మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - Sep 14, 2020 , 23:35:21

హామీలిచ్చినా ఆందోళనకరమే

హామీలిచ్చినా ఆందోళనకరమే
  • ఏడో అధ్యాయం కొనసాగింపు..

సుప్రీం కోర్టుకు నివేదించే విషయంలో రాజ్యాంగంలోని వివిధ సూత్రాలను పేర్కొంటూ ప్రభుత్వం తన అభిమతం ఇంతేనని అనటం లేదని, చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని యస్‌.బి.చవాన్‌ తెలియజేశారు. ఈ విషయమై సుప్రీంకోర్టుకు నివేదించే ముందు వివిధ పక్షాల మధ్య అవగాహన ఉండాలన్నారు. అటువంటి అవగాహన సాధ్యపడితే పరిస్థితి తీవ్రతను తగ్గించటంలో వాళ్లు మరింతగా సఫలీకృతులు కాగలరని, పైగా ప్రభుత్వం ‘సామరస్య పూర్వక పరిష్కారానికై అన్ని సాధనాలనూ పూర్తిగా వినియోగించుకోవాల్సి ఉంది’ అని చెప్పారు. కేంద్రానికి ఉన్న వివిధ మార్గాలను విశదీకరిస్తూ హోంమంత్రి ఇంకా ఏమి చెప్పారంటే ఈ వివాదాన్ని సుప్రీంకోర్టుకు రాజ్యాంగంలోని అధికరణం 143, 138 (2) లేక 139 కింద నివేదించవచ్చు. అయితే అలా నివేదించే ముందు సంబంధిత కక్షిదారుల మధ్య ఒక అవగాహన కుదరాల్సి ఉంది; వాళ్లు కోర్టు ఉత్తర్వులకు లోబడి ఉంటామని అంగీకరించాల్సి ఉంది.

అధికరణం 138 (2) కింద సుప్రీంకోర్టు త్వరితగతిన పరిష్కారాన్ని కనుగొనేందుకు గాను తన పరిధిని విస్తరింపజే యవచ్చును. అయితే అందు కు రాష్ట్ర ప్రభుత్వపు అంగీ కారం కావల్సి ఉన్నది. దానిని కల్యాణ్‌సింగ్‌ అందించలేదు. తొలుత కొంత ఊగిసలాట తర్వాత యూపీ ప్రభుత్వపు వాంగ్మూలం విషయంలో మందిర నిర్మాణ ఉద్యమంలో పాల్గొంటున్న వివిధ సంస్థల వారు ఒక అంగీకారానికి రాగలిగారు. డిసెంబరు 5 నాటికి తర్వాత రోజు ప్రారం భం కానున్న కరసేవలో కొన్ని మతపరమైన పూజలు, ప్రతీకాత్మక మానవ శ్రమ మాత్రమే ఉంటాయనీ, నిర్మాణ కార్యక్రమం జరగబోదనేది అందరూ అంగీకరించిన విషయమే. 1992 డిసెంబరు 5న కేంద్రీయ మార్గ నిర్దేశిక మండలి కూడా సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారంగా ప్రతీకాత్మక కరసేవ మాత్రమే చేపట్టబడుతుందని తన నిర్ణయాన్ని ప్రకటించింది. డిసెంబరు 6న టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక ఈ వార్తను ప్రచురించింది: ‘కరసేవకులు హింసాయుత పద్ధతులకు దిగగలరనే భయాందోళనలకు దూరంగా తన ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులను వాచా, కర్మణా పాటిస్తూ అయోధ్యలో సేకరించిన 2.77 ఎకరాల భూమిలో ప్రతీకాత్మక కరసేవ కొనసాగించబడుతుందని ముఖ్యమంత్రి శ్రీ కల్యాణ్‌సింగ్‌ నొక్కి వక్కాణించారు.’

అయితే ఈ విసిగించే సమస్య శాంతియుతంగా పరిష్కరింపబడాలంటే ముస్లిం మత నాయకులు స్వచ్ఛందంగా వివాదంలో ఉన్న కట్టడాన్ని హిందు వులకు అప్పగించాలి. ఆ విధంగా చేయటం వల్ల ప్రతిఫలనంగా వాళ్లకు అయోధ్యకు పది కిలోమీటర్ల దూరంలో పెద్ద మసీదు నిర్మాణానికి కావలసిన స్థలాన్ని ముస్లిములకు అప్పగించాల్సి ఉంది. దాని నిర్మాణానికి కూడా హిందువులు కరసేవను అందించవచ్చని ముఖ్యమంత్రి వాక్రుచ్చారు. ఇంకా ముఖ్యమంత్రి చెప్పిందేమంటే- ‘కరసేవకులందరూ క్రమశిక్షణతో మెలిగే వారు; చట్టబద్ధంగా వ్యవహరించేవారు. రేపటి కరసేవలో ఎటువంటి అవాంఛ నీయ సంఘటన చోటుచేసుకోబోదని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని పూర్తిగా అదుపులో ఉంచగలుగుతుందనీ కనుక ఏ విధమై న ఆందోళనకు కారణం కానరాదు’ అన్నారాయన. అయితే కేంద్ర భద్రతా బలగాల కదలికలు మాత్రం కొంత అకారణ భయాలను ప్రజల్లో కలిగించవ చ్చునని ఆయన సందేహాన్ని వెలిబుచ్చారు.

ఈ వ్యవహారంలో తమ పార్టీ వైఖరిని పునరుద్ఘాటిస్తూ ముఖ్యమంత్రి తమ ప్రభుత్వం రామమందిర నిర్మాణానికి కట్టుబడి ఉందన్నారు. అందుక్కారణం ప్రజలు బీజేపీని అధికారంలోకి తెచ్చింది మందిర నిర్మాణం చేపడుతుందనే విశ్వాసంతోనే. ‘ఏదేమైనా మేము ఎన్నికల వాగ్దానాన్నుంచి వెనక్కి తగ్గేది లేదు. అంటే దానర్థం మేము కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తామని కాదు’ అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఇంకా వెల్లడించిన ప్రకారం వివాదంలో ఉన్న కట్టడం భద్రత కోసం, ఎదురయ్యే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తగిన చర్యలన్నీ గైకొనటం జరిగిందన్నారు. కొత్తగా చేపట్టిన చర్య ఏమంటే అదనంగా పదమూడు కంపెనీల ప్రాంతీయ సాయుధ కానిస్టేబుళ్లను మోహ రింప జేసి ప్రవేశ మార్గాలలో లోహాలను పసిగట్టే యంత్రాలను (మెటల్‌ డిటెక్టర్లను) అమర్చటం జరిగింది. అయినా తగినంతగా హామీ లభించలేదని తలచిన కేంద్ర హోంమంత్రి కరసేవ జరగటానికి ఒకరోజు ముందుగా హెచ్చ రికలతో కూడిన లేఖను కల్యాణ్‌సింగ్‌కు రాస్తూ భద్రతా ఏర్పాట్లలోని లోపా లను సూచిస్తూ వాటిని వెంటనే కట్టుదిట్టం చేయవలసిన అవసరాన్ని తెలియ జేశారు. (అనుబంధం XI చూడండి). ఆయన అందులో పేర్కొన్న ప్రకారం కరసేవకులు అశాంతికి గురవ్వటమే గాక యుద్ధోన్మాద చిత్తవృత్తితో ఉన్నారని వార్తలు అందుతున్నాయి. వాళ్లల్లో చాలామంది విస్తృతంగా త్రిశూలాలు ఖరీదు చేస్తున్నారని వాటిని హానికర ప్రయోజనాలకు వాడవచ్చునని తెలియ వస్తూంది. వాళ్ళల్లో కొందరు కేంద్ర బలగాల పట్ల విరోధభావంతో ఉన్నట్లు తెలియవస్తూంది. కరసేవకులు పెద్ద సంఖ్యలో తరలిరావటంతో మందిరాన్ని సందర్శించే భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగినట్లు కూడా వార్తలందు తున్నాయి.

మీకు గతంలో తెలియజేసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భద్రతా చర్యలు సరిపోయేట్లుగా లేవు- మరీ ముఖ్యంగా ఏదైనా హింస చెలరేగినట్లయి తే బయటి, లోపలి ప్రాకారాలకు గల ప్రవేశాల వద్ద ఏర్పాటుచేసిన కట్టడి చాలి నంతగా లేదు. అందువల్ల వివాద కట్టడం వైపునకు సందర్శకులు పెద్ద సంఖ్య లో దళాలు దళాలుగా రావటంతో తోపులాటకు అవకాశం ఉంది. అలాగే సంకీ ర్తన ప్రదేశంలో ప్రజలు గుంపులు గుంపులుగా స్వేచ్ఛగా, అడ్డూ అదుపూ లేకుం డా చేరుకుంటున్నారని కూడా వార్తలందుతున్నాయి. 1992 డిసెంబరు 4న గుంపుల ఒత్తిడి కారణంగా అడ్డంగా కట్టిన బాజులు దెబ్బతిన్నాయని కూడా వార్తలందాయి. ప్రజలు తీర్థం వైపునకు నెట్టుకుపోయే ప్రమాదం ఉంది గనుక అది పోలీసుల జోక్యంతోనే అరికట్టగలం. అడ్డంగా కట్టిన గుంజలను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రత్యేకించి చెప్ప పనిలేదు. ఇంకా భద్రతా ఏర్పాట్లలోని మరికొన్ని లోపాలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి ఫాక్స్‌ మెస్సేజ్‌ నం. 80011/ 1/921Ay./1/4-12-1992 ద్వారా తీసుకురావటం జరిగింది.

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo