గురువారం 25 ఫిబ్రవరి 2021
Editorial - Jan 22, 2021 , 00:09:37

కళ్లతో విను!

కళ్లతో విను!

పూలను చదవగలగటం

అక్షరాలను ఆఘ్రాణించగలగటం

ఒక కళ!

ఒక నైపుణ్యం!

కన్ను పని చెవి

చెవి పని కన్ను చేసినప్పుడే

శిల్పం ఉట్టిపడుతుంది

ఏ పుస్తకం వెనుక

ఏ భావార్థమున్నదో

చెవితో చదవటం తెలుసుకో

ఏ పుస్తకం వెనుక

ఏ తాత్పర్యం బోధపడుతుందో

కన్నుతో వినటం తెలుసుకో

పుస్తక ఉద్యానవనాలు

ఆవిష్కారమౌతాయి!

మామూలు పదాలు 

కవిత్వమవటమంటే

ఒక అవయవం పనిని

ఇంకో అవయవం చేయటమే!

పూలు పుస్తకాలవాలంటే 

పుస్తకాలు పూలవాలంటే 

పూలను చదవటం రావాలి!

పుస్తకాలను ఆఘ్రాణించటం రావాలి!!

అప్పుడే కవిత్వం

బతుకుతుంది!!!

- కందుకూరి శ్రీరాములు

9440119245

VIDEOS

logo