ఆదివారం 24 జనవరి 2021
Editorial - Dec 03, 2020 , 02:01:07

మంది బలం వినాశనమే

మంది బలం వినాశనమే

అనుబంధం-XVI (1994 డిసెంబర్‌ 24నాటి సుప్రీంకోర్టు తీర్పు..)

గ్లాండ్‌లో న్యాయం ముందు అందరూ సమానులే అనే ఆలోచన లేక అన్నివర్గాల ప్రజలు సాధారణ కోర్టులు సైతం నిర్వహించే సార్వజనీన చట్టానికి కట్టుబడి ఉండటమనేది పరాకాష్ఠ స్థితికి చేరుకుంది. మన దేశంలో ప్రతి అధికారి, దేశ ప్రధాని మొదలు కానిస్టేబుల్‌, బిల్లు కలెక్టర్‌ వరకు విధి నిర్వహణలో ప్రతి పౌరునికి వర్తించే న్యాయసూత్రాలే వాళ్లకూ వర్తిస్తాయి. అధికారులు తమ విధి నిర్వహణలో చేసిన తప్పిదాలకు వ్యక్తిగతంగా శిక్షింపబడి, జరిమానాలు చెల్లించిన కేసులెన్నో ఉన్నాయి. అయితే అదంతా చట్టబద్ధమైన అధికారానికి మించి అతిగా ప్రవర్తించిన సందర్భాల్లోనే. ఒక వలస దేశ గవర్నర్‌, ఒక స్టేట్‌ సెక్రటరీ, ఒక మిలిటరీ అధికారి వాళ్ల కింది అధికారులు వాళ్ల పై అధికారుల ఆదేశాలను పాటించవలసి వచ్చినా చట్టం ఏ ఇతర ప్రైవేటు వ్యక్తిగాని, అధికారేతర వ్యక్తిగానీ చట్టం అనుమతించని కార్యానికి ఎలా బాధ్యత వహించవలసి ఉంటుందో వాళ్లూ అలాగే బాధ్యత వహించాలి.’

జాతి నిర్మాణపు తొలి దశలో మనం మరీ ముఖ్యంగా గుర్తించాల్సిందేమంటే ఒక బహుళత్వ సమాజంలో చట్టమే అత్యున్నతమూ, ఏకైకమూ అయిన సమైక్యతా అంశం. చట్టాన్ని, దాని సంస్థలను గౌరవించటం ద్వారానే భిన్నత్వం గల జాతికి భరోసా లభించగలదు. చట్టాల ద్వారానో, న్యాయస్థానాల ద్వారానో కాకుండా కేవలం మంది బలం మీద పరిష్కారాలను అన్వేషిస్తే- అవి ఎంత సైద్ధాంతికంగా, ఉద్వేగభరితంగా దట్టింపబడినప్పటికీ అవి మనం ఎంచుకున్న రాజకీయవ్యవస్థ మౌలిక విలువలను కూలదోస్తాయి. ప్రజామోదం పొందిన రాజ్యాంగవ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతిని శాంతియుత మార్గాల ద్వారా సమస్యలకు పరిష్కారాలు కనుగొనే పద్ధతి బలహీనపడుతుంది. అది కోర్టుల అధికారాన్నీ, చట్ట నియమాలనూ ధ్వంసం చేసి న్యాయపరమైన వివేకం కంటే మంది బలానికే పైచేయిగా చూపెడుతుంది. అది వినాశనానికి, భ్రాతృహత్యల సమరాలకు, ప్రజాందోళనలకు, మనం పవిత్రంగా భావించే ప్రతి దానికీ విఘాతం కలిగించేందుకూ దారితీస్తుంది. జాతి అత్యంత విలువైనదిగా భావించే సహనం అటువంటి తప్పుదారి పట్టించే అత్యుత్సాహం వల్ల వికృతమవుతుంది.

నిర్మించిన వేదిక దేనికి పనికివస్తుందనే విషయంలో ప్రభాత్‌ కుమార్‌ చెప్పిన మాటల్లోనే అయితే.. ‘నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములైనవారి ప్రకటనలను బట్టి నిర్మించతలపెట్టిన రామమందిరం నిర్మించేట్లయితే ఈ అరుగు సింహ ద్వారానికి తొలిమెట్టు. కోర్టు ఒక కమిటీని నియమించింది. అందులో యస్‌.రామ్‌. రిజిస్ట్రార్‌ జనరల్‌ సుప్రీంకోర్టు; ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్‌ కే.కే.నాయర్‌, న్యూఢిల్లీలోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌కు చెందిన ప్రొఫెసర్‌ అరవింద కిషన్‌ ఉన్నారు. ఆ కమిటీ సమర్పించిన నివేదికలో నిర్మాణ స్వరూప స్వభావాలు వివరించబడినాయి.

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo