బలగాల తీరుతో భయాలు పదవ అధ్యాయం కొనసాగింపు...

యోధ్యలో స్థితి కేంద్ర బలగాలకు చెందిన ఇద్దరు పోలీసు కంట్రోల్‌రూమ్‌కు వెళ్లి చూసేందుకు వచ్చామని అక్కడి వాళ్లకు చెప్పి రెండు మూడు రోజుల తర్వాత వాళ్లే స్వయంగా ఆక్రమించుకునేట్లుగా ఉంది. అంతేగాక అకేంద్ర బలగాలకు చెందిన అధికారులు పత్రికల వాళ్లకు ఇలా చెప్తున్నారు.. వాళ్లు జిల్లా అధికారుల ఆధీనంలో కార్యభారాన్ని నిర్వహించరట. కారణం అది కేవలం సాంకేతికపరమైనది కావటం, వాస్తవానికి వాళ్లు ప్రాంతీయ అధికారుల చెప్పుచేతల్లో ఉండక స్వతంత్రంగా వ్యవహరిస్తారట.
కేంద్ర బలగాల ఇటువంటి అవాంఛనీయ ప్రవర్తనవల్ల అయోధ్యకు చెందిన ప్రజలు రకరకాల భయభ్రాంతులకు లోనవుతున్నారు. వాళ్లపట్ల ప్రజల్లో ఉద్రిక్తత ప్రబలుతున్నది. కేంద్ర బలగాల ప్రవర్తన వల్ల సమీప భవిష్యత్తులో స్థానిక ప్రజలకు, కేంద్ర బలగాలకు మధ్య ఘర్షణ ఏర్పడే స్థితి నెలకొంటున్నదనే విషయాన్ని కాదనేందుకు లేదు. ఒకవేళ అలా జరిగితే దానికి పూర్తి బాధ్యత కేంద్రమే స్వీకరించాల్సి వస్తుంది. మహాశయా.. నేను తిరిగి మీకు విజ్ఞప్తి చేసేదేమంటే.. అలా వ్యవహరించి సామాజిక నీతిని ఉల్లంఘిచవద్దనీ, ప్రజాస్వామిక సంప్రదాయాలకు ముప్పువాటిల్లకుండా చూడమని. నా ఈ ఆలోచనలపై దృష్టినిల్పి అనవసరంగా తరలించిన కేంద్ర బలగాలను వెంటనే వెనక్కి పిలిపించేందుకు తగిన ఆజ్ఞలు జారీ చేస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను.
గౌరవాలతో భవదీయ (సం) కల్యాణ్‌సింగ్ అనుబంధం XI: 1992 డిసెంబరు 1 నుంచి 5 వరకు కేంద్ర హోంమంత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి రాసిన లేఖలు డీ.ఓ.నం.81011/1/92-Ay-11
హోంమంత్రి భారత ప్రభుత్వం,న్యూఢిల్లీ 110001,డిసెంబర్ 1, 1992
ప్రియమైన శ్రీ కల్యాణ్సింగ్జీ,దయచేసి మీ డీ.ఓ. లెటర్ నం.91/VI-Sanipr/92 Dt.25-11-1992, No.PM/122/CM/92 Dt.30-11-1992 ప్రధానికి రాసిన లేఖలు చూడండి. అందులో మీరు వివాదంలో ఉన్న కట్టడపు భద్రత విషయాలు తెలియజేస్తూ ఉత్తరప్రదేశ్ కీలక ప్రదేశాల్లో ఉంచిన కేంద్ర పారా మిలిటరీ బలగాలను ఉపసంహరించవలసిందిగా కోరారు. రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంతగా పట్టించుకుంటున్నదో దానిన పునరుద్ఘాటించనవసరం లేదనుకుంటాను. ఆ కట్టడానికి ఉద్దేశపూర్వకంగా గానీ, అనుకోకుండా గాని ఏ మాత్రం ముప్పు వాటిల్లినా అది మతపరంగా తీవ్ర పరిణామాలకు దేశంలో వివిధ ప్రాంతాల్లో శాంతి భద్రతల సమస్యకు దారితీస్తుందనే భావనే కేంద్రం పట్టించుకోవటానికి కారణం. ఈ కారణంగానే నేను పలు సందర్భాల్లో మీ దృష్టిని ఈ ముఖ్యమైన విషయం వైపుకు మళ్లించటం జరిగింది. ఆ కట్టడానికి భద్రతను కట్టుదిట్టం చేయమని కోరటం జరిగింది.
(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)
తాజావార్తలు
- ఆరో పెండ్లి : ఈసారి బాడీగార్డ్‌తో..
- డీఆర్డీఓ ఆధ్వర్యంలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ కోర్సులు
- జాన్వీకపూర్ కు 'వర్క్ ఫ్రమ్ హోం ' నచ్చలేదా..?
- గజ్వేల్‌ను అంతర్జాతీయ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం
- ఇల్లు ఎక్కడ కొనాలో చెప్పండి: రిషబ్ పంత్
- రేపు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నాం..
- ‘రక్షణ పరికరాల తయారీలో బలీయ శక్తిగా భారత్’
- కరీం‘నగరం’లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి : మంత్రి గంగుల
- కొవిడ్ నిబంధనలు కాదన్నందుకు భారీ జరిమానా
- సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ : 400 మంది బాలికలకు బెదిరింపులు