శుక్రవారం 04 డిసెంబర్ 2020
Editorial - Oct 25, 2020 , 02:11:50

జ్ఞానమే కర్మకు ముగింపు

జ్ఞానమే కర్మకు ముగింపు

ఫలస్య కారణం పుష్పం

ఫలం పుష్ప వినాశకం

జ్ఞానస్య కారణం కర్మ

జ్ఞానం కర్మ వినాశకం

మనం ఒక ఫలితాన్ని సాధించడం కోసం, ముందుగా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అప్పటికి అవి అనవసరం అనిపించినా ఫలితాన్ని సాధించడంలో అవి అత్యవసరాలుగా ఉంటాయి. ఒక పండు పండటానికి ముందు పువ్వు పూయడం, పరపరాగ సంపర్కం, పిందె ఏర్పడటం, కాయ కాయడం... లాంటి పరిణామాల తర్వాత పండుగా మార్పు చెందుతుంది. మొదలే పండు లభించదు. అలాగే జ్ఞాన సముపార్జనకు ప్రారంభంలో ఒక గురువు పలకా, బలపం లేక ఇతర బోధనాసామాగ్రి అవసరం. పండు పండిన తర్వాత పూవు రాలిపోయినట్టు జ్ఞానం లభించిన తర్వాత, ఇతర కర్మలన్నీ తొలగిపోతాయి.


- టి.సుధాకరశర్మ