మంగళవారం 01 డిసెంబర్ 2020
Editorial - Oct 26, 2020 , 23:16:07

సేవాతత్పరుడు

సేవాతత్పరుడు

అనారోగ్య కారణంగా 2014, అక్టోబర్‌ 27న కన్నుమూసిన బోవేరాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘన నివాళులర్పించింది. బోయినపల్లి వెంకటరామారావు గారు ఈ జాతికి చేసిన సేవలకు గుర్తుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్మశ్రీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించటం ఆయన సేవాతత్పరతకు నిదర్శనం.

నిజాం నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా ఉత్తర తెలంగాణలో పోరాడిన వీరయోధుడిగా పేరు గాంచిన వారు బోయినపల్లి వెంకటరామారావు. ఆయన భూదానోద్యమం, క్విట్‌ ఇండియా  ఉద్య మం, గ్రామ స్వరాజ్య ఉద్యమం, వందేమాతర ఉద్యమం, హరిజనోద్ధరణ ఉద్యమం, అక్షరాస్యతా ఉద్యమం, గ్రంథాలయ ఉద్యమం లో కీలకభూమిక పోషించారు. 

తెలంగాణ తొలి, మలి ఉద్యమంలో వారి పాత్ర అజరామరం. బోయినపల్లి వెంకట రామారావు గారిని ముద్దుగా బోవేరా, కరీంనగర్‌ గాంధీ, తోటపల్లి గాంధీగా ప్రజలు పిలుచుకుంటారు. స్వాతంత్య్ర సమరయోధుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, కార్యదర్శిగా, దక్షిణ భారత హిందీ ప్రచార రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా సేవలందించారు.  21వ  ఉత్తమ సేవారత్నంగా దాదాపు 8 దశాబ్దాల కాలం పాటు ఈ జాతికి సేవలు అందించారు. అనారోగ్యంతో 2014 అక్టోబర్‌ 27న కన్నుమూసిన బోవేరాకు  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘన నివాళులర్పించింది. బోయినపల్లి వెంకటరామారావు గారు ఈ జాతికి చేసిన సేవలకు గుర్తుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్మశ్రీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించటం ఆయన సేవాతత్పరతకు నిదర్శనం. 1920 సెప్టెంబర్‌ 2న తోటపల్లి గ్రామంలో బోవేరా జన్మించారు. ఈ సంవత్సరంతో ఆయన వంద సంవత్సరాల జయంత్యుత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఆయన ఆశయాలను నెరవే ర్చటం కోసం ప్రతినబూనాలి. 

- డాక్టర్‌ రవికుమార్‌ చేగొని

(వ్యాసకర్త: తెలంగాణ గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్‌)

(నేడు స్వాతంత్య్ర సమరయోధుడు తెలంగాణ గాంధీ, బోయినపల్లి వెంకటరామారావు వర్ధంతి)