అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు రోజు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ యోగా గొప్పదనాన్ని చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. అసలు యోగా వల్లే తన తల్లికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సిన అవసరం రాలేదని ఆమె చెప్పింది. ఆమె యోగా చేస్తున్న ఫొటోను ఈ సందర్భంగా షేర్ చేసింది. ఇదొక్కటే కాదు ఆమెకు ఉన్న వివిధ ఆరోగ్య సమస్యలు కూడా దూరమయ్యాయని ఆమె చెప్పడం విశేషం. నిజానికి ఓ డాక్టర్ మా అమ్మకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నారు. కానీ నేను మాత్రం యోగా ద్వారా రెండు నెలల్లో ఆ అవసరం లేకుండా చేశానని కంగనా తన పోస్ట్‌లో వెల్లడించింది.
రేపు ఇంటర్నేషనల్ యోగా డే. అందుకే నా యోగా స్టోరీలను చెబుతున్నాను. నేను యోగా ఎప్పుడు, ఎలా ప్రారంభించానో అందరికీ తెలుసు కానీ.. మా తల్లిదండ్రులు దీని వల్ల చాలా లబ్ధి పొందారు. కొంత కాలం కిందట మా అమ్మ డయాబెటిస్, థైరాయిడ్, అత్యధిక స్థాయి కొలెస్ట్రాల్ బారిన పడింది. డాక్టర్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నారు. కానీ నాకు 2 నెలల సమయం ఇవ్వాలని మా అమ్మను అడిగాను. ఆమె నన్ను నమ్మింది. అప్పటి నుంచీ ఆమె ఎలాంటి మందులు వాడలేదు. ఎలాంటి అనారోగ్యం లేదు. ఇంట్లో ఆమెనే చాలా ఫిట్‌గా ఉండే మనిషి అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో కంగనా చెప్పింది.