గురువారం 04 మార్చి 2021
Editorial - Jan 14, 2021 , 01:15:04

సంకురాతిరి లచ్చిమి

సంకురాతిరి లచ్చిమి

పన్నీటి నీటితో పలుమారు వలపార

తానమాడించితే తరుణి గరిమ

మృగమద కర్దమ్ము శ్రీ రంగధాముని

ఎదపైన సౌరు ప య్యెద విదల్చ

కౌస్తుభ మణికాంతి నిస్తుల తేజమ్ము

రాగరంజిత పద్మ పరాగమలద

వకుళ మాలికతోడ వైజయంతి క మాల

లిట్టట్టులాడ చన్‌కట్టు మెరవ

చెక్కు టద్దాలపై ముద్దు చెక్కినట్లు

ముగుద నిద్దంపు మోవిపై జిగి రగిల్చి

సోయగమ్ములు నల్వైపు చూరగొనగ

ఇంతికప్పడె మకరసంక్రాంతి యయ్యె!

 పుష్య మాసము శూన్యమ మోఘమైన

ఉత్తరాయణ కాలము దాత్త మవగ

మకర సంక్రాంతి వైకుంఠ మంది రమున 

ద్వార ములుతెరి చిరి సుకృతాత్ము లకును!

గంగి రెద్దుల గంటలు ఘణ ఘణలకు

భోగి మంటల చిటపటల్‌ బుగులుకావ

మేళ తాళాల సన్నాయి మేళనమున

బుడ బుడక్కల డమరులు మ్రోగుచుండె!!

గొల్లపల్లి రఘురామశర్మ 

9989149454

VIDEOS

logo