సోమవారం 08 మార్చి 2021
Editorial - Dec 04, 2020 , 03:44:21

నిర్మాణం ప్రయత్నపూర్వకమే

నిర్మాణం ప్రయత్నపూర్వకమే

అనుబంధం-XVI (1994 డిసెంబర్‌ 24నాటి సుప్రీంకోర్టు తీర్పు..)

ర్మించిన ప్రాంతాన్ని చూసేట్లయితే, ఉత్తర-దక్షిణాలుగా ఐదు చీలికలు, తూర్పు నుంచి పడమరకు కన్పిస్తాయి. మొదటి నాలుగు చీలికలు ఒకదానికంటే మరొకటి వైశాల్యంలోనూ, కొలతల్లోనూ పెరుగుతూ పోతాయి. ఐదవ చీలిక మాత్రం వైశాల్యంలోనూ, కొలతల్లోనూ తగ్గిపోయింది. ఆ కట్టడంలో మూడు పొరలుగా కాంక్రీట్‌ వేయటం జరిగింది. మొదటి పొర 0.62 మీటర్ల మందంతో మొత్తం 1060 చ.మీటర్లలో వేయబడింది. నాలుగవ చీలిక మధ్యలో 7.1 వ్యాసం గల ఖాళీ మినహా ఉత్తరపు వైపు కాంక్రీట్‌ ఈ పొర పైభాగం భూమి మట్టానికి 10 సెం.మీ. కిందికి ఉంటుంది. రెండవ పొర 0.6 మీటర్ల మందంతో గుండ్రని ఖాళీ మినహా  560 చ.మీటర్లు. అది మొదటి పొర మీద 2-5 చీలికల వరకు వేయబడింది. సెట్‌బాక్‌లు ఏర్పాటు చేయబడినాయి. ఈ రెండు పొరలు తూర్పు-పడమరలకు సారూప్యతనే కనబరుస్తున్నాయి-కొలతల్లో కొద్ది తేడాలను మినహాయించి మూడవ పొర కూడా 0.6 మీటర్ల ఎత్తేగాని దాని వైశాల్యం 130 చ.మీటర్లే. కాంక్రీట్‌ ఎక్కువ మొత్తంలో నైరుతి మూలన వేయబడింది. రెండు మూడు పొరల్లో వేసిన కాంక్రీట్‌ను చక్కగా సర్దలేదు. కాంక్రీట్‌ పని అసంపూర్ణంగానే నిలిచిపోయింది.

‘ఎవరైనా కావాలనుకుంటే ఒక సాంప్రదాయిక దేవాలయపు మార్పు చేసిన నమూనాలతో ఈ ఆకృతిని పోల్చవచ్చు.’ ‘పేరా గ్రాఫులు 2 (ఎ)- 04.1 నుం చి 1(ఎ) 04.4 వరకు ఇదివరకే చెప్పినట్లు ఆ పని పరిమాణాన్ని బట్టి చూస్తే ఆ పనిని వాటర్‌ ట్యాంకర్లు, సిమెంట్‌ కాంక్రీట్‌ మిక్సర్లు, కాంక్రీట్లు, వై బ్రేటర్లు మట్టిని తవ్విపోసే యంత్రాలు లేకుండా చేయటం సాధ్యపడదు.’ కనుక చాలా పెద్ద పరిమాణంలో టన్నుల కొద్దీ సిమెంటు  వాడుతూ కాంక్రీటు వేసేందుకు నిర్మాణ యంత్రాలను ఆ స్థలంలో వాడారనే దానికి సందేహం లేదు. 

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)

VIDEOS

logo