రగిలే కష్టాలను తనలో దాచుకొని
గుండె నిబ్బరంగా కనబడే
నాన్న.. ఒక అగ్నిపర్వతం!
అల్లకల్లోలాన్ని తనలో దాచుకొని
అలల సవ్వడులను వినిపించే
నాన్న.. ఒక సముద్రం!
కన్నీళ్ళ కడగండ్లు దాటుకొని
చన్నీళ్లను చెంతచేర్చే
నాన్న.. ఒక జలపాతం!
మబ్బులను తనలో నిలుపుకొని
జలతారు చినుకులను కురిపించే
నాన్న.. ఒక ఆకాశం!
అందరి భారాన్ని మోస్తూ
అలవోకగా అందరిచుట్టూ తిరిగే
నాన్న.. ఒక భూగోళం!
తాను నిలువెల్లా కాలిపోతూ
తనవారికి వెలుగు నింపే
నాన్న.. ఒక సూర్యగోళం!
సమస్యల సుడిగుండంలో మునిగి
సంతోషాల ఒడ్డుకు చేర్చే
నాన్న.. ఒక నావ!
పుట్టి గిరిధర్, 9491493170