వంచనే బీజేపీ చరిత్ర

ప్రేమ, అభిమానం, ఔదార్యం పెదవులు దాటనప్పుడు ఫలితం శూన్యం. తెలంగాణపై తమకున్నంత ప్రేమ ఇంకెవరికీ లేదన్నట్లుగా లోకల్ చేలాలు, చెంచాలే గాక జాతీయస్థాయి పదవులలో కూర్చుని అబద్ధాల అడ్డాలుగా హైదరాబాద్ నగరం గల్లీలలో తమ జీవితాల్లో మొదటిసారి ప్రచారయాత్రలు నిర్వహిస్తున్న నడ్డాలు సైతం పగటి కలలు కంటున్నారు. ఈ కలలు వాస్తవాలకు భిన్నంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. బీజేపీ నాడు కేంద్రంలో అధికారం కోసం ఇచ్చిన హామీలన్నీ పచ్చి అబద్ధాలని రుజువైంది. మోదీజీ నేతృత్వంలో మొదటి కేంద్రమంత్రివర్గ సమావేశంలోనే తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే నిర్ణయం జరిగింది. ఇదీ బీజేపీ ప్రేమ!
రాష్ట్రంలో నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తున్న, మహా సేనాని కేసీఆర్ నాయకత్వంలోని అసలయిన, సిసలయిన ప్రజా ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ నేతలు సంబరాలు జరపాలనుకుంటున్నారు. కేంద్రం నల్ల బిల్లులకు వ్యతిరేకంగా వేల సంఖ్యలో రైతులు అన్ని అవరోధాలను, ఆంక్షలను అధిగమిస్తూ దూసుకరావడంతో ఢిల్లీ గద్దె బీటలు వారుతున్నదని ఇక్కడ హైదరాబాద్‌లో అవాకులు చెవాకుల అబద్ధాల అడ్డాలు నడ్డాలు గమనించడం లేదు. తెలంగాణ ప్రజల చరిత్రాత్మక పోరాటశక్తి ముందు ఈ నడ్డాలు నథింగ్. ఈయన తాత ముత్తాతలు రాజకీయ కింగ్‌కాంగ్‌లు. అబద్ధాలే ఆమ్లజనిగా జీవిస్తూ, సభ్యనాగరిక సమాజం వెలివేయగా దూరంగా బతికారన్నది కఠోర సత్యం. ఈ పార్టీ సన్యాసి కలర్ పార్టీ, గత ముప్ఫయ్యేండ్లలో మొదటి పేరు మార్చుకుని నేతిబీరకాయ పేరు పెట్టుకున్న పార్టీ. ఇది నిన్నమొన్నటి వరకు తన పుట్టుక గురించి, తన మాతాజీ గురించి చెప్పడానికి భయపడేది.
ఈ పార్టీ మాతాజీ 1947 ఆగస్టు 15 వరకు ఆంగ్లేయ పాలకులకు ఊడిగం చేస్తూ బానిసగా, దేశభక్తి రహిత దేశద్రోహిగా బతికిందన్నది చారిత్రక సత్యం. మహాత్మాగాంధీ సారథ్యం వహించిన భారత జాతీయ స్వాతంత్య్ర ఉద్యమాలతో, నిజాం నాటి తెలంగాణ విముక్తి పోరాటాలతో, ఉద్యమాలతో, తెలంగాణ రాష్ర్ట ఉద్యమాలతో ఎన్నడూ ఎటువంటి సంబంధం లేని ఈ పార్టీ పిచ్చి వేషాలేస్తున్నది. మన జాతిపితగా, ప్రపంచమంతా అహింసామూర్తిగా గౌరవం పొందుతున్న గాంధీని చంపిన హంతకుడికి ఆలయాలు కట్టి అర్చనలు చేస్తామన్న దుష్టులను దూరం చేయకుండా ఆశ్రయం ఇచ్చి గౌరవిస్తున్న అరాచక పార్టీ ఇది! గత వైభవ చరిత్రలేని పార్టీ గనుక భారత స్వాతంత్య్ర సమర మహానాయకులను కొందరిని ఘోరంగా కిడ్నాప్ చేసి వారికి కాషాయంరంగు పులుముతున్నది. ఈ పార్టీ చేతికి చిక్కిన (ఆయన చిక్కలేదు) ఒక మహా నాయకుడు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్. ఆయన విగ్రహం ఒకటి పెట్టి తమవాడే అన్నట్లు దుష్ర్పచారం చేస్తున్నది. నెహ్రూ అంతటి దేశభక్తులు ఇంకెవరూ లేరని, ఆయనతో తనకు ఏ విభేదాల్లేవని పటేల్ స్వయంగా చేసిన ప్రకటన ప్రపంచం కండ్ల్లముందు ఉన్నప్పటికీ, ఈ అబద్ధాల పుట్ట, అక్రమాల గుట్ట పార్టీ దుష్ర్పచారం ఆగడం లేదు. ఇది గతంలేని, భవిష్యత్తు లేని నిర్జీవ పార్టీ.
ఒక మహా నాయకుడు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహం ఒకటి పెట్టి తమవాడే అన్నట్లు దుష్ర్పచారం చేస్తున్నది. నెహ్రూ అంతటి దేశభక్తులు ఇంకెవరూ లేరని, ఆయనతో తనకు ఏ విభేదాల్లేవని పటేల్ ప్రకటించినప్పటికీ, ఈ అబద్ధాల పుట్ట, అక్రమాల గుట్ట పార్టీ దుష్ర్పచారం ఆగడం లేదు. ఇది గతంలేని, భవిష్యత్తు లేని నిర్జీవ పార్టీ.
పటేల్ తరువాత నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను ఈ సన్యాసి రంగు పార్టీ తన గుడారంలో చేర్చుకోవాలనుకున్నది. ఆ ఆటలు సాగలేదు. అరవయ్యేండ్ల రాజకీయ నిర్విరామ, నిష్కామ జీవితంలో మచ్చలేని మహా నాయకుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనను అబద్ధాల వానాల హామీలతో, అఫిడవిట్లతో మోసగించి (ఆయననే కాదు, అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును గూడ!) ఇబ్బందుల పాలుచేసింది ఈ పార్టీ అగ్ర నాయకులే. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత డిసెంబర్ 21వ తేదీన పార్లమెంటులో అప్పటి ప్రధాని పీవీ లౌకికవాద ఆవశ్యకతను చాటిచెప్పారు. తాను మతానికి వ్యతిరేకమేమీకాదని, మతాన్ని ఎన్నికల్లోకి, రాజకీయాల్లోకి తీసుకువస్తుండటం అభ్యంతరకరమని అన్నారు.
తాను లౌకికవాదం, అలీనవాదం, పేదరిక నిర్మూలనకు కట్టుబడి ఉండేవాడినని మరో ముఖ్య సందర్భంలో పీవీ ఉద్ఘాటించారు. 2014 మే 26న కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే ప్రధాని మోదీజీ అలీన విదేశాంగ విధానాన్ని, లౌకికవాదాన్ని పాతిపెట్టడం ప్రారంభించారు. పెద్ద నోట్లరద్దు వంటి అక్రమ చర్యల వల్ల కోట్ల మంది సామాన్యులు కష్టాలు పడుతారని, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందన్న అమర్త్యసేన్, రఘురాంరాజన్ తదితర ఆర్థికవేత్తల తీవ్ర విమర్శలను సైతం మోదీ ప్రభుత్వం ఎంతమాత్రం ఖాతరు చేయలేదు. భారత పౌరసత్వ చట్టంలో మార్పులపై, పౌరుల జాతీయ రిజిస్టర్ వంటి ప్రయోగాలపై తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నా కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి జ్ఞానోదయం కావడం లేదు.
అబద్ధాలలో, అక్రమాలలో పుట్టి పెరుగుతున్న (సత్వర భవిష్యత్తులో విరిగి పడబోతున్న) మోదీజీ ప్రభుత్వపు తాజా జిమ్మిక్కు కరోనా నివారణ కోసం రూపొందిస్తున్న వ్యాక్సిన్ ఉత్పత్తి పరిశీలన, సమీక్ష సాకుతో ‘జీహెచ్ఎంసీ’ ఎన్నికలు జరుగుతున్న హైదరాబాద్‌కు రావడం! వైద్య శాస్త్రజ్ఞులెవరూ వెంట లేకుండా ఈ పనిచేయడం నిజంగా మిలీనియం జోక్.
తాజావార్తలు
- తెలంగాణ సూపర్
- ఈడబ్ల్యూఎస్ కోటాతో సమతూకం
- మేధోకు 2211 కోట్ల కాంట్రాక్టు
- 18 దేశాల్లో టిటా కమిటీలు
- టీజీటీఏ ప్రధాన కార్యదర్శిగా మల్లేశ్
- 25 నుంచి పీజీ ఈసెట్ స్పెషల్ కౌన్సెలింగ్
- ఆయుష్ పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
- 24, 25న ఈఎస్సీఐ ఎంబీఏలో స్పాట్ అడ్మిషన్లు
- గిరిజనుల ఆర్థికాభివృద్ధే ఐటీడీఏ లక్ష్యం
- ఓయూ దూరవిద్య డిగ్రీ ఫలితాలు