శుక్రవారం 04 డిసెంబర్ 2020
Editorial - Oct 25, 2020 , 02:11:51

నేను ఊరోన్ని

నేను ఊరోన్ని

దాయమ్మ పురుడు పోస్తె పుట్టినోన్ని;

నాయనమ్మ మురిపెంలో పెరిగినోన్ని;

సోపతోల్లతో చిర్రగోనె ఆడినోన్ని;

నేను ఊరోన్ని


వానకురిస్తే, ఉరిసే ఇంట్లో గడిపినోన్ని;

చుట్టాలింటికొస్తే మురిసినోన్ని;

పాషా మామ పెరట్లో ఆడినోన్ని;

పాల్‌ అంకుల్‌ వాకిట్లో పెరిగినోన్ని;

నేను ఊరోన్ని


మార్కండేయ గుడిలో భజనలు చేసినోన్ని

మా ఊరి గడిలో గోలీలాట ఆడినోన్ని;

‘అహం వైవ్వానరో భూత్వా...’ అంటూ

శ్లోకాలు వల్లె వేసినోన్ని;

‘చించింతలె చిన్నంగితలె... అంటూ

జాజర పాటలు పాడినోన్ని;

నేను ఊరోన్ని


దసరా నాడు దోస్తులతో

‘అలయ్‌ భలయ్‌' చేసినోన్ని;

పీర్ల పండుగనాడు

‘అస్సయ్‌ దుల’ అంటూ ఎగిరినోన్ని;

ఊరు నేర్పిన ఆత్మైస్థెర్యం కలవాన్ని;

మారుతున్న విలువలకు మౌనసాక్షిని;

నేను ఊరోన్ని

రుద్రూరోన్ని;

ఏ ఇజమూ తెల్వని

ఊరిజపోన్ని;

- చంద్రశేఖర్‌గౌడ్‌ మామిండ్ల, 9696496666