ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Aug 25, 2020 , 23:09:32

వెలుగులు పంచే సూర్యుల్లారా!

వెలుగులు పంచే సూర్యుల్లారా!

వెలుగులు పంచే సూర్యుల్లారా

మసకబారితిరా.. మసకబారితిరా..

మన జాతి కోసం మీ ప్రాణాలొడ్డితిరా..

మీ త్యాగానికి మా శ్రద్ధాంజలి.. 

అందుకోండి మా నీరాజనాలు

॥ వెలుగులు పంచే సూర్యుల్లారా ॥

ఎక్కడో పుట్టితిరి గారాబంగా

పెరిగితిరి, సాంకేతిక విద్యను సాధించి

విద్యుత్‌ వెలుగులు నింప ఈ కొలువులలో

చేరితిరా, రేయింబవళ్లూ కష్టపడుతూ

వెలుగులు పంచే చంద్రుల్లారా 

గ్రహణం మింగిందా.. మిమ్మల్ని గ్రహణం మింగిందా..

॥ వెలుగులు పంచే సూర్యుల్లారా ॥

సాగరగర్భంలో జలశక్తిని.. విద్యుత్‌శక్తిగా

మార్చే యంత్రాలను నియంత్రించే తాంత్రిక 

దివ్వెళ్లారా.. చీకటి మింగిందా?

మిరుమిట్లు గొలిపే కాంతులనిచ్చే మీ

కిరణాలు అస్తమించాయా..?

మీ కుటుంబాలను ఈ విషాదం

శోకసంద్రంలో ముంచిందా?

॥ వెలుగులు పంచే సూర్యుల్లారా ॥

కరోనాను జయించిన ఒకరు

కష్టాలు ఎదిరించి మరొకరు

అమ్మానాన్నలకు భార్యాపిల్లలకు

దూరంగా ఉంటున్న మీరందరూ

కర్తవ్యం కోసం నిరంతరం పాటుపడుతూ

జాతి కోసం అగ్నికి ఆహుతైన

విద్యుత్‌ తారాజువ్వల్లారా అందుకోండి

మా జోహార్లు.. మీ త్యాగానికి మా నీరాజనాలు..

మీ త్యాగాన్ని మర్చిపోము మేము..

మీ కుటుంబాలకు బాసటగా ఉంటాము మేమంతా

॥ వెలుగులు పంచే సూర్యుల్లారా ॥ 

- నాగభూషణం పరికె

(సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ ట్రాన్స్‌కో, విజిలెన్స్‌, హైదరాబాద్‌ సెంట్రల్‌ సర్కిల్‌)


logo