గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Jan 22, 2020 , 00:14:28

ఓటుతో దీటైన సమాధానం

ఓటుతో దీటైన సమాధానం

పుర పోరుకు తెర లేచే

నగరపాలికకు నగారా మోగే

కాసుల గుర్రాలే రేసులో నిలిచి

నికార్సయిన మద్యం పారించి

కులాల కుంపట్లు రగిలించి

మతాల మర్యాదల్ని మంటగలిపి

ఓట్ల చలి కాచుకునే పాట్లు!

కాసుల రాసులు కుమ్మరించి

ఓట్ల గుట్టల్ని పోగేసుకొని

నోటుతో ఓటు నడ్డివిరిచి

ఐదేండ్ల అక్రమాల ద్వారాలు తెరిచి

నగరాన్ని నరకకూపంలా మార్చి

పౌరుల పౌరుషాన్ని అణిచి

రాజ్యమేలే చెత్త చేతులు

చేజిక్కించుకుంటాయి సీట్లు!

చేతులు కాలక ముందే ఓటు పట్టుకొని

స్వస్తిక్‌ ముద్రను సంకనెట్టుకొని

నిజాయితీనే కరవాలం చేసుకొని

కాసుల కేటుగాళ్లను కాటువేసి

పుర నగర పాలికల పల్లకీలో

నిస్వార్థ సేవాహస్తాల్ని ఊరేగించి

నగరమంతా పచ్చతోరణాలు కట్టి

పురమంతా పున్నమి చంద్రుని నీడన

తళతళ ముత్యంలా మెరిసి మురిసి

పంచవర్ష ప్రగతిరథం పరుగులిడి

పట్టణాల్ని పట్టభిషేకం చేయాలె!

- డాక్టర్‌ బుర్ర మధుసూదన్‌ రెడ్డి

99497 00037


logo