పరిపాలన తదితర సేవా రంగాలలో 25 శాతం ఉంటే, వారి ఆదాయాలు 65 శాతం ఉన్నాయి. ఆదాయ అసమానతలు, కొనుగోలుశక్తి లేకపోవడం, పేదరికం, వలసలు, నిరుద్యోగం లాంటి సమస్యలన్నీ తెలంగాణను చుట్టుముట్టాయి. ఈ క్రమంలో గోదావరి జలాలను కాళేశ్వరం ద్వారా పారించి తెలంగాణను జలసిరులతో నింపారు. దీంతో రికార్డుస్థాయిలో ఉత్పత్తి పెరిగింది. దేశానికే తెలంగాణ ధాన్యాగారంగా మారింది.

దీంతో తెలంగాణ వినియోగ వ్యయం అదనంగా 41 శాతం పెరిగింది. పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉండటంతో అమెజాన్‌, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రైవేట్‌రంగంలో 15 లక్షల ఉద్యోగాలు పెరిగాయి. నియామకాల నినాదంగా ఉన్న తెలంగాణలో లక్షా ముప్ఫై రెండు వేల ఉద్యోగాలు ప్రభుత్వమే కల్పించింది. అంటే తెలంగాణ కీన్స్‌ కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి వ్యూహం వల్ల సమష్టి ఖర్చు పెరిగింది. ఈ విధమైన ఉత్పత్తి విధానంతో ఆదాయ, ఉద్యోగితలు మరింత పెరిగి బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది.

(వ్యాసకర్త: అర్థశాస్త్ర అధ్యాపకులు)
పొందూరు ప్రభాకర్‌రావు

Advertisement
అభివృద్ధికి వ్యవసాయమే పునాది
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement